HomeTelugu"కల్యాణమస్తు" చిత్రం నుండి విడుదలైన మరో హిట్ లిరికల్ సాంగ్ "ఏమైందో ఏమైందో ఏనాడు లేనేలేని"

“కల్యాణమస్తు” చిత్రం నుండి విడుదలైన మరో హిట్ లిరికల్ సాంగ్ “ఏమైందో ఏమైందో ఏనాడు లేనేలేని”


SMS క్రియేషన్స్ పతాకంపై శేఖర్ వర్మ, వైభవి జంటగా ఓ. సాయి దర్శకత్వంలో బోయపాటి రఘుబాబు నిర్మించిన చిత్రం “కళ్యాణమస్తు”.ఈ సినిమా నుండి ఇంతకుముందు విడుదల చేసిన ముక్కు పుడక లిరికల్ సాంగ్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.ప్రేక్షకులు ఆ పాటను మరువకముందే తాజాగా ఈ సినిమా నుండి “ఏమైందో ఏమైందో” అని సాగే మరో మంచి లిరికల్ సాంగ్ ను విడుదల చేసింది చిత్ర బృందం.

ఏమైందో ఏమైందో ఏనాడు లేనేలేని
రంగుల కలలే నింపేసావే కన్నుల్లో నా..
ఏమైందో ఏ..మైందో ఏనాడు లేనేలేని
సంగీతాలే మోగించావే గుండెల్లో..నా
కలిసే కలిసే మన కళ్ళు కలలు కలిసే..
విడి పోలే..ని బంధం అల్లేసే
తెలిసే తెలిసే ప్రేమంటే నువ్వని తెలిసే
యే జన్మనా ఉంటానే కలిసే
ఈ మాటే చాలంట ఏనాటికైనా
నీ వెంటే నే..నుండనా ఓ..
నువ్వుంటే చాలంటా యే ధరినా
నవ్వేస్తూ దాటేయనా…
పిల్లా నీ వల్లే ఇన్నాళ్లు లేనేలేదు
సంతోషం చూస్తున్నాను.గా..
పిల్లా నీ వల్లే భూగోళం రెక్కలు
తొడిగి గాల్లోనా తేలుతుంది గా..
ఏమైందో….ఏమైందో ఏనాడు లేనేలేని
రంగుల కలలే నింపేసావే కన్నుల్లోనా..

అని సాగే ఈ పాటకు లిరిసిస్ట్ అలరాజు చక్కని లిరిక్స్ అందించాడు.సింగర్స్ లిప్సిక, హరిచరణ్ లు ఆలపించిన ఈ పాటకు ఆర్. ఆర్. ధ్రువన్ అద్భుతమైన సంగీతం అందించారు.సినిమాటోగ్రాఫర్ మల్లికార్జున్ నరగాని చక్కటి విజువల్స్ ఇచ్చారు

ఈ సందర్బంగా చిత్ర నిర్మాత బోయపాటి రఘుబాబు.. ఈ సినిమా నుండి ఇంతకుముందు మేము విడుదల చేసిన పాటలకు ప్రేక్షకులు చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ఇందులో హీరో, హీరోయిన్స్ ఇద్దరూ కూడా పోటీ పడి నటించారు.టెక్నిషియన్స్, నటీ నటులు అందరూ సపోర్ట్ చేయడంతో సినిమా బాగా వచ్చింది. మా సినిమా పాటలను టిప్స్ మ్యూజిక్ ద్వారా విడుదల చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు.

నటీనటులు
శేఖర్ అయాన్ వర్మ, వైభవి తదితరులు

సాంకేతిక నిపుణులు
సినిమా పేరు – కళ్యాణమస్తు
బ్యానర్ – SMS క్రియేషన్స్
నిర్మాత – బోయపాటి రఘుబాబు
రచన మరియు దర్శకత్వం : ఓ. సాయి
డి. ఓ. పి – మల్లికార్జున్ నరగాని
సంగీతం – ఆర్ఆర్. ధృవన్
సాహిత్యం – అలరాజు
గాయకుడు – లిప్సిక, హరి చరణ్
మ్యూజిక్ లేబుల్ -టిప్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (టిప్స్ తెలుగు)
లిరికల్ వీడియో – భాస్కర్ సాయి
పి. ఆర్. ఓ – ఏలూరు శ్రీను , ధీరజ్ , ప్రసాద్

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES