HomeTeluguడర్టీ ఫెలో మూవీ ఫస్ట్ లుక్ ను ఆవిష్కరించిన దర్శకుడు నక్కిన త్రినాథ్ రావు

డర్టీ ఫెలో మూవీ ఫస్ట్ లుక్ ను ఆవిష్కరించిన దర్శకుడు నక్కిన త్రినాథ్ రావు


రాజ్ ఇండియా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై శాంతి చంద్ర, దీపిక సింగ్, మిస్ ఇండియా 2019 శిమ్రితీ బతీజా, నిక్కిషా రంగ్ వాల హిరో హీరోయిన్లుగా, ఆడారి మూర్తి సాయి డైరెక్షన్ లో, జీ ఎస్ బాబు నిర్మిస్తున్న చిత్రానికి డర్టీ ఫెలో అనే టైటిల్ ను ఖరారు చేసింది చిత్ర యూనిట్.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా కార్యక్రమంలో దర్శకుడు నక్కిన త్రినాథ్ రావు టైటిల్ ఫస్ట్ లుక్ ను ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో దర్శకుడు వీర శంకర్, మ్యూజిక్ డైరెక్టర్ డాక్టర్ సతీష్, హిరో శాంతి చంద్ర, హీరోయిన్ శిమ్రితీ బతీజా, చిత్ర దర్శకుడు ఆడారి మూర్తి సాయి , నటుడు కుమరన్ తదితరులు పాల్గొన్నారు

డైరెక్టర్ నక్కిన త్రినాథ్ రావు మాట్లాడుతూ; మోషన్ పోస్టర్ బాగుంది .టైటిల్ విషయంలో ఎక్కువ కాన్సంట్రేట్ చేసి జనాలకు రిచ్ అయ్యేలా వుండాలి..ఆ విధంగా ఈ దర్టి ఫెలో టైటిల్ ఈ కథ కీ యాప్ట్. హీరో శాంతి చంద్ర కొన్ని సినిమాల లో నటించారు. ఫైర్ వున్న నటుడు. సినిమా పట్ల ఫ్యాషన్ తో ఎంతో డెడికేటెడ్ గా వర్క్ చేస్తాడు..ఈ సినిమా లో తన లుక్ సుపర్బ్. దర్శకుడు మూర్తి సాయి గారు తన పంథా మార్చుకొని డాన్ సినిమాని తెరకెక్కించారని అనుకుంటున్నాను. మోహన్ రావు కి ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి మరిన్ని సినిమాలు చెయ్యాలి అన్నారు

హిరో శాంతి చంద్ర మాట్లాడుతూ; ఈ మూవీ స్టార్ చేయడానికి ముఖ్య కారకుడు దర్శకుడు మోహన్..అతను వచ్చి ఈ సినిమా గురించి చెప్పాడు. 2010 నుంచి సినిమా ఇండస్ట్రీకి దూరంగా వున్నాను..దర్శకుడు మూర్తి సాయి, కెమెరా మెన్ రామకృష్ణ ఇద్దరు వర్క్ చూసి వీళ్ళు కదా నాకు కావాలి అనుకొని సినిమా పట్ల ప్రేమ పెరిగింది. అలాగే డాక్టర్ సతీష్ గారు సహకారం మరువలేను.. అరకు, వైజాగ్, హైదరాబాద్ లో సినిమా షూటింగ్ చేసాము. మాకు బలమైన నమ్మకం ఈ సినిమా కథ..ఒక తండ్రి తనకొడుకునీ సరైన మార్గంలో పెట్టకపోతే ఆ కొడుకు విచ్చల విడిగా సమాజానికి హానికరంగా మారితే… ఆ తండ్రి తీసుకొనే నిర్ణయం ఏమిటి…తండ్రి కొడుకుల మధ్య జరిగే యాక్షన్ డ్రామా. ఇ హీరోయిన్స్ ఇద్దరు బాగా నటించారు. ఈ సినిమా లో నటించిన నటి నటులు టెక్నిషియన్స్ కు ధన్యవాదములు అని అన్నారు.

చిత్ర దర్శకుడు ఆడారి మూర్తి సాయి మాట్లాడుతూ: ప్రేక్షకులు మెచ్చే అన్ని అంశాలు మా కథలో వున్నాయి. హీరో శాంతి చంద్ర డాక్టర్ సతీష్ గారు సహకారం మరువలేను.మేము పిలవగానే మా ప్రయత్నాన్ని ఆశీర్వదించడానికి వచ్చిన దర్శకులు వీర శంకర్ గారు, నక్కిన త్రినాథ్ రావు గారు కు థాంక్స్ అన్నారు

దర్శకుడు వీర శంకర్ మాట్లాడుతూ: దర్శకుడు మూర్తి సాయి నాకు మంచి మిత్రుడు. హీరో శాంతి చంద్ర కూడా చాలాకాలం నుంచి తెలుసు. మంత్ర, 3, దహనం సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కథ మీద నమ్మకంతో ఎక్కడ రాజీ పడకుండా సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమా కి డర్టీ ఫెలో అనే టైటిల్ కరెక్ట్ గా సరిపోతుంది మంచి కథ కథనంతో వస్తున్న ఈ చిత్రం ప్రేక్షకాదరణ పొందాలని కోరుకుంటున్నాను అన్నారు

హీరోయిన్ శిమ్రితీ బతీజా మాట్లాడుతూ: నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాత లకు థాంక్స్, ఈ మూవీ లో ఒక మంచి క్యారెక్టర్ లో నటించాను. అన్ని ఎమోషన్స్ వున్న క్యారెక్టర్ నాది అని అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ డాక్టర్ సతీష్ మాట్లాడుతూ: నేను స్వతహాగా డాక్టర్ నీ సినిమాలు అంటే ఫ్యాషన్ తో ఈ సినిమాకు మ్యూజిక్ అందించాను. హిరో దర్శకుడు ఇద్దరు నాకు మంచి మిత్రులు. వాళ్లిద్దరూ ఎంతో డెడికేటెడ్ గా. ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ డర్టీ ఫెలో సినిమా అందరి మన్ననలు పొందాలని కోరుకుంటున్నాను అని అన్నారు….

నటి నటులు: శాంతిచంద్ర, దీపిక సింగ్, శిమ్రితీ బతీజా,
నిక్కిషా రంగ్ వాల హిరో హీరోయిన్లుగా నటించగా సత్యప్రకాస్, నాగి నీడు, ఎఫ్ ఎమ్ బాబాయ్, కుమరన్, రాచకొండ జయశ్రీ, నిఖేష్, టి రవి తదితర ముఖ్య పాత్రల్లో నటించారు

ఎడిటర్: జేపీ
ఫైట్స్: శంకర్
మ్యూజిక్: డాక్టర్ సతీష్
డాన్స్; కపిల్ అండ్ ఈశ్వర్
సినిమాటోగ్రఫీ: ఎస్ రామకృష్ణ,
ప్రొడ్యూసర్; జీ శాంతిచంద్ర
డైరెక్టర్;. ఆడారి మూర్తి సాయి

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES