“బుల్లెట్ సత్యం” ట్రైలర్ ను విడుదల చేసిన నటుడు వినోద్ కుమార్..డిసెంబర్ 10 న గ్రాండ్ రిలీజ్*

572

*లక్ష్మీ నారాయణ ప్రెజెంట్స్ సాయితేజ ఎంటర్టైన్మెంట్ పతాకం పై దేవరాజ్,సోనాక్షి వర్మ హీరో, హీరోయిన్ లుగా మదుగోపు దర్శకత్వంలో దేవరాజ్ నిర్మిస్తున్న చిత్రం ‘బుల్లెట్ సత్యం’.ఈ చిత్రం లోని రామసక్కని సీలక పాటతో పాటు ఇందులో ఉన్న మూడు పాటలకు యూట్యూబ్ లో చాలా మంచి వ్యూస్ తో పాటు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొన్న ఈ చిత్రం ఈ నెల 10 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల ఆవుతుంది. ఈ సందర్భంగా “బుల్లెట్ సత్యం” చిత్ర ట్రైలర్ ను హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా విడుదల చేశారు.ఈ కార్యక్రమానికి దర్శకుడు ప్రసాద్ వర్మ ,యస్ ఆర్. కళ్యాణ మండపం బ్యానర్ శంకర్,దర్శకుడు అభిలాష్ రెడ్డి తదితర సినీ ప్రముఖులు హాజరై చిత్ర యూనిట్ కు బెస్ట్ విషెస్ తెలియజేయగా. సీనియర్ నటుడు వినోద్ కుమార్ “బుల్లెట్ సత్యం” ట్రైలర్ ను విడుదల చేశారు. అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో*

*ముఖ్య అతిధిగా వచ్చిన దర్శకుడు అభిలాష్ రెడ్డి మాట్లాడుతూ..* ట్రైలర్ చాలా బాగుంది.దేవరాజ్ చాలా బాగా నటించాడు.ఈ నెల 10 న గ్రాండ్ గా విడుదల అవుతున్న ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను అని అన్నారు.

*రాధాకృష్ణ మూవీ దర్శకుడు ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ* .. ఈ సినిమాకు టీం అంతా ఎంతో హార్డ్ వర్క్ చేశారు.ట్రైలర్ బాగుంది.ఈ నెల 10 న వస్తున్న ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని అన్నారు.

*సీనియర్ నటుడు వినోద్ కుమార్ మాట్లాడుతూ* .. ఈ బుల్లెట్ సత్యం సినిమాను అందరూ డెడికేటెడ్ తో ఒక టీం వర్క్ పని చేశారు.దేవరాజ్ కు ఇది మొదటి సినిమా అయినా హీరోగా చేస్తూ నిర్మాతగా ఈ సినిమా ఎలా తీయాలని చక్కగా ప్లాన్ చేసుకొని తీశాడు..విల్లేజ్ నేటివిటీ లో వస్తున్న ఈ చిత్రంలో నేను పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఉన్న పాత్ర చేశాను. దర్శకుడు చక్కని సబ్జెక్ట్ ను సెలెక్ట్ చేసుకున్నాడు ఇందులో ఫ్యామిలీ ఓరియెంటెడ్, పొలిటికల్ క్రైమ్,థ్రిల్లర్ ఇలా అన్ని షేడ్స్ ఉన్న డీఫ్రెంట్ సినిమా ఇది.ఈ కథ నాకు చాలా బాగా నచ్చింది. కెమెరా వర్క్ అద్భుతంగా ఉంది. డర్శకుడు నిజామాబాద్ ను రాజమండ్రి లో ఆట్మాస్ఫియర్ లా చూపించాడు.ఈ నెల 10 న విడుదల అవుతున్న మా సినిమా బెస్ట్ సినిమా అవుతుంది. ప్రేక్షకులందరూ ఈ సినిమాను ఆదరించి పెద్ద హిట్ అయ్యేలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు

*హీరో, నిర్మాత దేవరాజ్ మాట్లాడుతూ* …వినోద్ కుమార్ గారి సీతారత్నం గారి అబ్బాయి,మామగారు వంటి సినిమాలు ఇప్పటికీ ఫెవరేట్ గా నిలిచాయి.తను ఈ సినిమాలో నటించడం మాకు పెద్ద అసెట్.ఈ చిత్రం విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది.ఇందులో ఉన్న అన్ని పాటలకు ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.రాంబాబు మంచి పాటలు రాశారు..యాజమాన్య మంచి సంగీతం ఆదించారు. సినిమా చూస్తున్న ప్రేక్షకుడికి ఈ చిత్రం ఎక్కడా కూడా సినిమా టిక్ గా ఉండదు..రియాలిస్టిక్ గా ఉంటుంది. మొదటిసారిగా నేను హీరో గా నటిస్తూ నిర్మించిన ఈ చిత్రానికి అందరూ నన్ను ఎంకరేజ్ చేస్తూ నా కేంతో సపోర్టు చేశారు. ఈ నెల 10 న గ్రాండ్ గా విడుదల అవుతున్న మా సినిమాను ప్రేక్షకులు ఆదరించి నన్ను మా టీం ను ఆశీర్వదించి హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అన్నారు.

*చిత్ర దర్శకుడు మధు గోపు మాట్లాడుతూ* ..ఇది పూర్తి విల్లేజ్ బ్యాక్ డ్రాప్ మూవీ ఇది.ఈ సినిమా గురించి చెప్పాలంటే ఒక విలేజ్ లో ఉండే ఎంపీటీసీ ఆలోచనలు ఎలా ఉంటాయి. అక్కడ ఎంపిటిసి పోస్ట్ కోసం వారు ఎలా పరితపిస్తారు.ఆ ఎంపిటిసి అవ్వడం కోసం తను లైఫ్ లో ఏం కోల్పోయాడు. ఎవరితో తలపడాల్సి వచ్చింది అనేదే కథ. దేవరాజ్ గారు కరోనా టైం లో కూడా మా అందరికీ అవకాశం ఇవ్వడానికి ముందుకు వచ్చి చిత్రాన్ని నిర్మించడమే కాక హీరోగా నటించారు.తను వైజాగ్ లోని సత్య మాస్టారు దగ్గర శిక్షణ తీసుకున్నాడు.నేను అనుకున్న దానికంటే చాలా బాగా నటించాడు. ఫ్యూచర్ లో మంచి యాక్టర్ అవుతాడు. రాంబాబు గారు చక్కటి సాహిత్యాన్ని అందించారు.. టెక్నీషియన్స్ అందరూ చాలా చక్కగా సహకరించడంతో సినిమా చాలా బాగా వచ్చింది అందరూ ఈ టైటిల్ బాగుందని అప్రిసియేట్ చేస్తున్నారు.ఇలాంటి మంచి సినిమా చేసే అవకాశం ఇచ్చిన దేవరాజ్ గారికి ధన్య వాదాలు.ఈ నెల 10 న గ్రాండ్ గా విడుదల అవుతున్న మా సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అన్నారు.

*కమెడియన్ చలాకీ చంటి మాట్లాడుతూ* ..ఈ సినిమా కోసం అందరం ఏంతో కష్టపడ్డారు.బుల్లెట్ సత్యం టైటిల్ కూడా చాలా బాగుంది..ఇందులో నేను హీరో కు ఫ్రెండ్ గా నటించాను.ఇందులో నేను ఒక పాట కూడా పాడడం జరిగింది.ప్రస్తుతం చిన్న మూవీ అయినా కంటెంట్ బాగుంటే చాలు ప్రేక్షకులు ఆదరిస్తారు.. ఈ మూవీ కు మంచి విజయం దక్కాలని” అన్నారు.

*కమెడియన్ ధనరాజ్ మాట్లాడుతూ* .. హీరో గారు బిజినెస్ చూసుకుంటూ సినిమాలో హీరోగా, నిర్మాతగా చెయ్యడం జరిగింది.దర్శకుడు ఫ్రెండ్లీ గా మా అందరి చేత చాలా చక్కని నటనను కనబరిచారు..ఇలాంటి మంచి సినిమాలో చేసే అవకాశం ఇచ్చిన దేవరాజ్ గారికి ధన్యవాదాలు.ఈ నెల 10 న గ్రాండ్ గా విడుదల అవుతున్న ఈ సినిమా పెద్ద విజయం సాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అన్నారు.

*హీరోయిన్ సోనాక్షి వర్మ మాట్లాడుతూ* ..నా పేరు సోనాక్షి వర్మ నేను ఇండస్ట్రీ కు వచ్చి నాలుగు సంవత్సరాలు అయ్యింది. నేను యాడ్ లు, షాట్ ఫిలిమ్స్ లో నటించాను. నా గ్రాడ్యుయేషన్ పూర్తి అయింది. నాకు తెలుగు ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టం. నన్ను గుర్తించి నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన ,దర్శక,నిర్మాత లకు నా కృతజ్ఞతలు.

*లిరిక్ రైటర్ రాంబాబు గోశాల మాట్లాడుతూ.* ఇందులో ఉన్న మూడు పాటలు నేనే రాశాను. ఇందులో ఉన్న రామసక్కని సిలక కు మంచి రెస్పాన్స్ వస్తుంది. యాజమాన్య గారు మంచి సంగీతం,ఆర్.ఆర్ ఆదించారు. “ఇలా అన్ని పాటలు రాసే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు. దేవరాజ్ గారికి ఈ సినిమా గొప్ప విజయం సాధించాలి.తన మొదటి సినిమాతోనే హీరోగా, నిర్మాతగా రెండు చాలా చక్కగా బ్యాలెన్స్ చేశాడు.ఈ సినిమా తనకు పెద్ద విజయం సాధించి ఎన్నో అవ కాశాలు రావాలి. దర్శకుడు మధు గారు చక్కని కథను సెలెక్ట్ చేసుకొన్నాడు.అఖండ తో ప్రేక్షకులందరూ థియేటర్ కు వస్తున్నారు.ఇప్పుడు వస్తున్న మా సినిమాకు కూడా ప్రేక్షకులు వచ్చి ఆదరించాలని కోరుతున్నాను అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ ఈ నెల 10 విడుదల అవుతున్న మా బుల్లెట్ సత్యం గొప్ప విజయం సాధించాలని మనస్పూర్తిగా కోరుతున్నామని అన్నారు.

*నటీ నటులు..*
దేవరాజ్, సోనాక్షి వర్మ,వినోద్ కుమార్,మోనా తాకుర్, సంజయ్ రెడ్డి,చలాకి చంటి,ధన్ రాజ్,అప్పారావు,శివ లీల,సత్తెన్న,వాసు,రాకేష్,చేతన్..

*టెక్నీషియన్స్* …
డైరెక్టర్..మదు గోపు,
నిర్మాత.. పోతూరి పవిత్ర,
మ్యూజిక్.. వినోద్ యాజమాన్య,
డి ఓ పి..G. L. బాబు
ఎడిటర్..S. B. ఉద్ధవ్
కొరియోగ్రఫీ..చంద్ర కిరణ్
లిరిక్స్..రాంబాబు గోషాల
ఆర్ట్ డైరెక్టర్.. రామకృష్ణ
రచన-సహకారం..సంజయ్ బంగారపు