‘క్యాలీ ఫ్లవర్‌’ సినిమాను అందరూ ఎంజాయ్ చేస్తారు – సంపూర్ణేష్ బాబు

338

‘హృదయ కాలేయం’ సినిమాతో హీరోగా ప‌రిచ‌య‌మ‌య్యారు. బర్నింగ్‌ స్టార్ సంపూర్ణేష్‌బాబు ప్రస్తుతం ‘క్యాలీ ఫ్లవర్‌’ అనే స‌రికొత్త టైటిల్‌తో మ‌న‌ముందుకు రానున్నారు. ‘శీలో రక్షతి రక్షిత:’ అనేది ఉపశీర్షిక. గుడూరు శ్రీధర్‌ సమర్పణలో మధుసూదన క్రియేషన్స్, రాధాకృష్ణా టాకీస్‌ పతాకాలపై ఆశా జ్యోతి గోగినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆర్కే మలినేని ఈ సినిమాకు దర్శకులు. . ఈ చిత్రాన్ని నవంబరు 26న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలో హీరో సంపూర్ణేష్‌బాబు మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ఇందులో ద్విపాత్రాభినయం చేస్తున్నాను. పెద్దాయన ఆండ్రిఫ్లవర్..రెండో పాత్రకు క్యాలీఫ్లవర్ అనిపెట్టారు. క్యాలీ ఫ్లవర్ అనే టైటిల్ ఎందుకు పెట్టారు అని నేనూ అడిగాను. క్యారెక్టర్ పాత్ర పేరు కూడా అదే.. ఒకానొక సమయంలో కాపాడే కవచంగా కూడా మారుతుందని డైరెక్టర్ అన్నారు.

శీలం అనేది ఆడవాళ్లకే కాదు.. మగవాళ్లకు కూడా ముఖ్యం. అది కనుక పాటిస్తే ప్రపంచంలో ఎలాంటి సమస్యలు ఉండవు అనే పాయింట్ చెప్పాడు. అది చాలా నచ్చింది. కొత్త చెబుతున్నాడని అనిపించింది. అందుకే ఓకే చెప్పాను.

ఇందులో కొత్తగా కనిపిస్తాను. కొబ్బరిమట్టలో చెప్పినట్టుగా భారీ లెంగ్తీ డైలాగ్స్ ఉండవు. కోర్ట్ సీన్‌లో మాత్రం అలాంటి డైలాగ్స్ ఉంటాయి.

35 ఏళ్లు వచ్చే వరకు పెళ్లి చేసుకోకూడదని వంశ పారంపర్యంగా వస్తుంది. అందుకే అంత వరకు పవిత్రంగా ఉండాలని, ఏ అమ్మాయి కూడా దగ్గరగా వచ్చి మాట్లాడకూడదుని, అంత దూరంలో ఉండాలని ఆ స్కేల్ వాడాం.

ఈ సినిమాలో గెటప్స్ బాగా సెట్ అయ్యాయి.. హీరో రేప్‌కు గురవ్వడం, ఆ తరువాత వచ్చే పాటలు ఇలా అన్నీ బాగుంటాయి. అందరూ ఎంజాయ్ చేస్తారు. అందుకే హృదయ కాలేయం, కొబ్బరిమట్ట సినిమాల్లా అందరికీ నచ్చుతుందని అన్నాను.

డైరెక్టర్ ఆర్కే ఇంతకు ముందు సీరియల్స్ చేశారు. ఈ కథను ఎప్పటి నుంచో అనుకున్నారట. ఈ పాత్ర అలా ఉండాలి.. ఇలా ఉండాలని అనుకున్నారట. సంపూర్ణేష్ బాబు అయితే బాగుంటుందని అనుకున్నారట. అలా నా వద్దకు వచ్చారు. కథ చెప్పారు.

హీరోయిన్ వాసంతి ఇది వరకు కన్నడలో సీరియల్స్ చేశారు. తనకు ఇదే మొదటి తెలుగు సినిమా. అయినా కూడా చక్కగా నటించారు. పల్లెటూరిలో చలాకీగా తిరుగుతూ, బావను ఏడిపించి మరదలి పాత్రలో కనిపిస్తారు.

ఇందులో నేను ఫ్లోర్ మూమెంట్స్ వంటివి ఏం చేయలేదు. ఇందులో కొత్తగా ట్రై చేశాను.

నేను ఎంత అతి చేసినా ప్రేక్షకులు ఆదరిస్తారు. దాన్ని దృష్టిలో పెట్టుకునే కథలు రాస్తుంటారు. హ‌ృదయ కాలేయంలో చితిలోంచి లేచి రావడం, కొబ్బరిమట్టలో కొడితే సుమో చేతిలోకి వస్తుంది. అది పరాకాష్ట. సింగం 123సినిమాలో ఇంట్లో స్మిమ్మింగ్ పూల్‌లో దూకితే ఎక్కడెక్కడో తేలుతాను.

ఈ రోజు సంతోషంగా ఉన్నామా? రేపు మంచిగా ఉంటాామనే నమ్మకం ఉందా? అనే ఆలోచిస్తాను. నటుడిగా ఏం చేయడానికైనా రెడీ. ఏ పాత్రలు వస్తే అవి చేస్తాను.

హీరోగా నాలుగు సినిమాలు చేస్తున్నాను. అందుకే గెస్ట్ అప్పియరెన్స్ ఎక్కువగా చేయలేకపోతోన్నాను. ఒక సినిమాలో ఓ కారెక్టర్ వేశాను.

గోల్డ్ మ్యాన్ అనే సినిమా చేద్దామని అనుకున్నాను. కానీ కరోనా వల్ల వెనక్కి వెళ్లిపోయింది.

నరసింహాచారి నుంచి సంపూగా ఎదగడం, ఆటోలో తిరగడం నుంచి ఫ్లైట్‌లో తిరిగే స్థాయి వరకు వచ్చాను. అదే నాకు సంతోషం. ప్రస్తుతం నా చేతిలో ఐదు సినిమాలు ఉండటం అదృష్టం.

ఉన్నదాంట్లో ఎంతో కొంత దానం చేయడం నాకు ఆనందంగా ఉంటుంది. తెలియని సంతృప్తినిస్తుంది.

తమిళంలో హీరోగా ఓ సినిమా చేస్తున్నాను. ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తయింది. స్టోరీ బేస్డ్ సినిమా. సీరియస్‌గా సాగుతుంది.

సాయి రాజేష్ గారు ప్రస్తుతం ఆనంద్ దేవరకొండతో సినిమా చేస్తున్నాడు. ఆ తరువాత మేం మళ్లీ ఓ సినిమా చేస్తాం.

Pro: Vamsi – Shekar

9581799555 – 9553955385