బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ -శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “ఎర్రచీర – ది బిగినింగ్”. ఈ సినిమాలో నటుడు రాజేంద్రప్రసాద్ ముద్దుల మనవరాలు బేబీ సాయి తేజస్విని నటిస్తోంది. “ఎర్రచీర – ది బిగినింగ్” మూవీకి సుమన్ బాబు స్వీయ దర్శకత్వం వహిస్తూ ఒక ముఖ్య పాత్ర పోషించారు. మదర్ సెంటిమెంట్, హార్రర్, యాక్షన్ కథతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ నెల 27న “ఎర్రచీర – ది బిగినింగ్” గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. శనివారం ఉదయం సినిమా ట్రైలర్ ను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగిన కార్యక్రమంలో ఘనంగా రిలీజ్ చేశారు. ప్రముఖ నిర్మాత సి. కల్యాణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో
*నిర్మాత సి.కల్యాణ్ మాట్లాడుతూ* – “ఎర్రచీర – ది బిగినింగ్” సినిమా ట్రైలర్ బాగుంది. మా సుమన్ ఈ మూవీని పట్టుదలతో పూర్తి చేసి రిలీజ్ కు తీసుకొస్తున్నాడు. సెంటిమెంట్ ఉన్న హారర్ సినిమాలు తప్పకుండా సక్సెస్ అవుతాయి. అలాంటి మంచి కంటెంట్ “ఎర్రచీర – ది బిగినింగ్” సినిమాలో కనిపిస్తోంది. సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా. సుమన్ బాబు బరువు తగ్గి మరిన్ని మంచి మూవీస్ చేయాలని కోరుకుంటున్నాను అన్నారు.
*నటి సంజన శెట్టి మాట్లాడుతూ* – “ఎర్రచీర – ది బిగినింగ్” సినిమాలో మంచి రోల్ చేసే అవకాశం ఇచ్చిన డైరెక్టర్ ప్రొడ్యూసర్ హీరో సుమన్ బాబు గారికి థ్యాంక్స్. మా మూవీని తప్పకుండా మీరంతా ఇష్టపడతారు. ఈ నెల 27న థియేటర్స్ లో చూసి సపోర్ట్ చేయండి. అన్నారు.
*హీరోయిన్ కారుణ్య చౌదరి మాట్లాడుతూ* – “ఎర్రచీర – ది బిగినింగ్” సినిమా ట్రైలర్ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. నేను కూడా మీతో పాటు ట్రైలర్ చూశాను. నేను ట్రైలర్ లో మిమ్మల్ని భయపెట్టానని అనుకుంటున్నా. సుమన్ గారు ఎంతో ఎఫర్ట్స్ పెట్టి ఈ మూవీ చేశారు. అది స్క్రీన్ మీద కనిపిస్తోంది. ఈ నెల 27న థియేటర్స్ లోకి వస్తున్నాం. మీరంతా చూసి బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నా. అన్నారు.
*చిత్ర దర్శక నిర్మాత, నటుడు సుమన్ బాబు మాట్లాడుతూ* – మా “ఎర్రచీర – ది బిగినింగ్” మూవీకి మొదటి నుంచి ఎంతోమంది పెద్దలు సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. హీరో వెంకటేష్ గారి దగ్గర నుంచి ఈరోజు కల్యాణ్ అన్న వరకు మా మూవీకి సపోర్ట్ చేస్తున్నారు. వాళ్లందరికీ చాలా థ్యాంక్స్ చెబుతున్నా. ఈ రోజు మీ అందరి సమక్షంలో “ఎర్రచీర – ది బిగినింగ్” థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేసుకోవడం సంతోషంగా ఉంది. బేబి సాయి తేజస్వినీ మా చిత్రంలో అద్భుతంగా నటించింది. అలాగే కారుణ్య ఒక సీన్ కోసం 2 రోజులు పట్టుదలగా వర్క్ చేసింది. మా సినిమాకు చాలా మంది పెద్ద ఆర్టిస్టులు వర్క్ చేశారు వారంతా సపోర్ట్ చేస్తున్నారు కానీ ఒక్క కమల్ కామరాజు అనే యాక్టర్ మాత్రం మా ఫోన్స్ ఆన్సర్ చేయడం లేదు. ఆయన ఒక హీరో ఈ మూవీలో అయి ఉండి కూడా మాకు ప్రమోషన్ కు రావడం లేదు. ఎంతో కష్టపడి మాలాంటి వాళ్లం మూవీ చేస్తే కనీసం ప్రమోషన్ కు రాకపోవడం బాధాకరం. ఈ నెల 24న ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయబోతున్నాం. 27న మూవీని రిలీజ్ చేస్తాం. ప్రేక్షకులకు మా మూవీ కోసం ఒక కాంటెస్ట్ పెడుతున్నాం. ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ 45 నిమిషాల్లో తిన్న ప్రేక్షకుడికి పది వేల రూపాయలు బహుమతి ఇస్తాం. అన్నారు. దాదాపు 300 థియేటర్స్ లో మా సినిమాను గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నాం. మీరంతా ఆదరిస్తారని కోరుకుంటున్నా. అన్నారు.
*నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ* – “ఎర్రచీర – ది బిగినింగ్” ట్రైలర్ చాలా బాగుంది. సుమన్ బాబు ఎంతో పట్టుదలగా ఈ సినిమా చేశారు. ఆయన శ్రమ ట్రైలర్ లో ఉన్న క్వాలిటీతో తెలుస్తోంది. పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు. ఒక చంద్రముఖి, కాంచనలాగా “ఎర్రచీర – ది బిగినింగ్” సినిమా కూడా పెద్ద సక్సెస్ కావాలి. అన్నారు.
*నటుడు, పీఆర్ఓ సురేష్ కొండేటి మాట్లాడుతూ* – “ఎర్రచీర – ది బిగినింగ్” సినిమా ఎప్పుడు వచ్చిందనేది కాదు ఎంత సక్సెస్ అయ్యింది అనేది ఈ నెల 27న తెలుస్తుంది. ఎంతోమంది పేరున్న ఆర్టిస్టులు ఈ మూవీకి వర్క్ చేశారు. అలాగే స్ట్రాంగ్ కంటెంట్ తో సినిమాను చేశారు సుమన్ బాబు గారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా “ఎర్రచీర – ది బిగినింగ్” సినిమా ఉంటుంది. ఈ సినిమా పెద్ద సక్సెస్ అయి సుమన్ బాబు గారితో పాటు టీమ్ అందరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నా. అన్నారు.
*రైటర్ గోపి విమలపుత్ర మాట్లాడుతూ* – “ఎర్రచీర – ది బిగినింగ్” సినిమాకు వర్క్ చేసే అవకాశం ఇచ్చిన సుమన్ గారికి థ్యాంక్స్. ఈ సినిమాలో అద్భుతమైన మదర్ సెంటిమెంట్ ఉంది. మంచి పాటలు ఉన్నాయి. ఆకట్టుకునే ఫైట్స్ ఉన్నాయి. తప్పకుండా మీ అందరినీ సినిమా ఆకట్టుకుంటుంది. అన్నారు.
*నిర్మాత నటుడు ఎ గురురాజ్ మాట్లాడుతూ* – “ఎర్రచీర – ది బిగినింగ్” ట్రైలర్ చూస్తే అన్ని వర్గాల ఆడియెన్స్ కు నచ్చే కంటెంట్ తో సినిమా రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ప్రేక్షకులకు ఘన విజయాన్ని అందించాలని కోరుకుంటున్నా. అన్నారు.
*నటీనటులు* – బేబి సాయి తేజస్విని, సుమన్ బాబు, శ్రీరామ్, కమల్ కామరాజు, కారుణ్య చౌదరి, అయ్యప్ప పి శర్మ , సురేష్ కొండేటి, రఘుబాబు, తదితరులు
*టెక్నికల్ టీమ్*
ఆర్ట్ – నాని, సుభాష్
స్టంట్స్ – నందు,
డైలాగ్స్ – గోపి విమల పుత్ర,
లైన్ ప్రొడ్యూసర్ – అబ్దుల్ రెహమాన్,
సినిమాటోగ్రఫీ – చందు
ఎడిటర్ – వెంకట ప్రభు,
చీఫ్ కో డైరెక్టర్ – నవీన్ రామ నల్లం రెడ్డి,
రాజ మోహన్
బీజీఎం – ఎస్ చిన్న
మ్యూజిక్ – ప్రమోద్ పులిగార్ల
సౌండ్ ఎఫెక్ట్స్ – ప్రదీప్
పిఆర్ఓ – సురేష్ కొండేటి
సమర్పణ – బేబీ డమరి ప్రజెంట్స్
నిర్మాత – ఎన్. వి.వి. సుబ్బారెడ్డి, సీహెచ్. వెంకట సుమన్
కథ – స్క్రీన్ ప్లే- దర్శకత్వం – సుమన్ బాబు.