క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ చేతుల మీదుగా బ్రాంచ్ ఆఫీస్ ట్రైలర్ విడుదల !!!

727

ప్రైడ్ క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న చిత్రం బ్రాంచ్ ఆఫీస్ (అందమైన అబద్ధం). కునాల్ కౌశిక్, వెన్నెల జంటగా నటించిన ఈ చిత్రం ద్వారా వినిత్ అడపా దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. మధుబాబు కర్రీ ఈ సినిమాను ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ విడుదల చేశారు.

ఈ సందర్భంగా దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ…. బ్రాంచ్ ఆఫీస్ మ్యూజిక్ డైరెక్టర్ డిఎస్ఆర్ నాకు బాగా పరిచయం, నా ఫస్ట్ ఫిలిం ఆర్యతో సాంగ్ పాడాడు. ఈ సినిమా పెద్ద సక్సెస్ అయ్యి డైరెక్టర్ వినిత్ అడపా, నిర్మాత మధుబాబు కర్రి గారికి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. చిత్ర యూనిట్ సభ్యులందరికి బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను అన్నారు.

నటీనటులు:
కునాల్ కౌశిక్, వెన్నెల

సాంకేతిక నిపుణులు:

బ్యానర్: ప్రైడ్ క్రియేషన్స్
కెమెరామెన్: పవన్ చెన్న
ఎడిటర్: సాగర్ ఉడగండ్ల
మ్యూజిక్: డిఎస్ఆర్
నిర్మాత: మధుబాబు కర్రి
దర్శకత్వం: వినిత్ అడపా