HomeTelugu'రాధే శ్యామ్'లో మలుపులు మిమ్మల్ని కచ్చితంగా ఆకట్టుకుంటాయి: ప్రభాస్

‘రాధే శ్యామ్’లో మలుపులు మిమ్మల్ని కచ్చితంగా ఆకట్టుకుంటాయి: ప్రభాస్


రామోజీ ఫిలిం సిటీలో అభిమానులే అతిథులు రాధే శ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అత్యంత ఘనంగా జరిగింది. ఈ వేడుకకు అతిరథ మహారథులు హాజరయ్యారు.

రెబల్ స్టార్ కృష్ణం రాజు గారు మాట్లాడుతూ..’ ఈ రోజు మిమ్మల్ని ఇలా అందర్నీ ఒక దగ్గర చూస్తుంటే లేచి నిలబడి డాన్స్ చేయాలి అనిపిస్తుంది. కానీ ఇలా కూర్చోవాల్సి వచ్చింది. అది దేవుడు వేసిన చిన్న శిక్ష. కానీ కచ్చితంగా డాన్స్ చేస్తా.. ఇక్కడ ఉన్నది రెబల్ స్టార్. రాధే శ్యామ్ అందమైన ప్రేమ కథ. కచ్చితంగా ఇది అందరికీ నచ్చుతుంది. సినిమాలో ఉన్న ప్రతి ఒక్కరు అద్భుతంగా నటించారు. ప్రభాస్ చాలా అందంగా ఉన్నాడు.. సినిమా అద్భుతమైన విజయం సాధిస్తుందని నమ్మకంగా చెబుతున్నాను..’ అని తెలిపారు.

ఆదిపురుష్ లాంటి భారీ సినిమా చేస్తున్న దర్శకుడు ఓం రౌత్ మాట్లాడుతూ.. ‘ ట్రైలర్ అద్భుతంగా ఉంది ఇది ప్రేమ కథ అని చెప్పారు. కానీ ఇందులో కేవలం లవ్ స్టొరీ మాత్రమే కాదు ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. లవ్, సస్పెన్స్, థ్రిల్లర్ ఇలా ప్రతి ఒక్క అంశం రాధే శ్యామ్ సినిమాలో కనిపిస్తున్నాయి. సినిమాకు ఆల్ ద బెస్ట్. ఖచ్చితంగా అద్భుతమైన విజయం సాధిస్తుంది..’ అని తెలిపారు.

ప్రభాస్ తో ప్రస్తుతం ప్రాజెక్ట్ కే సినిమా చేస్తున్న నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. ‘ ఇప్పుడు మనం అందరం పాన్ ఇండియా అని మాట్లాడుకుంటున్నాం.. దాన్ని మొదలుపెట్టింది ప్రభాస్, రాజమౌళి గారు. మేమంతా వాళ్ళు మొదలు పెట్టిన దాన్ని కంటిన్యూ చేస్తున్నాము. రాధే శ్యామ్ అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీ చాలా ఇంటెన్స్ కనిపిస్తుంది. సినిమా ఖచ్చితంగా పెద్ద విజయం సాధిస్తుంది. ట్రైలర్ అవుట్ స్టాండింగ్ గా ఉంది. క్లాసిక్ అవుతుంది సినిమా..’ అని తెలిపారు.

ప్రభాస్ 25వ సినిమా స్పిరిట్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ..’ ట్రైలర్ అద్భుతంగా ఉంది. విజువల్స్ చాలా బాగున్నాయి. మ్యూజిక్ అవుట్ స్టాండింగ్.. హోల్ టీం అద్భుతంగా పని చేశారని అర్థమవుతుంది. కొన్ని సినిమాలకు ఆ మ్యాజిక్ తెలుస్తుంది. రాధే శ్యామ్ ఖచ్చితంగా పెద్ద విజయం సాధిస్తుంది..’ అని తెలిపారు.

రెబల్ స్టార్ ప్రభాస్ మాట్లాడుతూ..’ హాయ్.. ఎలా ఉన్నారు అందరూ.. చాలా రోజులు అయింది కలిసి.. గోపికృష్ణ మూవీస్ అంటే పెద్ద సినిమాలకు పెట్టింది పేరు తాండ్ర పాపారాయుడు, బొబ్బిలి బ్రహ్మన్న, మన ఊరి పాండవులు లాంటి సినిమాలు వచ్చాయి. అందుకే కాస్త టెన్షన్ ఉంటుంది. ఈ బ్యానర్లో ముందు బిల్లా సినిమా చేశాము. బాగానే ఆడింది. ఇప్పుడు రాధే శ్యామ్ వస్తుంది. క్యూట్ లవ్ స్టోరీ అయినా కూడా ట్రైలర్లో చూశారు కదా.. సర్ ప్రైజింగ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. కరోనా సమయంలో కూడా ఈ సినిమా కోసం చాలా మంది కష్టపడ్డారు. ముఖ్యంగా నిర్మాతలు ఖర్చుకు వెనకాడలేదు. హిందీ, తెలుగు సంగీత దర్శకులు అద్భుతమైన పాటలు ఇచ్చారు. సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పూజా హెగ్డే అందంగా ఉంది. అలాగే అద్భుతంగా నటించింది. రేపు మీరు సినిమాలో చూస్తారు. రాధాకృష్ణ కుమార్ మంచి విజన్ ఉన్న డైరెక్టర్. బాహుబలి అయిపోయిన తర్వాత సాహో టైంలో మొదలుపెట్టి ఆపేసి.. మళ్లీ కరోనా వచ్చిందని కొన్ని రోజులు ఆపి.. ఇలా పని చేయాలి అంటే ఫ్రస్టేషన్ ఉంటుంది. కానీ డైరెక్టర్ మాత్రం అద్భుతమైన అవుట్పుట్ ఇచ్చాడు. మీకు ట్రైలర్ లోనే అది కనిపిస్తుంది. ఎనీ వే అందరికీ థాంక్యూ ఐ లవ్ యు డార్లింగ్స్..’ అని తెలిపారు.

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES