ధ్వని ఫస్ట్ లుక్ విడుదల !!!

721

వైవిధ్య‌మైన క‌థా చిత్రాల‌ను, విభిన్న‌మైన పాత్ర‌ల‌ను ఎంపిక చేసుకుంటూ యంగ్ టాలెంట్‌ క‌థానాయ‌కుడు వినయ్ పనిగ్రహి ధ్వని అనే డిఫ‌రెంట్ మూవీతో ఆక‌ట్టుకోవ‌డానికి సిద్ధ‌మ‌య్యారు గురువారం ధ్వని ఫ‌స్ట్‌లుక్‌ ను హీరో నవదీప్ గారు విడుద‌ల చేయడం జరిగింది.

ఈ సందర్భంగా హీరో నవదీప్ మాట్లాడడు
డైరెక్టర్ దుర్గ నాకు రెండు సంవత్సరాలుగా తెలుసు, ఆయనలో చాలా కృషి మరియు పట్టుదల ఉంది అని ఆయన చెప్పరు… ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుంది అని ఆయన పేర్కొన్నారు.

ఫ‌స్ట్‌లుక్‌ను గ‌మ‌నిస్తే సీరియ‌స్‌గా తలకి కట్టుకొని ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఉన్నాడు..సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం లో సౌండ్ కి సంబందించిన వ్యాధితో బాధపడే ఒక వ్యక్తి జీవితం లో జరిగిన సంఘటనలు, ఆ సంఘటనల నుండి ఎలా బయటపడ్డాడు.. అనేది మూవీ కాన్సెప్ట్ అని చిత్ర బృదం తెలిపింది.

లుక్ చూస్తుంటే వినయ్ త‌న‌ పాత్ర కోసం ట్రాన్స్‌ఫ‌ర్మేష‌న్ బాగానే అయ్యార‌నేది తెలుస్తుంది. అలాగే త‌న లుక్ కూడా డిఫ‌రెంట్‌గా ఉంది. క‌థానాయ‌కుడి పాత్ర స‌రికొత్త డైమ‌న్ష‌న్‌లో ఉంటుంద‌ని లుక్ చూస్తే అర్థ‌మ‌వుతుంది.

ప్రముఖ నిర్మాణ సంస్థ పరమ కృష్ణ పిక్చర్స్ అండ్ క్రియేషన్స్ పతాకంపై పరమ కృష్ణ సాన సమర్పణలో సాధన నన్నపనేని నిర్మిస్తున్న ఈ చిత్రానికి యంగ్ టాలెంటెడ్ నాగ దుర్గ రావు సాన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ప్ర‌స్తుతం చివరి దశలో ఉంది. యంగ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ప్రతిక్ అబ్యాంకర్ మరియు ఆనంద్ నంబియర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రానికి నేషనల్ అవార్డ్ విన్నర్ ఎంఆర్. రాజకీష్ణన్ గారు సౌండ్ మిక్సింగ్ కి పనిచేస్తున్నారు.. మరియు ప్రముఖ సినిమా కురూప్ కి పనిచేసే సౌండ్ డిజైన్ ఈ సినిమాకి పనిచేస్తున్నారు…. ఇక ఈ చిత్రం లో వినయ్ పనిగ్రహి, స్వాతి మండది, త్రినాధ్ వర్మ, రవీందర్ రెడ్డి , భావన సాగి, సురేష్ ,కుమార్, దేవ్, సాయి మరియు త‌దిత‌రులు నటిస్తున్నారు.