సువిక్షిత్ బొజ్జ హీరోగా ‘దూరదర్శని’ సినిమా ఫస్ట్ లుక్ విడుదల..

393

సువిక్షిత్ బొజ్జ, గీతికా రథన్ జంటగా V9 విజువల్స్ బ్యానర్‌పై బేబీ రియాంషిక సమర్పణలో వస్తున్న సినిమా దూరదర్శని. మారెడ్డి ప్రశాంత్ రెడ్డి, నవీన్ నన్నపనేని సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కార్తికేయ కొమ్మి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా దూరదర్శని సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేసారు. రెట్రో లుక్‌లో ఉన్న ఓ పోస్టర్‌కు మంచి స్పందన వస్తుంది. చేతిలో పుస్తకాలు, టిఫిన్ బాక్స్ పట్టుకుని హీరో సువిక్షిత్, హీరోయిన్ గీతికా రథన్ అలా నడుకుంటూ వెళ్తున్న పోస్టర్‌కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఆనంద్ గుర్రాన సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు.. మురళీ మోహన్ రెడ్డి B సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. SR శేఖర్ ఎడిటర్. నారాయణ ఆవుల దూరదర్శని సినిమాకు రైటర్‌గా వర్క్ చేస్తున్నారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలపనున్నారు చిత్ర యూనిట్.

నటీనటులు: సువిక్షిత్ బొజ్జ, గీతికా రథన్

టెక్నికల్ టీం:
దర్శకుడు: కార్తికేయ బొమ్మి
నిర్మాతలు: మారెడ్డి ప్రశాంత్ రెడ్డి, నవీన్ నన్నపనేని
కో ప్రొడ్యూసర్: కోటేశ్వర రావు బొమ్మిన
బ్యానర్: V9 విజువల్స్
సమర్పణ: బేబీ రియాంషిక
సంగీత దర్శకుడు: ఆనంద్ గుర్రాన
DOP: బి మురళీ మోహన్ రెడ్డి
ఎడిటర్: SR శేఖర్
రైటర్: నారాయణ ఆవుల
PRO: ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్