అక్టోబర్ లో విడుదలకు సిద్ధమవుతున్న “బుల్లెట్ “

274

మెగా ప్రొడ్యూసర్ శ్రీ ఏ.ఎం రత్నం గారి చేతుల మీద మెమరీ మేకర్స్ సోమిశెట్టి హరికృష్ణ సమర్పించు, తుమ్మూరు కోట ఫిలిం సర్క్యూట్ బ్యానర్ పై నిర్మించిన “బుల్లెట్” మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా

డైరెక్టర్ చౌడప్ప మాట్లాడుతూ.. అక్టోబర్ లో విడుదలకానున్న ఈ “బుల్లెట్” చిత్రం ఫుల్ యాక్షన్ మూవీగా తెరకెక్కించిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా తీయడం జరిగింది. “స్వచ్ఛ భారత్” అంటే గతంలో రోడ్లు ఊడ్చి చెత్త ఎత్తివేయడం కాదు దేశానికి పట్టిన చీడ పురుగులని ఏరేసే ప్రయత్నమే లక్ష్యం అని, ఇప్పుడున్న ఈ సమాజానికి బుద్ధుడు కూడా రుద్రు డౌతాడని.. “బుద్ధం శరణం గచ్చామి” కాదు “యుద్ధం శరణం గచ్చామి” అని చాటి చెప్పే సినిమా అవుతుంది . మ్యూజిక్ డైరెక్టర్ సుభాష్ ఆనంద్ అద్భుతమైన సాంగ్స్ ఇచ్చాడు. హీరో రవి వర్మ కొత్తవాడైనా చాలా బాగా చేశాడు. అతనికి సినిమా రిలీజ్ అయితే చాలా మూవీస్ వస్తాయి. సినిమా చాలా బాగా వచ్చింది.ఈ సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.

హీరో రవి వర్మ మాట్లాడుతూ .. ఇది నా ఫస్ట్ మూవీ అని నాకు ప్రేక్షకుల ఆదరాభిమానాలు ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం అని చెప్పారు

నటీనటులు
హీరో రవి వర్మ, సంజనా సింగ్, ఆలోక్ జైన్ ,మనీషా దేవ్, జీవ ,విజయ రంగరాజు ,సంధ్య శ్రీ, నర్సింగ్ యాదవ్, జబర్దస్త్ అప్పారావు, సందీప్ రెడ్డి ,ఆనంద్ జాషువా, వైజాగ్ ప్రసాద్ ,గిరిధర్, మల్లికార్జున రావు, జగన్ తదితరులు

సాంకేతిక నిపుణులు
నిర్మాత :- ఎం సి రావు ,జి గోపాల్ ,ఎమ్.వి మల్లి కార్జునరావు ,కోసూరి సుబ్రహ్మణ్యం ,మని
కథ-స్క్రీన్ప్లే-దర్శకత్వం :- చౌడప్ప
డైరెక్టన్ డిపార్ట్మెంట్ :- సుధీర్ రెడ్డి ,గురునాథం ,వెంకట్ ,శివ
మాటలు :- నివాస్
కెమెరా :- ఆనంద్ మురుకురి
సంగీతం :- సుభాష్ ఆనంద్
ఎడిటర్ :- నందమూరి హరి
బ్యాగ్రౌండ్ స్కోర్, ఆర్.ఆర్ :- చిన్న
ఆర్ట్స్ :- రామకృష్ణ
మేకప్ :- శివ
క్యాస్ట్యూమ్స్ :- నాగరాజు
ప్రొడక్షన్ మేనేజర్ :- బాబు