HomeTeluguపద్మశ్రీ డా.అల్లు రామలింగయ్య గారి 101వ జయంతి సందర్భంగా కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన అల్లు అయాన్..

పద్మశ్రీ డా.అల్లు రామలింగయ్య గారి 101వ జయంతి సందర్భంగా కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన అల్లు అయాన్..

తెలుగు సినిమా గర్వించే లెజెండరీ సీనియర్ నటులు కీర్తి శేషులు పద్మశ్రీ డా.అల్లు రామలింగయ్య గారు. ఈరోజు ఆయన 101వ జయంతి. ఈ సందర్భంగా జూబిలీ హిల్స్ లోని అల్లు బిజినెస్ పార్క్ లో అల్లు రామలింగయ్య గారి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అల్లు అర్జున్ కుమారుడు అల్లు అయాన్ చేతుల మీదుగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా

అల్లు అయాన్ మాట్లాడుతూ “శ్రీ శ్రీ అల్లు రామలింగయ్య తాతగారి విగ్రహాన్ని ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉంది. ఈ పుట్టినరోజున ఆయన మనతో లేకపోయినా.. ఆయన మంచి పనులు ఎప్పుడు మనతో ఉన్నాయి. తాత గారి దీవెనలు మాపై ఎప్పుడూ ఉంటాయి” అని అన్నాడు. ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు, సన్నిహితులు అల్లు రామలింగయ్య గారితో ఉన్న మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు. వెయ్యి సినిమాలకు పైగా నటించి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన గొప్ప నటులు అల్లు రామలింగయ్య గారు. టాలీవుడ్ లో మూడు తరాల సినీ ప్రేక్షకులను ఆయన అలరించారు. తనదైన నటనతో యాబైయేళ్లపాటు సినిమాల్లో నవ్వుతూ నవ్విస్తూ యావత్ ప్రజానీకాన్ని అలరించిన అల్లు రామలింగయ్య గారు తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం కల్పించుకున్నారు.


Eluru Sreenu,Maduri Madhu
P.R.O

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES