HomeTelugu*అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదల కు సిద్ధమైన "బ్రాందీ డైరీస్"*

*అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదల కు సిద్ధమైన “బ్రాందీ డైరీస్”*

వ్యక్తిలోని వ్యసన స్వభావాన్ని దానివల్ల వచ్చే సంఘర్షణలతో సహజమైన సంఘటనను, సంభాషణలు పరిణితి ఉన్న పాత్రలతో ఆద్యంతం ఆసక్తికరంగా కొనసాగుతూ వాస్తవికత వినోదాల మేళవింపు తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రమే “బ్రాందీ డైరీస్”.గరుడ శేఖర్, సునీత సద్గురు హీరో, హీరోయిన్లు గా కలెక్టీవ్ డ్రీమర్స్ పతాకంపై శివుడు దర్శకత్వంలో లేళ్ల శ్రీకాంత్ మరియు మిత్ర బృందం కలసి నిర్మించిన క్రౌడ్ ఫండెడ్ చిత్రం* “బ్రాందీ డైరీస్”. ఈ చిత్రానికి ప్రకాశ్ రెక్స్ సంగీతాన్ని అందించగా జానపద గాయకుడు రచయిత పెంచల దాసు ఒక పాట ఇవ్వగా సాయి చరణ్, హరిచరణ్ మరియు రవికుమార్ విందా నేపధ్యగానం సమకూర్చారు.ు.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లో వందకు పైగా థియేటర్లలో ఏప్రిల్లో విడుదల కు ఏర్పాట్లు చేస్తున్న సందర్భంగా చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది ఈ సందర్భంగా.

*చిత్ర దర్శకుడు శివుడు మాట్లాడుతూ…* సినిమా మీద ప్యాషన్తో మిత్రులతో కలిసి 2019లో మొదలు పెట్టాము.బడ్జెట్ హెవీ అయినా కూడా చాలామంది మిత్రులు సినిమాను పూర్తి చేయడానికి ముందుకు రావడంతో వారందరి సహకారంతో క్రౌడ్ ఫండెడ్ మూవీ గా నిర్మించడం జరిగింది. ఇప్పుడొస్తున్న సినిమా లలో ఇది బిగ్గెస్ట్ ఇండిపెండెంట్ సినిమా. సినిమా ఇండస్ట్రీ గురించి ఏమీ తెలియని మాకు నా కథ మీద నమ్మకం తో సినిమాను నిర్మించడానికి ముందుకు వచ్చారు. చాలామంది సహకారం ఉన్నందుకు ఈ బ్యానర్ ను కలెక్టివ్ డ్రీమ్ గా పేరు పెట్టడం జరిగింది. నాచురల్ లొకేషన్స్ లలో యాభై రెండు రోజుల్లో 104 లొకేషన్స్ లలో సింగిల్ షెడ్యుల్ లో సినిమాను పూర్తి చేయడం జరిగింది.ఈ సినిమా కథకు కరెక్ట్ గా యాప్ట్ అవుతుందని “బ్రాందీ డైరీస్” టైటిల్ పెట్టడం జరిగింది. ఈ సినిమా కథ ఆరుగురు వ్యక్తుల చుట్టూ తిరుగుతుంది. ఆల్కహాల్ తాగితే వచ్చే ఇబ్బందులు ఏమిటి, దాని వలన ఎం నస్టం జరుగుతుందనే విషయాన్ని ఈ చిత్రం ద్వారా తెలియజేస్తున్నాం. సినిమా మొదటి నుంచి ఎండింగ్ వరకు బ్రాందీ(అల్కాహాల్) మీదనే కథ నడుస్తుంది . మలయాళంలో మోహన్ లాల్ “స్పీరిట్” సినిమా “అల్కాహాల్” గురించి తీసినా ఆ సినిమాలో అల్కాహాల్ గురించి కొంత భాగమే తెలియజేయడం జరిగింది . ఇప్పటి వరకూ తెలుగులో ఇటువంటి సినిమా రాలేదు మేము తీసిన ఈ కొత్త కథను డ్రమాటిక్ గా ఇప్పుడొస్తున్న రొటీన్ సినిమాలకు భిన్నంగా చూస్తున్న ప్రేక్షకులకు ఎంటర్ టైన్మెంట్ మిస్ కాకుండా ప్రయోగాత్మకంగా “బ్రాందీ డైరీస్” ను ప్రేక్షకుల ముందుకు తీజుకు వస్తున్నాం. సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం అన్ని హంగులతో ఏప్రిల్ లో విడుదల అవుతున్న మా సినిమాను ప్రేక్షకులు ఆదరించి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నామని అన్నారు.

నిర్మాత మాట్లాడుతూ ..సినిమా మీద ప్రేమతో ఫ్రెండ్స్ అందర్నీ కలుపుకొని కలెక్టర్ డ్రీమ్స్ బ్యానర్ లో ఈ సినిమా చేయడం జరిగింది. అన్ని న్యాచురాలిటి లొకేషన్స్ లతో సహజత్వానికి పట్టం కడుతూ పూర్తిగా కొత్త నటీనటులతో సినిమా రూపుదిద్దుకుంది కథే ముఖ్య పాత్రగా 52 రోజుల్లో 104 లొకేషన్లలో సింగిల్ షెడ్యూల్లో సినిమాను పూర్తి చేశాము.తక్కువ బడ్జెట్ లో ఎక్కువ నాణ్యతతో తీసిన మా సినిమా మూవీ మాక్స్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో వందకు పైగా థియేటర్లలో ఏప్రిల్లో విడుదల కు ఏర్పాట్లు చేస్తున్న మా సినిమా ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుందని అన్నారు.

*కో డైరెక్టర్ సురేందర్ మాట్లాడుతూ…* ఇండస్ట్రీకి వచ్చి పది సంవత్సరాలు అయినా ఇప్పటి వరకు ఆరు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాను కానీ ఈ సినిమాకు ఫుల్ ఫెడ్జ్ గా వర్క్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది.నాకిలాంటి మంచి అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అని అన్నారు

*హీరో శేఖర్ మాట్లాడుతూ…* .ఎంతోమంది సీనియర్ నటులు ఆడిషన్స్ కు వచ్చినా సినిమా గురించి నాకు ఏవిధమైన అవగాహన లేకున్నా ఈ సినిమా కోసం నన్ను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది.దర్శక నిర్మాతల సపోర్టుతో సినిమా చేయడం జరిగింది నాకీ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు అని అన్నారు

*హీరోయిన్ సునీత సద్గురు మాట్లాడుతూ ..* ఇలాంటి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది సినిమాలో నటించినప్పుడు ఆల్కహాల్ మీద కూడా సినిమా తీయొచ్చా అనిపించింది. ఆల్కహాల్ గురించి తెలుపుతూ లవ్ స్టోరీ ను జోడించి ప్రేక్షకులకు నచ్చే విధంగా చేయడం జరిగింది. ఇందులో ఉన్న పాటలు కూడా అద్భుతంగా వచ్చాయి.నాకీ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు

*కీలక పాత్ర పోషించిన రవీంద్రబాబు మాట్లాడుతూ..*
ఆల్కహాల్ తాగితే ఎలాంటి పరిణామాలు జరుగుతాయనే దానిపైన ఈ సినిమా నడుస్తుంది అందరికీ నచ్చే విధంగా సినిమా ఉంటుందని అన్నారు

*నటుడు నవీన్ మాట్లాడుతూ* ..”బ్రాందీ డైరీస్” టైటిల్ క్యాచీగా ఉంది.. బ్రాందీ తాగితే వచ్చే పరిణామాలను తెలియజేస్తూ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ తో సినిమాని తెరకెక్కించారు

*చిత్ర నటీనటులు*
గరుడ శేఖర్, సునీత సద్గురు,నవీన్ వర్మ,,కె.వి.శ్రీనివాస్, రవీందర్ బాబు,దినేష్ మద్న్యే తదితరులు

*సాంకేతిక నిపుణులు*
చిత్రం…బ్రాందీ డైరీస్
బ్యానర్. : కలెక్టివ్ డ్రీమ్స్
నిర్మాత : లేళ్ల శ్రీకాంత్
రచన- దర్శకత్వం : శివుడు
సంగీతం : ప్రకాష్ రెక్స్
సినిమాటోగ్రఫీ : ఈశ్వరన్ తంగవేల్
ఎడిటర్: యోగ శ్రీనివాస్p

PRO; CHINNAMOLLA RAMESH

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES