చెడ్డి గ్యాంగ్ తమాషా మూవీ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి

353


అబుజా ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు శ్రీ లీల ఎంటర్టైన్మెంట్స్ సంయుక్త నిర్మాణంలో సిహెచ్ క్రాంతి కిరణ్ నిర్మాతగా, వెంకట్ కళ్యాణ్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న చిత్రం చెడ్డి గ్యాంగ్ తమాషా

ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను డైనమిక్,డైరెక్టర్ అనిల్ రావిపూడి రిలీజ్ చేశారు.

ఈ సందర్భంగా డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ: ఈ మూవీ టైటిల్ పోస్టర్ చాలా ఇంప్రెసివ్ గా వుంది. ఈ సినిమా ఆడియెన్స్ ను అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిర్మాతకి డైరెక్టర్ కి మంచి పేరు ప్రఖ్యాతలు రావాలి.చిత్ర యూనిట్ అందరికీ అభినందనలు అన్నారు.
.
నిర్మాత సిహెచ్ క్రాంతి కిరణ్ మాట్లాడుతూ: అనిల్ రావిపూడి గారి చేతుల మీదగా మా చెడ్డి గ్యాంగ్ తమాషా మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ కావడం చాలా ఆనందం గా వుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తామని అన్నారు..

హీరో; వెంకట్ కళ్యాణ్
హీరోయిన్: గాయత్రి పటేల్
డి ఓ పి: జి కె యాదవ్ బంక
సంగీతం: అర్జున్ నల్లగొప్పుల
లిరిక్స్: విహారి
ఎడిటింగ్; నర్సింగ్ రాథోడ్
ఆర్ట్,; రెడాన్ ఎస్కే, ఎమ్ ఏ
కొరియోగ్రాఫర్ : భాను.
నిర్మాత : సి హెచ్ క్రాంతి కిరణ్
స్టొరీ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ : వెంకట్ కళ్యాణ్

PRO;N0 1 SATISH