HomeTelugu50 రోజుల చేరువలో ‘సి 202’

50 రోజుల చేరువలో ‘సి 202’

మైటీ ఒక్ పిక్చర్స్ బ్యానర్ పై మనోహరి కె ఎ నిర్మాతగా మున్నా కాశీ హీరోగా నటించి దర్శకత్వం వహించిన హర్రర్ థ్రిల్లర్ చిత్రం ‘సి 202’ అక్టోబర్ 25న విడుదలై ఆరు వారాలుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పట్టణాలు అయినా విజయవాడ, విశాఖపట్నం, ఏలూరు, రాజమండ్రి, కాకినాడ మరియు ఇతర ప్రాంతాల్లో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. మరో వరం తో 50 రోజుల మైలు రాయిని చేరుకుంటుంది.

ఈ సందర్భంగా హీరో దర్శక నిర్మాత మున్నా కాశీ మాట్లాడుతూ “సి 202 చిత్రం అక్టోబర్ 25న రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల అయింది. మంచి రివ్యూస్ మరియు మౌత్ టాక్ తో ప్రేక్షకుల ఆదరణ పొంది ఆరు వారాలుగా విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఇప్పుడు మా చిత్రం ఏడో వరం లోకి ప్రవేశించింది. ఇప్పటికే 50 లక్షల షేర్ వసూళ్లు చేసింది. మరో వారం రోజుల్లో 50 రోజుల మైలురాయి చేరుకుంటుంది. మా సి 202 చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు మా ధన్యవాదాలు. చూడని వారు మీ సమీప థియేటర్ లో నేడే చూడండి” అని తెలిపారు.

నటీనటులు : మున్నా కాశీ, షారోన్ రియా ఫెర్నాండెజ్, తనికెళ్ళ భరణి, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాష్, షఫీ, చిత్రం శీను, వై విజయ, అర్చన తదితరులు

సాంకేతిక బృందం
చిత్రం పేరు : ‘సి 202’
బ్యానర్ : మైటీ ఒక్ పిక్చర్స్
నిర్మాత : మనోహరి కె ఎ
కో ప్రొడ్యూసర్ : చిన్నయ్య కొప్పుల, అలివేణి వోలేటి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : దత్తు ఎమ్
కెమెరా మెన్ : సీతారామరాజు ఉప్పుతాల్లా
డీఐ : డెక్కన్ డ్రీమ్స్
అట్మాస్ మిక్స్ : దేవి కృష్ణ కడియాల
సౌండ్ ఎఫెక్ట్స్ : సాయి శ్యాం. కె
కథ, స్క్రీన్ ప్లే, మాటలు, సంగీతం, ఎడిటింగ్, దర్శకత్వం : మున్నా కాశీ

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES