లిటిల్ బేబీస్ క్రియేషన్స్ పతాకంపై నోరి నాగ ప్రసాద్ నిర్మాతగా, హరీష్ చావా దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం “ఇట్లు… మీ సినిమా”. అభిరామ్, వెన్నెల, మనోహర్, పవన్, కృష్ణ, మంజుల హీరో హీరోయిన్లుగా, ఎఫ్2 ఫేమ్ ప్రదీప్, అమ్మ రమేష్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఇటీవల సీనియర్ దర్శకుడు కోదండరామి రెడ్డిగారి చేతులమీదుగా “ఇట్లు… మీ సినిమా” పోస్టర్ లాంచ్ చేశారు. నలుగురు యువకులు తమకున్న ఫ్యాషన్ తో, సినిమా రంగానికి వచ్చి వాళ్లు ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి, వాళ్ళు సినీ ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యారా లేదా అన్నది కదాంశం. లవ్, రొమాన్స్, కామెడీ, సెంటిమెంట్ కలగలసిన చిత్రం “ఇట్లు… మీ సినిమా”. ప్రతి సినిమా వ్యక్తి ఇది నా కథ, అని ఫీలయ్యే లాగా ఉంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. మీరావలి అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ప్రస్తుతం ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు జరుపుకుంటోంది అన్నారు దర్శక నిర్మాతలు. ఈ చిత్రానికి డాన్స్: తాజ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బూస్సా బాలరాజు, నిర్మాత: నోరి నాగ ప్రసాద్, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: హరీష్ చావా.
దర్శకుడు కోదండరామి రెడ్డి చేతులమీదుగా “ఇట్లు… మీ సినిమా” పోస్టర్ లాంచ్
RELATED ARTICLES