అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా ఘనంగా ‘చావు కబురు చల్లగా’ ప్రీ రిలీజ్ వేడుక

1151


కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా వరస విజయాలతో సక్సెస్ ఫుల్ నిర్మాతగా దూసుకుపోతున్న బన్నీ వాసు నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమా చావు కబురు చల్లగా. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో ఈ సినిమా వస్తుంది. ఈ సినిమాను కొత్త దర్శకుడు కౌశిక్ పెగళ్ళపాటి తెరకెక్కిస్తున్నారు. మార్చ్ 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది ఈ చిత్రం. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరుగుతుంది. అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా వచ్చిన ఈ వేడుకకు చాలా మంది సినీ ప్రముఖులు వచ్చారు.

దర్శకుడు పరశురామ్ మాట్లాడుతూ.. ‘గీతా ఆర్ట్స్‌తో నా అనుబంధం ఇప్పటిది కాదు. అల్లు అరవింద్ గారు నాకు తండ్రి సమానులు. అలాగే బన్నీ వాసు సోదర సమానుడు. అల్లు అర్జున్ అంటే నాకు ప్రాణం. గీతా ఆర్ట్స్ లో సినిమా అంటే చిన్నా పెద్దా అనేది ఉండదు. కథలకు ప్రాధాన్యత ఇస్తూ.. సినిమాను ప్రేమిస్తుంటారు. అని తెలిపారు.

ప్రముఖ నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ‘బన్నీ ఫ్యాన్స్ అందరికీ హాయ్.. అరవింద్ గారికి, వాసుకి, న్యూ డైరెక్టర్ కౌశిక్, కార్తికేయ.. చావు కబురు చల్లగా టీం అందరికీ నా శుభాకాంక్షలు. ఆర్య విడుదలై 17 ఏళ్ళు అవుతుంది.  ’ అని తెలిపారు.

దర్శకుడు మారుతి మాట్లాడుతూ.. ‘నాకు నా హోమ్ బ్యానర్. నా బ్యానర్ ఇది.. బన్నీ బాబు బ్యానర్. నాకు ఇందాక నుంచి హై ఓల్టేజ్ వైర్ తెగిపోయి ఆడుకుంటే ఎలా ఉందో అలా ఉంది. ఎందుకంటే బన్నీ బాబును ఇక్కడ కూర్చోబెట్టి. నేను ఎన్ని సినిమాలు చేసినా భలేభలే మగాడివోయ్ తో నాకు గుర్తింపు ఇచ్చిన నా సంస్థ గీతా ఆర్ట్స్.  అని తెలిపారు.

నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ.. ‘ఈ ఏవీ వేస్తున్నట్లు కూడా నాకు తెలియదు. ఈ రోజు మీరు చూసిన ఈ విజువల్‌లో అరవింద్ గారు కానీ, బన్నీ గారు కానీ లేకపోతే నాకు ఈ రోజు మీముందు ఇలా నిలబడి మాట్లాడే అర్హత వచ్చేది కాదు. కానీ ఎప్పుడూ నేను అరవింద్ గారి గురించి మాట్లాడాలి.. ఈ రోజు ఫంక్షన్ కోసం అనుకుంటున్నాను. కానీ నాకు టైమ్ కుదరడం లేదు. ఈ రోజు కూడా వస్తూ వస్తూ చాలా ఆలోచిస్తున్నా ఏం మాట్లాడాలి అని.. కానీ ఆయన గురించి నేను మాట్లాడాను అంటే నేను ఖాళీ అయిపోయాను అని. సర్ అందుకే మీ గురించి నాకు మాట్లాడే టైమ్ రాకూడదని కోరుకుంటున్నాను. కానీ నా లైఫ్‌లో అదే గొప్ప స్పీచ్ అవుతుంది. అది నేను రిజర్వ్ చేసుకుంటున్నాను. అంటే నా జీవితంలో ఇక బన్నీ గారి గురించి ఏం చెప్పాలో కూడా అర్థం కావడం లేదు. ఎందుకంటే 18 ఏళ్ళ జర్నీ ఇది. మేమిద్దరం చిన్నప్పటి నుంచి స్నేహితులం.. క్లాస్ మేట్స్.. కాలేజ్ మేట్స్ కాదు. జస్ట్ క్యాజువల్ గా కలిసిన చాలా చాలా నార్మల్ ఫ్రెండ్ షిప్. ఆ నార్మల్ ఫ్రెండ్ షిప్ కు 18 ఏళ్లు. ఎలా గడిచిపోయినయో కూడా ఈ రోజుకు నాకు తెలియడం లేదు.  .   నా హార్ట్ కు చాలా దగ్గరైన సినిమాల్లో ఇది ఒకటి..’ అని తెలిపారు.

హీరోయిన్ లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ.. ‘అందరికీ నమస్కారం.. మా సినిమాను సపోర్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చిన పెద్దవాళ్ళకు అందరికీ థ్యాంక్స్. అల్లు అర్జున్ గారికి ప్రత్యేకంగా థ్యాంక్స్. గీతా ఆర్ట్స్‌తో ఇది నాకు మూడో సినిమా. ఈ సినిమా ఎంతపెద్ద హిట్ అవుతుంది అనేది పక్కనబెడితే కథ ప్రకారం ఈ సినిమా నాకు నచ్చింది. దానికి కౌశిక్, వాసు, అరవింద్ గారికి థ్యాంక్స్. కౌశిక్ ఈ కథ చెప్పినపుడు సగంలోనే ఓకే చెప్పాను. ఇలాంటి కథ చెప్పినందుకు థ్యాంక్స్. కార్తికేయ మంచి కో ఆర్టిస్ట్. ఈ సినిమాకు పని చేసిన అందరికీ థ్యాంక్స్. కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తున్నందుకు వాసుకు, అరవింద్ గారికి మరోసారి థ్యాంక్స్..’ అని తెలిపారు.

దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ.. ‘అరవింద్ గారికి మొట్టమొదటి సారి టేబుల్ ముందు కథ చెప్పినపుడు షివరింగ్ నాకు గుర్తుంది. ఇప్పుడు కూడా ఆయన పక్కన కూర్చుంటే అదే షివర్ ఉంది. మీరు ధైర్యంగా కూర్చున్నాను అనుకోకండి. థ్యాంక్ యూ సో మచ్ సర్.. మా అందరికీ ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు. ఇలాంటి కథను ఈ వయసులో ఇంత జడ్జి చేస్తున్నారంటే మీ జడ్జిమెంట్ కు నమస్కారాలు సర్.   ఈ సినిమా పెద్ద హిట్ కావాలని.. గీత గోవిందం గీసిన గీతను చెరిపేయాలని కోరుకుంటున్నాను..’ అని తెలిపారు.

దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి మాట్లాడుతూ.. ‘ఇక్కడికి వచ్చిన వాళ్లందరికీ థ్యాంక్స్. అరవింద్ గారు మీ సపోర్ట్‌కు థ్యాంక్స్. వాసు సర్ మీ అవకాశానికి థ్యాంక్స్. అమ్మానాన్నలకు థ్యాంక్స్. కంగారు పెట్టొద్దు ఫస్ట్ టైమ్ స్పీచ్. బన్నీ గారు మాట్లాడతారు. ఫస్ట్ నాకు చాలా మంది అడిగారు. గీతా ఆర్ట్స్‌లో ఎలా వచ్చింది అవకాశం. కొన్నేళ్ల కింద నవదీప్ గారికి స్టోరీ చెప్తే అది నచ్చి.. బన్నీ వాసు గారికి పరిచయం చేసారు. ఆ తర్వాత బన్నీ గారి పిఆర్ శరత్ గారు కూడా ఓ కథ విని వాసు గారికి చెప్పారు. అలా నాకు అవకాశం వచ్చింది. దాన్ని నేను సరిగ్గా వాడుకుంటున్నాను అనుకుంటున్నాను సర్.  ప్రొడక్షన్ టీమ్, డైరెక్షన్ టీంకు థ్యాంక్స్. కోవిడ్ టైమ్ లో బాగా సపోర్ట్ చేసారు. ఫస్ట్ టైమ్ స్పీచ్.. ఏమైనా తప్పులు మాట్లాడుంటే మన్నించండి..’ అని తెలిపారు.

నిర్మాత అల్లు అరవింద్ గారు మాట్లాడుతూ.. ‘మిమ్మల్నందర్నీ ఇక్కడ కూర్చోబెట్టి మేమంతా ఇలా మాట్లాడటం ఇబ్బందిగా అనిపిస్తుంది మీకు. ఎందుకంటే బన్నీ మాటలు వినాలని వచ్చారు మీరంతా. కానీ కొన్నిసార్లు తప్పవు.  ఇంతకంటే ఏం చెప్పను. గీతా ఆర్ట్స్ అని బన్నీ స్పెషల్ గెస్టుగా వచ్చాడేమో అనుకుంటారేమో.. వాసు బెస్ట్ ఫ్రెండ్ అని వచ్చాడు. చాలా మాట్లాడొచ్చు కానీ బన్నీ కోసం వేచి చూస్తున్నారు కాబట్టి నేను ముగిస్తున్నాను..’ అంటూ తెలిపారు.

హీరో కార్తికేయ మాట్లాడుతూ.. ‘నాకు నేను రిలాక్స్ అని అల వైకుంఠపురములో బన్నీ గారి డైలాగ్ నాకు నేను చెప్పుకోవాలి. ఆర్ఎక్స్ 100 నుంచి ఇప్పటి వరకు జరిగే ప్రతీ ఫంక్షన్స్‌కు తెలిసిన హీరోలకు మొహమాటంతో మెసేజ్ పెట్టడమే తప్ప.. బన్నీ గారు లాంటి స్టార్ హీరోను పిలిచే ఛాన్స్ కూడా ఎప్పుడూ రాలేదు. అలాంటిది నా సినిమాకు ఈ రోజు బన్నీ గారు గెస్టుగా వచ్చి ఇక్కడ కూర్చున్నారు. ఇది నాకు ఎంత ఎమోషనల్ మూవెంట్ అనేది నాకు లోపల అర్థమవుతుంది.  . (మా చావు కబురు చల్లగా బ్లాక్ బస్టర్ చేస్తారని). రెడ్ ఇంక్ లో ఉంటాం.. బ్లూ ఇంక్ లో తెలుగు సినిమా ప్రేక్షకులు.. ’ అని ముగించారు.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారూ మాట్లాడుతూ.. ‘చావు కబురు ఎప్పుడూ చల్లగా చెప్పాలి. పుష్ప గురించి చివర్లో చెప్పాలి. ఈ సినిమా గురించి ఓ పిట్టకథ ఉంది. వాసు గురించి ఒక్క లైన్ లో చెప్పాలంటే నేను ఇవాళ ఇలా ఉన్నానంటే.. మా నాన్నగారి కంటే ఎక్కువ వాసు కారణం. గంగోత్రి నుంచి ట్రావెల్ అవుతున్నాం. అద్భుతమైన సినిమాలు చేసాడు. 100 పర్సెంట్ లవ్, గీత గోవిందం, భలేభలే లాంటి సినిమాలు చేసాడు. అలాంటి వాసుకు కథ నచ్చడం చిన్న విషయం కాదు.  . 26 ఏళ్ళకే ఇంత మెచ్యూరిటీనా.. నాకు రెండు మూడేళ్ల కింద వచ్చిన మెచ్యూరిటీ ఈయనకు ఇప్పుడే వచ్చింది.   అంటూ ముగించారు.–

Thanks & Regards,
Eluru Sreenu
P.R.O