ఈ నెల 15 న డ్యూడ్”(DUDE) ఓటిటి యాప్ గ్రాండ్ లాంచ్

617

ఈ మధ్య సినీ ప్రేక్షకులు భారీ బడ్జెట్ సినిమాలకు మాత్రమే థియేటర్స్ కు వెళుతుండడంతో చిన్న బడ్జెట్ సినిమాలు విడుదలకు నోచుకోలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఓటిటి లో విడుదల చేయడానికి ముందుకు రావడంతో ఇటీవల ఓటీటీలకు బాగా డిమాండ్‌ పెరుగుతుంది.ఈ నేపథ్యంలో అటువంటి వారికి చేయూత నిచ్చేందుకు ఓటిటి రంగంలో సరికొత్త వినోద విప్లవం ఆవిష్కరించేందుకు సమాయత్త మవుతుంది”డ్యూడ్”(DUDE)ఓటిటి.ఈ ఓటిటి యాప్ ను ఈ నెల 15 న సినీ ,రాజకీయ అతిరదుల సమక్షంలో ఘనంగా జరుపుకోవడానికి సిద్ధమైంది.ఈ సందర్భంగా

దర్శక, నిర్మాత” డ్యూడ్”(DUDE) ఓటిటి వ్యవస్థాపకుడు ఈశ్వర్ మాట్లాడుతూ..  ఫిలిం డైరెక్టర్ ని,యాక్టర్ ను కో ప్రొడ్యూసర్ గా, ప్రొడ్యూసర్ గా చాలా సినిమాలు చేయడం జరిగింది.ఇప్పుడు డ్యూడ్”(DUDE) ఓటిటి యాప్ ను ఈ నెల 15 న లాంచ్ చేయబోతున్నాము.ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులను ఆహ్వానించడం జరిగింది. ఈ ”డ్యూడ్”(DUDE) ఓటీటీ కొత్త వారిని వెల్ కం చేయడానికి పెట్టాము. ట్యాలెంట్ ఉండి అవకాశాలు రాక, వచ్చినా మోసపోయి  వెళ్లే నటులకు, సాంకేతిక నిపుణులకు, నిర్మాతగా మరాలనే వారికి, అలాగే సినిమా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకొన్నా సినిమాను ఎలా రిలీజ్ చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడే మిడ్ రేంజ్ నిర్మాతలకు సపోర్ట్ ఇవ్వాలని ఈ డ్యూడ్ ఓటీటీ ని స్టార్ట్ చేశాము.. ఇందులోఎటిటి, ఓటిటి అనేవి రెండు ఉన్నాయి. అలాగే ఇందులో ఒరిజినల్స్ కూడా ప్రొడ్యూస్ చేస్తాము. ఇన్వెస్టర్లకు  ముందునుంచే చెపుతున్నాము. ఓటిటి కూడా థియేటర్ లాంటిదే అయితే మనం ఇంట్లో కూర్చొని చూస్తున్నాం.అంటే హోమ్ థియేటర్ లాంటిదే. ఓటిటికైనా థియేటర్ కైనా ప్రమోషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనే టటువంటి బేసిక్ నాలెడ్జ్ ఇస్తూ మన ఒరిజినల్స్ ను రిలీజ్  చేస్తున్నాము. ఈ నెల 15 న లాంచ్ అవ్వనున్న “డ్యూడ్” (DUDE) ఓటిటి యాప్ మంచి కంటెంట్ తో ప్రేక్షకులందరూ అలరిస్తుంది  అన్నారు.

ఈస్ట్ వెస్ట్ రాజీవ్ మాట్లాడుతూ..సినిమా ఇండస్ట్రీలో చాలా సినిమాలు షూటింగ్  కార్యక్రమాలు పూర్తి చేసుకున్నా కూడా విడుదలకు నోచుకోక  చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. కంటెంట్ ఉండి కూడా  రైట్ ప్లాట్ ఫామ్ లేక  సినిమాను ఎప్పుడు రిలీజ్ చెయ్యాలో తెలియక ఇబ్బంది పడుతున్న నిర్మాతలలకు రైట్ ఫ్లామ్ ఏదైనా ఉందా అంటే డ్యూడ్ ఓటిటి అని కచ్చితంగా చెప్పగలను.అలాగే డల్లాస్ లో  జరిగే క్రికెట్ టోర్నమెంట్ కూడా డ్యూడ్ లో లైవ్ స్ట్రీమింగ్  అవుతుంది.మే 15 న వస్తూన్న డ్యూడ్ ఓటిటి ఎక్కడ పుట్టింది,ఎలా పుట్టింది ఎవరికోసం వస్తుంది అనేది మెయిన్ కాన్సెప్ట్ ను ఈశ్వర్ గారు వారి టీం చెపుతుంది. సీనిమాలను బిజినెస్ గా చేసి రైట్ ఫ్లాట్ ఫామ్ లో రైట్ గా ఆడియన్స్ రీచ్ అయ్యే ప్రాసస్ లో ఈస్ట్ వెస్ట్ ఎంటర్ టైనర్  ఎప్పుడూ ముందుంటుంది. ట్యాలెంట్ ఉన్న వారిని ఎంకరేజ్ చేస్తూ వారిలోని ప్రతిభను బయటికి ఎలా తీసుకు రావాలనేది డ్యూడ్ ప్లాట్ ఫామ్ లక్ష్యం.ఈ రెండు కొలబ్రేషన్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి అనేది మే 15 న  మీకే తెలుస్తుంది అన్నారు.