HomeTeluguటియ‌ఫ్ సిసీ నంది అవార్డ్స్ కోసం దుబాయ్ షేక్ అబుస‌లీంని క‌లిసిన ల‌య‌న్‌ డా.ప్ర‌తాని...

టియ‌ఫ్ సిసీ నంది అవార్డ్స్ కోసం దుబాయ్ షేక్ అబుస‌లీంని క‌లిసిన ల‌య‌న్‌ డా.ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్‌

తెలంగాణ ప్ర‌భుత్వం స‌హ‌కారంతో ‘తెలంగాణ ఫిలిం ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌’ ఆధ్వ‌ర్యంలో `టీఎఫ్‌సీసీ నంది అవార్డ్స్ సౌత్ ఇండియా 2023` వేడుక‌లు దుబాయ్‌లో ఘ‌నంగా నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు డా.ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్‌. ఇందులో భాగంగా శుక్ర‌వారం డా.ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్ , టీమా ప్రెసిడెంట్‌, మిస్ ఏసియా ర‌ష్మి ఠాకూర్ దుబాయ్ వెళ్లి షేక్ అబుసలీంని క‌లిశారు.
ఈ సంద‌ర్భంగా ల‌యన్. డా.ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్ మాట్లాడుతూ…“`టీఎఫ్‌సీసీ నంది అవార్డ్స్ సౌత్ ఇండియా 2023` వేడుక‌లు త్వ‌ర‌లో దుబాయ్ లో చేయ‌డానికి ఏర్పాట్లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగా దుబాయ్ వ‌చ్చి షేక్ అబు స‌లీం గారిని క‌లిశాము. జులై నెలాఖ‌రు కానీ అగ‌స్టు మొద‌టి వారంలో కానీ అవార్డ్స్ ప్లాన్ చేసుకోమ‌న్నారు. షేక్ అబు స‌లీం గారు ఎంతో బాగా రిసీప్ చేసుకున్నారు. నంది అవార్డ్స్ ప‌ట్ల ఎంతో ఆస‌క్తి క‌న‌బ‌రిచారు. ప్ర‌తి ఏడాది దుబాయ్ లో నంది అవార్డ్స్ జ‌రపడానికి స‌హ‌క‌రిస్తామ‌ని మాటిచ్చారు. ఇక దుబాయ్ ప్రిన్స్, కేర‌ళ సియ‌మ్‌, తెలంగాణ మంత్రుల‌ను, బాలీవుడ్ నుంచి జాకీష‌రాఫ్‌, జితేంద్ర గారిని నంది అవార్డ్స్ కోసం ఆహ్యానిస్తున్నాం. అలాగే స‌న్నిలియోన్, ముమైత్ ఖాన్ అవార్డ్స్ వేడుక‌ల్లో ప‌ర్ఫార్మెన్స్ చేయ‌నున్నారు. ఇక మ‌న తెలుగు హీరోలు మంచు విష్ణు, శ్రీకాంత్, శివాజీరాజా ఇలా చాలా మంది ఆర్టిస్ట్స్ స‌పోర్ట్ చేస్తున్నారు. ఇక దుబాయ్ లో ప‌లు అవార్డ్స్ ఫంక్ష‌న్స్ నిర్విహించిన దినేష్ మాకు ఎంతో స‌పోర్ట్ చేస్తున్నారు. ఇలా అంద‌రి స‌హ‌కారంతో నంది అవార్డ్స్ స‌క్సెస్ చేయ‌డానికి శ‌త విధాల ప్ర‌య‌త్నిస్తున్నాం. అలాగే `మిస్ ఏసియా` ర‌ష్మి ఠాకూర్ , కొటారి గారు దుబాయ్ లో వారికున్న ప‌రిచ‌యాల‌తో నంది అవార్డ్స్ కోసం ఎంతో స‌హ‌క‌రిస్తున్నారు. చాలా కాలం త‌ర్వాత మ‌ళ్లీ చేస్తోన్న నంది అవార్డ్స్ ఫంక్ష‌న్ క‌చ్చితంగా స‌క్సెస్ అవుంతుద‌న్న న‌మ్మ‌కం ఉంద‌న్నారు.

కాన్సిలేట్ జనరల్ ఆఫ్ ఇండియా డాక్టర్ అమన్పురి గారిని సోమవారం కలవడానికి అపాయింట్మెంట్ తీసుకున్నాము. ఇంకా ప్రకాష్ నాగ మరియు చార్టెడ్ అకౌంటెంట్ రవి కుమార్ గారు చాలా సపోర్ట్ చేస్తున్నారు . ఇక్కడ దుబాయ్ ప్రిన్స్ గారిని మరియు లోకల్ వాళ్లతో కలవడానికి మాకు ఏర్పాట్లు చూస్తూ సహకరిస్తున్నారు. వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అన్నారు.

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES