ప్యాషన్ స్టూడియోస్, ఓ 2 పిక్చర్స్ బ్యానర్లు పై ప్రముఖ దర్శకుడు అట్లీ సమర్పణలో ప్రియ అట్లీ, కే పూర్ణ చంద్ర, సుదాన్ సుందరమ్ నిర్మాతలుగా వి విజ్ఞరాజన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా అంధకారం. స్వామీరారా, పిజ్జా వంటి థ్రిల్లర్స్ తో తెలుగు ప్రేక్షకులకి సుపరిచితమైన పూజా రామచంద్రన్ కీలక పాత్రలో ఈ సినిమా తెరకెక్కింది. పూజా రామచంద్రన్ తో పాటు అర్జున్ దాస్, వినోత్ కిషన్, కుమార్ నటరాజన్, మీనా గోషాల్ కూడా లీడ్ రోల్స్ లో నటించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని రిలీజ్ కి రెడీగా ఉన్న ఈ సూపర్ సస్పెన్స్ థ్రిల్లర్ ని ప్రముఖ ఓటిటి నెట్ ఫ్లిక్స్ వారు డైరెక్ట్ టు ఓటిటి రిలీజ్ పద్థతిలో విడుదల చేయబోతున్నారు. నవంబర్ 24, 2020 నుంచి నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా లైవ్ స్ట్రీమింగ్ అవుతుందని నిర్మాతలు సుదాన్, ప్రియ అట్లీ తెలిపారు. ఈ నేపథ్యంలోనే అంధకారం చిత్ర టీజర్ ను ప్రముఖ దర్శకుడు థమన్ తాజాగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా విడుదల చేసి, చిత్ర బృందానికి శుభకాంక్షలు తెలిపారు. ఈ సినిమా తమిళ వెర్షన్ అంధగారమ్ టీజర్ ని ప్రముఖ తిమళ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ విడుదల చేయడం విశేషం. టీజర్ మొత్తాన్ని స్టన్నింగ్ విజువల్స్ తో, థ్రిల్లింగ్ సౌండ్ తో డిజైన్ చేయడంతో ఆడియెన్స్ కి సినిమా మీద మరింత ఉత్కంఠ కలుగుతుంది. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా విడుదల చేస్తామని సుదాన్ తెలిపారు.
నటీనటులు
పూజా రామచంద్రన్, అర్జున్ దాస్, వినోధ్ కిషన్, కుమార్ నటరాజన్, మీనా గోషాల్
సాంకేతిక వర్గం
బ్యానర్ – ప్యాషన్ స్టూడియోస్, ఓ 2 పిక్చర్స్
సమర్పణ – అట్లీ
నిర్మాతలు – సుదాన్ సుందరమ్, ప్రియ అట్లీ, కే పూర్ణ చంద్ర
మ్యూజిక్ – ప్రదీప్ కుమార్
కెమెరా – ఎమ్ ఎడ్విన్ సకేయ్
రచన, దర్శకత్వం – వి విజ్ఞారాజన్
—
Eluru Sreenu
P.R.O