డైరెక్ట‌ర్ అనిల్‌ రావిపూడి రిలీజ్ చేసిన `6 టీన్స్‌ హీరో రోహిత్ `క‌ళాకార్` మోష‌న్ పోస్ట‌ర్..

381

`6 టీన్స్‌ హీరో రోహిత్ న‌టిస్తోన్న లేటెస్ట్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ `క‌ళాకార్‌`. ఏజీ అండ్‌ ఏజీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై వెంకటరెడ్డి జాజాపురం నిర్మిస్తున్నారు. శ్రీను బందెల దర్శ‌కుడు. షాయాజీ షిండే, పృథ్విరాజ్‌, రాజీవ్‌ కనకాల, శివశంకర్‌, రవికాలే, గగన్ వంటి ప్ర‌ముఖ న‌టులు కీలకపాత్రల్లో నటించారు. ఇటీవ‌ల హీరో శ్రీ‌కాంత్ చేతుల‌ మీదుగా విడుదలైన ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. కాగా `క‌ళాకార్` మూవీ మోష‌న్‌పోస్ట‌ర్‌ను బ్లాక్‌బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ అనిల్‌రావిపూడి రిలీజ్‌చేసి చిత్ర‌యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు.

ఈ సినిమాలో రోహిత్ ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ మ‌హేంద్ర వ‌ర్మగా క‌నిపించ‌నున్న‌ట్లు మోష‌న్‌పోస్ట‌ర్ ద్వారా రివీల్‌ చేశారు మేక‌ర్స్‌. క్రియేటివ్‌గా మ‌రియు స్టైలిష్ గా ఉన్న ఈ మోష‌న్ పోస్ట‌ర్‌కు సోష‌ల్‌మీడియాలో మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఈ సంద‌ర్భంగా..

హీరో రోహిత్ మాట్లాడుతూ – “ఇటీవ‌ల విడుద‌ల చేసిన `క‌ళాకార్` ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. పోలీస్ ఆఫీస‌ర్ గా చాలా ఫిట్‌గా ఉన్నావు అని నా ఫ్రెండ్స్‌, స‌న్నిహితులు ఫోన్ చేసి ప్ర‌సంశించారు. ఇప్పుడు మా మూవీ మోష‌న్‌పోస్ట‌ర్‌ను అనిల్ రావిపూడిగారు రిలీజ్ చేయ‌డం చాలా హ్యాపీగా ఉంది. క‌చ్చితంగా ఈ సినిమా మీ అంద‌రికీ న‌చ్చుతుంది“ అన్నారు.

చిత్ర నిర్మాత వెంకటరెడ్డి జాజాపురం మాట్లాడుతూ – “మేం అడిగిన వెంట‌నే మోష‌న్ పోస్ట‌ర్‌ని విడుద‌ల‌చేసిన అనిల్‌ రావిపూడిగారికి మా ఏజీ అండ్‌ ఏజీ ఎంటర్‌టైన్‌మెంట్స్ త‌ర‌పున ధ‌న్య‌వాదాలు. సినిమా చాలా బాగా వ‌చ్చింది. త‌ప్ప‌కుండా క‌మ‌ర్షియ‌ల్‌గా మంచి విజ‌యం సాధిస్తుంద‌నే న‌మ్మ‌కం ఉంది“ అన్నారు.

దర్శకుడు శ్రీను బందెల మాట్లాడుతూ – “ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు ముగింపు ద‌శ‌లో ఉన్నాయి. త్వ‌ర‌లో టీజ‌ర్ విడుద‌ల‌చేస్తాం“ అన్నారు.

తారాగ‌ణం: రోహిత్‌, షాయాజీ షిండే, పృథ్విరాజ్, రాజీవ్‌కనకాల, శివశంకర్‌, రవికాలే, గగన్‌విహారి, నలినీ కాంత్‌, కరాటే కళ్యాణి, జయలలిత, అశోక్‌కుమార్‌, రమేష్‌వర్మ, బస్టాఫ్‌ కోటేశ్వరావు, ఘర్షణ శ్రీనివాస్‌, అరుణ, నాగిరెడ్డి, మనోజ్‌కుమార్‌, జయవాణి, సూర్య, చక్రి, ఐశ్వర్య (చైల్డ్ ఆర్టిస్ట్)

సాంకేతిక వ‌ర్గం:
సినిమాటోగ్రఫి: అమర్‌ జి, ఎడిటింగ్‌: కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌: చిన్నా, సంగీతం: క‌నిష్క‌, ఫైట్స్‌: డ్రాగన్‌ ప్రకాశ్‌ & దేవరాజ, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: శివారెడ్డి జాజాపురం, నిర్మాత: వెంకటరెడ్డి జాజాపురం, కథ, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం: శ్రీను బందెల.