10th క్లాస్ డైరీస్, బుజ్జి ఇలా రా చిత్రాలు దర్శకుడిగా మంచి గుర్తింపు ఇచ్చాయి: సినిమాటోగ్రాఫర్, దర్శకులు గరుడవేగా అంజి

311


దాదాపు 50 చిత్రాలకు  పై సినిలకుమా సినిమాటోగ్రాఫర్ గా పని చేసి సినీ పరిశ్రమలో DOP అంజిగా ఫేమస్ అయ్యారు అంజి. సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తూనే తన లోని మరో టాలెంట్‌ని బయటపెడుతూ దర్శకుడిగా ప్రేక్షకుల ముందుకొచ్చి సక్సెస్ అయ్యారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన తొలి సినిమా 10th క్లాస్ డైరీస్ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ OTT వేదికపై ట్రెండ్ అవుతోంది. ఆడియన్స్ ఇస్తున్న సూపర్ రెస్పాన్స్ తో భారీ వ్యూస్ రాబడుతోంది. ఇదే జోష్‌లో బుజ్జి ఇలా రా అనే మరో సినిమాకు దర్శకత్వంలో వహించి ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుంచారు DOP అంజి.

ఎస్‌యెన్ఎస్ క్రియేషన్స్ పతాకంపై సునీల్, ధనరాజ్ ప్రధాన పాత్రల్లో ఈ బుజ్జి ఇలా రా సినిమా రూపొందింది. రూప జగదీష్ సమర్పణలో అగ్రహారం నాగిరెడ్డి, సంజీవ్ రెడ్డి నిర్మాతలుగా రూపొందిన ఈ చిత్రంలో చాందిని తమిళ్ రసన్ హీరోయిన్ గా నటించింది. చిత్రానికి జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వ పర్యవేక్షణలో గరుడవేగా అంజి (DOP అంజి) ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ శుక్రవారం థియేటర్స్‌లో విడుదలైన ఈ సినిమా పాజిటివ్ రెస్పాన్స్ సంపాదించుకొని విజయవంతంగా ప్రదర్శించబడుతోంది.

ఈ సందర్బంగా డైరెక్టర్ “అంజి “మాట్లాడుతూ.. ముందుగా ఈ సినిమాని ఇంతలా ఆదరించిన తెలుగు ఆడియన్స్ అందరికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ చిత్ర కథ అనుకున్నప్పుడు ఆడియన్‌కి ఎక్కడా బోర్ కొట్టకుండా మంచి థ్రిల్లింగ్ ఎలెమెంట్స్‌తో ట్విస్టులతో ముందుకి వెళ్ళేలా రాసుకున్నాం. అలాంటి కథని తమ నటనతో ఇంకా బాగా ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా నటించిన సునీల్, ధనరాజ్ లకు నా ప్రత్యేక ధన్యవాదాలు. హీరోయిన్ గా నటించిన చాందిని తమిళ్ రసన్ తనదైన శైలిలో అద్బుతమైన నటనని కనబర్చింది. అలాగే శ్రీకాంత్ అయ్యింగార్, రాజా రవీంద్ర, పోసాని కృష్ణమురళి తదితర నటీనటులు వాళ్ళ వాళ్ళ పాత్రలకి పూర్తి న్యాయం చేసి సినిమాని ఇంకో మెట్టు ఎక్కించారు. ఈ చిత్రానికి నేపథ్య సంగీతం అందించిన సాయి కార్తీక్, ఎడిటర్ చోటా .కే .ప్రసాద్ గారు మెయిన్ అసెట్ అయ్యారు.

చిన్న సినిమానే కదా అని ఇంత బడ్జెట్ చాలు అని అనుకోకుండా ఏది అడిగితే అది ఇచ్చి.. నన్ను నమ్మి ఎంతో ఖర్చు పెట్టిన నా నిర్మాతలకి మరోకసారి ధన్యవాదాలు చెప్తున్నాను. చివరగా జి.నాగేశ్వర్ రెడ్డి గారు ఒక కెమరామెన్ గా ఉన్న నన్ను నమ్మి ఈ సినిమా దర్శకత్వ బాధ్యత నాకు అప్పగించి, ఈ సినిమా నిర్మాణ బాధ్యతలని తన భుజాల మీద వేసుకొని సెట్ లో ఎప్పుడు నాకు ఇబ్బంది కలిగించకుండా అన్నీ ఆయనే దగ్గరుండి చూసుకుని, ఈ సినిమాని దగ్గరుండి నడిపించి ఈ సినిమా ఇంత బాగా రావడానికి ముఖ్య కారణం అయ్యారు.

నన్ను నమ్మి నాకు ఇంత మంచి సినిమాలో అవకాశం ఇచ్చిన నాగేశ్వర్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీరు కంటెంట్ ఉన్న సినిమాలు తీయండి. మేము తప్పకుండా హాల్‌కి వచ్చి హిట్ చేస్తాం.. అని మరోకసారి మా “బుజ్జి ఇలా రా” సినిమాని విజయవంతం చేసి ఆ మాట మళ్ళీ నాతో చెప్పేస్తున్నా తెలుగు సినిమా ప్రేక్షక దేవుళ్లందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మా సినిమాని ఇలాగే ఆదరించి ఇంకా ఘన విజయం అయ్యేలా చేస్తారని.. మరిన్ని మంచి సినిమాలు తీసే ధైర్యాన్ని నాకు అందిస్తారని కోరుకుంటున్నా” అన్నారు.