ఫిల్మ్ నగర్ లోని క్యూబా డ్రైవ్ ఇన్ లో ఏర్పాటు చేసిన ఫిష్ బైట్ రెస్టారెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్ర టూరిజం శాఖా మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిధి గా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి ఈ రెస్టారెంట్ ని లాంచ్ చేయగా ఆయనతో పాటు బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ ఓబీసీ మోర్చా డా. కె. లక్ష్మణ్, ఖైరతాబాద్ ఎక్స్ ఎమ్మెల్యే కె. రామచందర్ రెడ్డి లు అతిధులుగా హాజరయ్యారు. ఇంకా ఫిష్ బైట్ రెస్టారెంట్ ఫౌండర్ మేఘాంశ్ రెడ్డి, కో ఫౌండర్ రాహుల్ గోవా లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేంద్ర టూరిజం శాఖా మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ..ఫిలిం నగర్ లో ఏర్పాటుచేసిన ఈ ఫిష్ బైట్ రెస్టారెంట్ ప్రారంభోత్సవానికి నన్ను ముఖ్య అతిధిగా పిలవడం చాలా ఆనందంగా ఉంది. సోదరులు మేఘాంశ్ రెడ్డి, రాహుల్ గోవాలు ఈ రెస్టారెంట్ ను విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. సీ ఫుడ్ ఆరోగ్యానికి ఎంతో మంచిది.. ఇప్పుడిప్పుడే మన దేశంలో హెల్త్ మీద ధ్యాస పెరిగింది. అందరు మంచి ఫుడ్ తీసుకోవాలని భావిస్తున్నారు.. అలా ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ ఫిష్ బైట్ రెస్టారెంట్ రకరకాల ఫిష్ ఫుడ్స్ తో మీ ఆరోగ్యానికి మంచి కలిగించేలా ఉన్నాయి. భారత దేశ ప్రభుత్వం టూరిజానికి సంబందించిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంది. విమానయాన ప్రయాణాలు తిరిగి ప్రారంభించేందుకు కసరత్తులు చేస్తున్నాం. దేశంలో పర్యాటక రంగం వేగంగా పుంజుకుంటోంది. దానికి తగ్గట్లుగా భారత ప్రభుత్వం సిద్ధమవుతుంది అన్నారు.
ఫౌండర్ మేఘాంశ్ రెడ్డి మాట్లాడుతూ.. మా విన్నపాన్ని అంగీకరించి ఈ కార్యక్రమానికి వచ్చిన కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. ఫిష్ బైట్ రెస్టారెంట్ మన ఫిలిం నగర్ లోని క్యూబా డ్రైవ్ ఇన్ లో ఏర్పాటు చేయడం నిజంగా హ్యాపీ గా ఉంది. మంచి హెల్దీ ఫుడ్ అందిస్తున్నాం. ప్రతి ఒక్కరికి బాగా నచ్చుతుంది. ఈరోజుల్లో హై ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. సీ ఫుడ్ లో హై ప్రోటీన్ ఉంటుంది. ఈ రెస్టారెంట్ లో సీ ఫుడ్ కి సంబందించిన మంచి మంచి వెరైటీస్ ఉంటాయి. అందరికి మంచి రుచితో పాటు హెల్త్ ను కూడా అందిస్తాం అన్నారు.
కో ఫౌండర్ రాహుల్ గోవా మాట్లాడుతూ.. ఈ ఫిష్ బైట్ రెస్టారెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించిన కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఫిష్ బైట్ రెస్టారెంట్ మూడవ అవుట్ లెట్ ఫిలిం నగర్ క్యూబ్ డ్రైవ్ లో ఏర్పాటు చేయడం జరిగింది. మొదటి రెండు ఎంతో విజయవంతంగా రన్ అవుతున్నాయి. సీ ఫుడ్ ఇక్కడ ప్రధానంగా దొరుకుతుంది. ఈ కరోనా సమయంలో తీసుకోవాల్సిన లోఫ్యాట్ హై ప్రోటీన్ ఫుడ్ కేవలం సీ ఫుడ్, మరియు వెజిటేబుల్స్ లోనే ఉంటుంది. ఈ రెండు ఇక్కడ మంచి మంచి వెరైటీస్ తో మీకు అందజేస్తున్నాం. అందరు ఈ టేస్టీ అండ్ హెల్తీ ఫుడ్ ని టేస్ట్ చేయండి అన్నారు.