“దీర్ఘఆయుష్మాన్ భవ” చిత్రం లోని ”కొంచం కొంచం” సాంగ్ సాగర్ విడుదల చేశారు.

663


కార్తీక్‌రాజు, మిస్తి చక్రవర్తి హీరో హీరోయిన్లుగా ఎం.పూర్ణానంద్‌ దర్శకత్వంలొ తెరకెక్కుతోన్న చిత్రం “దీర్ఘఆయుష్మాన్ భవ”. డా.ఎం.వి.కె.రెడ్డి సమర్పణలో ప్రతిమ.జి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ లోని కొంచం కొంచం అంటూ సాగే పాటను దర్శకుడు సాగర్ విడుదల చేశారు.

ఈ సందర్బంగా దర్శకుడు ఎం.పూర్ణానంద్‌ మాట్లాడుతూ…
మా దీర్ఘఆయుష్మాన్ భవ సినిమా ఫస్ట్ సాంగ్ డైరెక్టర్ సాగర్ గారు విడుదల చెయ్యడం సంతోషంగా ఉంది. ఇప్పటి వరకు వచ్చిన ప్రేమకథా చిత్రాలకు భిన్నంగా ఇది సోషియో ఫాంటసీ ప్రేమకథాచిత్రమ్‌. చాలా రొజుల తర్వాత కైకాల సత్యనారాయణ గారు యముడుగా ఈ చిత్రంలొ అలరించనున్నారు. చిత్రీకరణ పూర్తయింది. గ్రాఫిక్స్ కు ఈ సినిమాలో చాలా ప్రాధాన్యత ఉంది. నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలొనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామన్నారు.

నిర్మాత ప్రతిమ.జి మాట్లాడుతూ…
ఈ చిత్ర ఫస్ట్ సాంగ్ విడుదల చేసిన దర్శకుడు సాగర్ గారికి కృతజ్ఞతలు. సినిమా చాలా బాగా వచింది సాంగ్ కూడా అందరికి నచ్చుతుందని భావిస్తున్నాను. కార్తీక్‌రాజు, మిస్తి చక్రవర్తి బాగా నటించారు డైరెక్టర్ పూర్ణనానంద్ గారు సినిమాను బాగా డైరెక్ట్ చేశారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఈ సినిమా ఉండబోతోందని తెలిపారు.

మ్యూజిక్ డైరెక్టర్ వినోద్ యాజమాన్య మాట్లాడుతూ…
దీర్ఘఆయుష్మాన్ భవ సినిమా ఫస్ట్ సాంగ్ కొంచం కొంచం ఆదిత్య మ్యూజిక్ ద్వారా దర్శకుడు సాగర్ గారు రిలీజ్ చెయ్యడం సంతోషంగా ఉంది. ఈ సినిమాలోని అన్ని పాటలు సందర్భనికి తగ్గట్లు ఉంటాయి. నాకు ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెడుతుందని భావిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ పూర్ణ గారికి నిర్మాత గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను అన్నారు.

నటీనటులు:
కార్తీక్‌రాజు, మిస్తి చక్రవర్తి, పృథ్వీరాజ్‌,సత్యం రాజేష్, జెమినిసురేష్‌ తదితరులు

సాంకేతిక నిపుణులు:
సంగీతం: వినోద్ యాజమాన్య
కెమెరా: మల్హర్‌భట్‌ జోషి మాటలు: ప్రదీప్‌ ఆచార్య, పూర్ణానంద్‌.ఎం
ఆర్ట్‌: రామకృష్ణ
నిర్మాత: ప్రతిమ.జి
కథ, కథనం, దర్శకత్వం: పూర్ణానంద్‌.ఎం.