కార్తికేయ – అన‌సూయ మాస్ స్టెప్పుల‌తో చావు క‌బురు చ‌ల్ల‌గా చిత్రం

473

మార్చి1న‌ 4:05PM కు అల్లు అరవింద్,‌ జీఏ2 పిక్చ‌ర్స్, బ‌న్నీవాసు, కార్తికేయ “చావు క‌బురు చ‌ల్ల‌గా ” చిత్రం నుంచి మాస్ ఐటెమ్ సాంగ్ నెంబ‌ర్ పైన ప‌టారం ‌విడుద‌ల‌

మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ గారి స‌మ‌ర్ప‌ణ‌లో వ‌రస విజయాలు అందుకుంటూ సక్సెస్ కు మారుపేరుగా నిలిచిన ‌బన్నీ వాసు నిర్మాత‌గా ఎన‌ర్జిటిక్ యంగ్ హీరో కార్తికేయ‌, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా నూత‌న ద‌ర్శ‌కుడు కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి తెర‌కెక్కిస్తున్న చిత్రం ‘చావు క‌బురు చ‌ల్ల‌గా’. ‌ఇప్పటికే విడుదలైన టైటిల్, హీరో కార్తికేయ ‘బ‌స్తి బాల‌రాజు’ ఫ‌స్ట్ లుక్, ఇంట్రో కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది, ఆ త‌రువాత విడుద‌లైన క్యారెక్ట‌ర్ వీడియో, లావణ్య త్రిపాఠి ఫస్ట్ లుక్ కి, టీజ‌ర్ గ్లిమ్ప్స్ కి, మైనేమ్ ఈజ్ రాజు, క‌దిలే కాలాన్ని అడిగా అనే పాటల‌‌కు కూడా అనూహ్య స్పంద‌న ల‌భించింది. ముఖ్యంగా కార్తికేయ గెట‌ప్‌, డైలాగ్ డెలివ‌రి మాడ్యూలేష‌న్ చూస్తే మ‌ళ్లీ చూడాల‌నిపించేలా ఉందంటూ కామెంట్స్ వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో చావు క‌బ‌రు చ‌ల్ల‌గా ఆడియో నుంచి అన‌సూయ చిందేసిన‌ ఓ మాస్ ఐటెమ్ సాంగ్ ని విడుద‌ల చేయ‌డానికి ముహుర్తం ఖార‌రైంది. మార్చి 1న సాయంత్రం 4 గంట‌ల 5 నిమ‌షాల‌కి పైన ప‌టారం లోన లొటారం అంటూ సాగే మాస్ ఐట‌మ్ సాంగ్ ని విడుద‌ల చేస్తున్న‌ట్లుగా ప్ర‌క‌టిస్తూ హీరో కార్తీకేయ‌, అన‌సూయ క‌లిసి చిందేసిన స్టెప్పుల‌తో ఓ ప్రోమోని విడుద‌ల చేశారు. ప్ర‌స్తుతం ఈ ప్రోమో అన్ని వ‌ర్గాలు ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటూ సోష‌ల్ మీడియా లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఈ సంద‌ర్భంగా చిత్ర ద‌ర్శ‌కుడు కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి మాట్లాడుతూ ఇప్ప‌టికే చావు క‌బురు చ‌ల్ల‌గా చిత్రం నుంచి విడుద‌ల చేసిన ప‌బ్లిసిటీ కంటెంట్ కు అనూహ్య స్పంద‌న అంద‌చేసిన మాస్ అభిమానులు అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లుగానే రాబోతున్న పైన ప‌టారం లోన లొటారం పాట‌ను సిద్ధం చేసినట్లుగా తెలిపారు. చావు క‌బురు చ‌ల్ల‌గా చిత్రాన్ని మార్చి 19న భారీ స్థాయిలో విడుద‌ల చేయ‌డానికి నిర్మాత బ‌న్నీ వాసు స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా పాట‌ల‌ను ప్ర‌ముఖ ఆడియో కంపెనీ ఆదిత్య మ్యూజిక్ వారు విడుద‌ల చేస్తున్నారు.

నటీనటులు..

కార్తీకేయ‌, లావ‌ణ్య త్రిపాఠి, ఆమ‌ని,ముర‌ళి శ‌ర్మ‌, ర‌జిత‌, భ‌ద్రం, మ‌హేష్‌, ప్ర‌భు త‌దితరులు

సాంకేతిక వ‌ర్గం..

స‌మ‌ర్ప‌ణ – అల్లు అర‌వింద్
బ్యాన‌ర్ – జీఏ2 పిక్చ‌ర్స్
నిర్మాత – బ‌న్నీ వాసు
దర్శకుడు – కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి
ఎడిట‌ర్‌- స‌త్య జి
ఆర్ట్‌ – జి ఎమ్ శేఖ‌ర్‌
మ్యూజిక్ – జేక్స్‌ బిజాయ్
సినిమాటోగ్రాఫ‌ర్ – క‌ర‌మ్ ఛావ్లా
అడిషిన‌ల్ డైలాగ్స్ – శివ కుమార్ భూజుల‌
ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్స్ – రాఘ‌వ క‌రుటూరి, శ‌ర‌త్ చంద్ర నాయిడు
పి ఆర్ ఓ – ఏలూరు శ్రీను, మేఘ‌శ్యామ్
లిరిక‌ల్ వీడియోస్ – క్రేజీ షౌట్
ప్రోడ‌క్ష‌న్ డిజైన‌ర్ – మ‌నిషా ఏ ద‌త్‌
కాస్ట్యూమ్ డిజైన‌ర్ – మౌనా గుమ్మ‌డి  

PRO;ELURU SREENU