దర్శకుడు నాగ్ అశ్విన్ చేతుల మీదుగా గ్రాండ్ గా రిలీజైన “చెడ్డి గ్యాంగ్ తమాషా” టీజర్

176

అబుజా ఎంటర్టైన్మెంట్స్ మరియు శ్రీ లీల ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వెంకట్ కళ్యాణ్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో గాయత్రి పటేల్ హీరోయిన్.సిహెచ్ క్రాంతి కిరణ్ నిర్మాణంలో తెరకెక్కుతున్న చిత్రం. “చెడ్డి గ్యాంగ్ తమాషా”.ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని సెన్సార్ కు వెళ్ళబోతున్న సందర్బంగా చిత్ర టీజర్ ను గ్రాండ్ గా రిలీజ్ చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన దర్శకుడు నాగ్ అశ్విన్ చిత్ర టీజర్ ను విడుదల చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో నాగ్ అశ్విన్ తల్లి డాక్టర్ జయంతి రెడ్డి, డాక్టర్ ఉషా,ఇన్ సెక్యూర్ డైరెక్టర్ లక్కీ,నటుడు లోహిత్ కుమార్, కోయ కిషోర్ లతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

అనంతరం అతిధిగా వచ్చిన దర్శకుడు నాగ్ అశ్విన్ మాట్లాడుతూ..మా ఫ్యామిలీ కి ఎంతో సన్నిహితులైన నిర్మాత క్రాంతి కిరణ్ గారు యంగ్ టీమ్ తీసిన “చెడ్డి గ్యాంగ్ తమాషా”టీజర్ చాలా బాగుంది.అలాగే ఒక సినిమా తియ్యడానికి చిన్న సినిమా పెద్ద సినిమా అంటూ తేడా ఉండదు. కంటెంట్ బాగుంటే ప్రతి సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారు.క్రాంతి కిరణ్ గారు చెప్పినట్టు ఒక సినిమాను పూర్తి చేసి విడుదల చేయడం అంటే మనిషి పుట్టుకతో సమానం.ఒక తల్లి గర్భం దాల్చి నవమాసాలు మోసి జన్మించే వరకు పడే తపనే సినిమా..ఈ సినిమా టీజర్ చూస్తుంటే యంగ్ టీం తో మేము తీసిన “ఎవడే సుబ్రహ్మణ్యం” సినిమా గుర్తుకు వస్తుంది.ఆ సినిమా లాగే ఈ “చెడ్డి గ్యాంగ్ తమాషా” సినిమా గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టీం అందరికీ నా బెస్ట్ విషెస్ తెలియజేశారు.

నాగ్ అశ్విన్ తల్లి డాక్టర్ జయంతి రెడ్డి మాట్లాడుతూ..చెడ్డి గ్యాంగ్ తమాషా” టీజర్ చాలా బాగుంది. యంగ్ స్టర్స్ తో తీసిన ఈ సినిమా ప్రేక్షకులందరినీ ఎంటర్టైన్మెంట్ చేస్తుంది అని నమ్ముతున్నాను. ఈ సినిమా టీం కు అందరికీ ఆల్ ద బెస్ట్ అన్నారు.

నిర్మాత సిహెచ్ క్రాంతి కిరణ్ మాట్లాడుతూ:మేము అడిగిన వెంటనే వచ్చిన దర్శక, తపశ్వి నాగ్ అశ్విన్ గారికి ధన్యవాదములు.ఈ సినిమాకు కార్తీక్ తో నటీ, నటులు, టెక్నిషియన్స్ అందరూ చాలా డెడికేటెడ్ గా వర్క్ చేశారు. ఇందులోని పాటలు అందరినీ ఆకట్టుకుంటాయి.హీరోయిన్ కు ఇది మొదటి సినిమా అయినా చాలా బాగా నటించారు. దర్శకుడు వెంకట్ అటు హీరోగా దర్శకుడిగా రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ చాలా బాగా చేశాడు.కొత్త టీం తో మేము తీసిన ఈ సినిమా కంటెంట్ నాలుగు గంటల వస్తే దానిని 2 గంటల 40 నిమిషాలకు తగ్గించడానికి మేము చాలా గర్భ శోకను అనుభవించాము. మంచి కథతో తీసిన ఈ సినిమా ప్రతి ఒక్కరికీ కచ్చితంగా నచ్చుతుందని అన్నారు.

హీరో, దర్శకుడు వెంకట్ కళ్యాణ్ మాట్లాడుతూ..ఇది నా 15 సంవత్సరాల కల,సినిమా మీద ప్యాషన్ తో నటుడు అవ్వాలనే మా అమ్మ కోరికతో ఇండస్ట్రీ కి వచ్చాను.అది ఇప్పుడు నెరవేరింది. నాకు ఇష్టమైన దర్శకుడు నాగ్ అశ్విన్ గారు వచ్చి మా సినిమా టీజర్ ను విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. మా నిర్మాత క్రాంతి కిరణ్ గారు ఇంతకుముందు తన ప్రొడక్షన్ హౌస్ లో కిల్లర్ అనే సినిమాను డబ్బింగ్ చేశాడు. ఇప్పుడు తొలిసారిగా తీస్తున్న స్ట్రెయిట్ సినిమాలో మమ్మల్ని నమ్మి నన్ను హీరోగా, దర్శకుడిగా సెలెక్ట్ చేసుకున్న క్రాంతి గారికి ధన్యవాదాలు. హీరోయిన్ గాయత్రి పటేల్ కు తొలి చిత్రమైనా చాలా బాగా నటించింది.ఇంకా ఇందులో నటించిన ప్రతి ఒక్కరూ చాలా బాగా నటించడంతో చూస్తున్న ప్రేక్షకులకు ఇది కొత్త సినిమాలా అనిపించదు. ఈ చిత్రం అన్ని వర్గాల వారిని, అన్ని వయసుల వారిని, అన్ని కుల, మతాల వారిని ఆకర్శించే హాస్య భరితమైన చిత్రంగా మా “చెడ్డి గ్యాంగ్ తమాషా” నిలుస్తుందని కచ్చితంగా చెప్పగలను అన్నారు.

నటుడు లోహిత్ కుమార్ మాట్లాడుతూ..వీరందరికీ సినిమా అనేది ఒక జీవితం,ఒక కల. ఆ కలను నిజం చేసుకోవడానికి
వీరందరూ సినిమానే శ్వాస, సినిమానే ద్యాస గా చాలా కష్ట పడ్డారు., వీరికి ఆకలి, నిద్ర ఇవేమి ఉండవు.కానీ ఎదో సాధించాలి అనే తపన ఈ “చెడ్డీ గ్యాంగ్” టీంలో కనిపించింది. కాబట్టి మంచి కథతో వస్తున్న ఈ సినిమా టీం అందరికీ అల్ ద బెస్ట్ అన్నారు.

హీరోయిన్ గాయత్రి పటేల్ మాట్లాడుతూ.. ఇది నా మొదటి చిత్రం.మూవీ టీం అంతా నాకు ఫుల్ సపోర్ట్ చేశారు.మంచి కథతో వస్తున్న ఈ సినిమా ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది. ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదములు.

మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ మాట్లాడుతూ.. ఈ సినిమా పాటలు బాగా వచ్చాయి.రాహుల్ సిప్లిగంజ్ ‘ఓ పోరి పానీ పూరి’ పాటను, యాజీనిజ వింతలే సాంగ్ ను ఇంకా రాజశేఖర్ అర్జున్, సునామి సుధాకర్ ఇలా అందరూ ఈ సినిమాలో పాడిన పాటలన్నీ బాగా వచ్చాయి.ఇలాంటి మంచి సినిమాకు మ్యూజిక్ చేసే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.

డాక్టర్ ఉషా మాట్లాడుతూ..నిర్మాత క్రాంతి కిరణ్ గారి ఫ్యామిలీ తో మాకు చాలా అటాచ్ మెంట్ ఉంది. యూత్ ఎంకరేజ్ చేస్తూ తీసిన ఈ సినిమా పెద్ద విజయం సాదించాలి అన్నారు.

నటీ నటులు, సాంకేతిక నిపుణులు
హీరో; వెంకట్ కళ్యాణ్
హీరోయిన్: గాయత్రి పటేల్
నిర్మాత : సి హెచ్ క్రాంతి కిరణ్
స్టొరీ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ : వెంకట్ కళ్యాణ్
డి ఓ పి: జి కె యాదవ్ బంక
సంగీతం: అర్జున్ నల్లగొప్పుల
లిరిక్స్: విహారి
ఎడిటింగ్; నర్సింగ్ రాథోడ్
ఆర్ట్,; రెడాన్ ఎస్కే, ఎమ్ ఏ
కొరియోగ్రాఫర్ : భాను.

PRO;NO1 SATISH