సుప్రసిద్ధ నిర్మాత ఏ.ఎం. రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి నిర్మిస్తున్న చిత్రం ‘రూల్స్ రంజన్’. కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి రత్నం కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. రింకు కుక్రెజ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అమ్రిష్ గణేష్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన మూడు పాటలకు అద్భుతమైన స్పందన లభించింది. నాలో నేనే లేను, సమ్మోహనుడా, ఎందుకురా బాబు పాటలు ఒక దానిని మించి ఒకటి ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి నాలుగో పాటను విడుదల చేశారు మేకర్స్.
‘రూల్స్ రంజన్’ నుంచి ‘దేఖో ముంబై’ అంటూ సాగే నాలుగో పాట లిరికల్ వీడియో మాస్ మహారాజా రవితేజ చేతుల మీదుగా ఈరోజు(సెప్టెంబర్ 19) ఉదయం 10:20 గంటలకు విడుదలైంది. విడుదల సందర్భంగా పాట బాగుందని చిత్ర బృందాన్ని ప్రశంసించిన రవితేజ, చిత్రం ఘన విజయం సాధించాలని ఆకంక్షించారు. ముంబై నగరాన్ని పరిచయం చేస్తూ సాగిన ఈ పాట బాగా ఎనర్జిటిక్ గా ఉంది. అమ్రిష్ గణేష్ అందించిన సంగీతం ఎవరి చేతనైనా కాలు కదిపించేలా ఉంది. ఈ గీతానికి కాసర్ల శ్యామ్, మేఘ్-ఉ-వాట్ సాహిత్యం అందించారు. “దేఖో ముంబై దోస్తీ మజా.. పీకే కర్ లో మస్తీ మజా..” అంటూ తెలుగు, హిందీ పదాలతో పాటను అల్లిన తీరు అమితంగా ఆకట్టుకుంది. “నువ్ పక్కనుంటే చిల్లు, తిరగొద్దే వాచు ముల్లు.. నీకు రెక్కలిచ్చే ఒళ్ళు, ఎగిరెళ్లు” అంటూ తేలికైన పదాలతో పాటను ఎంతో అందంగా, అర్థవంతంగా రాశారు. ఇక ఉత్సాహవంతమైన సంగీతానికి తగ్గట్టుగా
అద్నాన్ సమీ, పాయల్ దేవ్ పాటను మరింత ఉత్సాహంగా ఆలపించారు. సంగీతం, సాహిత్యం, గానంతో పాటు శిరీష్ నృత్య రీతులు ఈ గీతానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముంబై బీచ్ తో పాటు నగర వీధుల్లో చక్కర్లు కొడుతూ, నాయకానాయికలు వేసిన స్టెప్పులు అలరించాయి. లిరికల్ వీడియోనే ఇలా ఉంటే, బిగ్ స్క్రీన్ మీద ఫుల్ వీడియో సాంగ్ కి థియేటర్లలో ప్రేక్షకులు చప్పట్లు కొట్టడం ఖాయమని చెప్పొచ్చు.
పూర్తి స్థాయి వినోద భరితంగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 6న థియేటర్లలో భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, ఇతర ప్రచార చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని సినిమాపై అంచనాలను పెంచాయి. యువత, కుటుంబ ప్రేక్షకులు మెచ్చేలా రూపుదిద్దుకుంటున్న ఈ వినోదాత్మక చిత్రం ఘన విజయం సాధిస్తుందని చిత్ర నిర్మాతలు నమ్మకంగా ఉన్నారు.
తారాగణం: కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి, మెహర్ చాహల్, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, హైపర్ ఆది, వైవా హర్ష, అన్నూ కపూర్, అజయ్, అతుల్ పర్చురే, విజయ్ పాట్కర్, మకరంద్ దేశ్‌పాండే, నెల్లూరు సుదర్శన్, గోపరాజు రమణ, అభిమన్యు సింగ్, సిద్ధార్థ్ సేన్
రచన, దర్శకత్వం: రత్నం కృష్ణ
బ్యానర్: స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్
సమర్పణ: ఏఎం రత్నం
నిర్మాతలు: దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి
సహ నిర్మాత: రింకు కుక్రెజ
సంగీత దర్శకుడు: అమ్రిష్ గణేష్
డీఓపీ: దులీప్ కుమార్
ఆర్ట్ డైరెక్టర్ : ఎం. సుధీర్
ఎడిటర్ : వరప్రసాద్
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్