జి.నాగేశ్వర రెడ్డి, గ‌రుడ‌వేగ అంజి ‘బుజ్జి ఇలా రా’ గ్రాండ్ గా జరిగిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్

219

సునీల్, ధన్‌రాజ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘బుజ్జి ఇలా రా’. ‘సైకలాజికల్‌ థ్రిల్లర్‌’ అనేది ట్యాగ్‌లైన్‌. చాందినీ అయ్యంగార్‌ హీరోయిన్‌. ప్రముఖ దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. రూపా జ‌గ‌దీశ్ స‌మ‌ర్పణ‌లో ఎస్ఎన్ఎస్ క్రియేష‌న్స్ ఎల్ఎల్‌పి, జీ నాగేశ్వర‌రెడ్డి టీమ్ వ‌ర్క్ ప‌తాకాల‌పై అగ్రహారం నాగిరెడ్డి, సంజీవ‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గ‌రుడ‌వేగ అంజి ఈ సినిమాకి దర్శకత్వం వహించడం తో పాటు సినిమాటోగ్రాఫ‌ర్‌గా కూడా వ‌ర్క్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రమోషనల్ మెటిరియల్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా హీరో అల్లరి నరేష్ ముఖ్య అతిధిగా ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది.

ఈ సందర్భంగా అల్లరి నరేష్ మాట్లాడుతూ.. జి.నాగేశ్వర రెడ్డి గారు నాకు ఇష్టమైన దర్శకులు. నా కెరీర్ లో సీమశాస్త్రి, సీమటపాకాయ్ లాంటి పెద్ద విజయాలు ఇచ్చారు. దర్శకుడిగా కంటే నాకు మంచి స్నేహితులు. అంజి కెమరామెన్ అవ్వకముందే నాకు తెలుసు.

ధనరాజ్ మాట్లాడుతూ. నాగేశ్వర రెడ్డి గారు ఈ చిత్రానికి బ్యాక్ బోన్. ప్రతి రోజు మాకంటే ముందే సెట్స్ లో వుండేవారు. ఒక మంచి సినిమా ఇవ్వాలనే ఉద్దేశంతో నిర్మాతల కోసం, నా కోసం, దర్శకుడు అంజి కోసం, సినిమా యూనిట్ అందరి కోసం నాగేశ్వర రెడ్డి గారు కష్టపడ్డారు

దర్శకుడు అంజి మాట్లాడుతూ.. నాకు ఈ సినిమా అవకాశం ఇచ్చిన నాగేశ్వర రెడ్డి గారికి జీవితాంతం రుణపడి వుంటాను. అలాగే ఈ చిత్ర నిర్మాతలకు రుణపడి వుంటాను. దర్శకత్వ పర్యవేక్షణ అనే మాటకు సరైన అర్ధం చూపేలా నాగేశ్వర రెడ్డి గా ఈ చిత్రం కోసం పని చేశారు. ఈ సినిమాకి కర్త కర్మ క్రియ అంతా ఆయనే. అల్లరి నరేష్ గారు ఈ ట్రైలర్ ని లాంచ్ చేయడం ఎంతో ఆనందంగా వుంది.

న‌టీన‌టులు:
సునీల్‌, ధ‌న‌రాజ్‌, చాందినీ , పోసాని కృష్ణముర‌ళి, శ్రీకాంత్ అయ్యర్‌, స‌త్యకృష్ణ వేణు, భూపాల్‌, టెంప‌ర్ వంశీ త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు:
క‌థ‌, స్క్రీన్ ప్లే: జి.నాగేశ్వర రెడ్డి
సినిమాటోగ్రపీ, ద‌ర్శక‌త్వం: గ‌రుడ‌వేగ అంజి
నిర్మాత‌లు: అగ్రహారం నాగిరెడ్డి, సంజీవ రెడ్డి
స‌మ‌ర్పణ‌: రూపా జ‌గ‌దీశ్‌
బ్యాన‌ర్స్‌: జి.నాగేశ్వర రెడ్డి టీమ్ వ‌ర్క్‌, ఎస్ఎన్ఎస్ క్రియేష‌న్స్ ఎల్ఎల్‌పి
మ్యూజిక్‌: సాయికార్తీక్‌
డైలాగ్స్‌: భాను, చందు
ఆర్ట్‌: చిన్నా
ఎడిట‌ర్‌: చోటా కె.ప్రసాద్‌
ఫైట్స్: రియ‌ల్ స‌తీశ్‌
కాస్ట్యూమ్స్‌: మ‌నోజ్‌
మేక‌ప్‌: వాసు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: సీతారామరాజు
పి.ఆర్‌.ఓ: వంశీ శేఖ‌ర్
Pro: Vamsi – Shekar

9581799555 – 9553955385