ఫుల్ అవుట్ & అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ “బ్రహ్మచారి” ట్రైలర్ లాంచ్

213

దుబాయ్ కి వెళ్లి వచ్చిన ఒక అబ్బాయి పెళ్లి చేసుకుందామనుకున్న టైంలో పెళ్ళి చేసుకోవడానికి అమ్మాయి దొరకక తను ఎలాంటి ఇబ్బంది పడ్డాడు అనేదే ఈ “బ్రహ్మచారి” కథ. పొడిచేటి మూవీ మేకర్స్ పతాకంపై వెండితెరకు దర్శకుడుగా పరిచయం కాబోతున్న కొత్త కెరటం నర్సింగ్ దర్శకత్వంలో నూతన నటీనటులతో రమేష్ మాస్టర్ శ్రీ కిరణ్, విగ్నేష్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న పక్కా తెలంగాణ కామెడీ చిత్రం “బ్రహ్మచారి'”.ఈ చిత్రం ఫస్ట్ లుక్ మరియు ట్రైలర్ ను ఆదివారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా విడుదల చేశారు.ఈ కార్యక్రమానికి ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు శ్రీ కె బసి రెడ్డి గారు, తెలంగాణ ఫిలిం ఛాంబర్ చైర్మన్ లయన్ డాక్టర్ ప్రతాని రామకృష్ణ గౌడ్ , ప్రముఖ నిర్మాత, దర్శకుడు, నటుడు లయన్ డాక్టర్ సాయి వెంకట్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశం లో

తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు బసిరెడ్డి మాట్లాడుతూ.. ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి అన్నారు

చిల్లర వేణుగోపాల్ మాట్లాడుతూ..దర్శకుడు నర్సింగ్ నా తమ్ముడు. తను ఫుల్ కామెడీ కథను సెలెక్ట్ చేసుకొని కష్టపడి ఈ సినిమాను చాలా బాగా తీశాడు. ఈ మూవీ ట్రైలర్ బావుంది, మ్యూజిక్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది.తెలంగాణ భాష, తెలంగాణ యాస, తెలంగాణ సంస్కృతిని ఇందులో చూయిస్తున్నాము. దుబాయ్ కి వెళ్లి వచ్చిన ఒక అబ్బాయి పెళ్లి చేసుకుందామనుకున్న టైంలో పెళ్ళి చేసుకోవడానికి అమ్మాయి దొరకక ఎలాంటి ఇబ్బంది పడ్డాడు అనేదే ఈ బ్రహ్మచారి కథ.ఈ సినిమాను నర్సింగ్ గారు చాలా చక్కగా తెరకెక్కించాడు. ఈ సినిమాలో పనిచేసిన నటీనటులకు టెక్నీషియన్స్ అందరికీ మంచి పేరు వస్తుంది. ఫ్యూచర్ లో నర్సింగ్ పెద్ద డైరెక్టర్ అవుతాడు అని అన్నారు.

చిత్ర నిర్మాత నారాయణ చారి మాట్లాడుతూ..మా సినిమా ట్రైలర్ ను లాంచ్ చేయడానికి వచ్చిన పెద్దలందరికి ధన్యవాదాలు. దర్శకుడు నర్సింగ్ నాతో ఇంతకుముందు రెండు మూడు షార్ట్ ఫిల్మ్స్ తీశాడు.తను కష్ట పడే తత్త్వం చూసి సినిమా తీద్దాం అన్నాను. దాంతో ఫుల్ అవుట్ అవుట్ పక్కా తెలంగాణ సినిమా కథ చెప్పడం జరిగింది. ఈ కథ నచ్చడంతో సినిమా తీయడానికి ముందుకు వచ్చాను. తను టాలెంటెడ్ డైరెక్టర్. తనను ఎంకరేజ్ చేస్తే మంచి మంచి సినిమాలు తీస్తాడు.తెలంగాణ సాంస్కృతిక భాష యాస ఇందులో ఎక్సలెంట్ గా వచ్చింది. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాధించాలి అన్నారు.

చిత్ర దర్శకుడు నర్సింగ్ రావు మాట్లాడుతూ..మమ్మల్ని, మా సినిమాను ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలకు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.. పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు వయసు పైబడ్డ వాళ్ళు డబ్బులున్నా, ఎంత ఇబ్బంది పడతారో కామెడీ గా చెప్పాలనుకున్నాను. ఇందులో నేను ఎదుర్కున్న అనుభవాలు కూడా ఉండవచ్చు. ఐతే, కావాలని కామెడీ కోసం ఏదో ఒకటి క్రియేట్ చేయడం కాకుండా, నిజ జీవితం లో ఎదురయ్యే సంఘటనలతో ఈ “బ్రాహ్మ చారి” సినిమా తియ్యడం జరిగింది. అన్నారు.ఇందులో ఫుల్ కామెడీ ఉంటుంది. మా సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కచ్చితంగా ఫుల్ ఎంజాయ్ చేసేలా ఈ సినిమా ఉంటుంది అన్నారు.

తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. దర్శకుడు ఈ కథను ఎంతో డిజైన్ చేసుకొని చాలా చక్కగా తీశాడు…సినిమా కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు కచ్చితంగా అదిరిస్తారని ఈ మధ్య వచ్చిన సినిమాలు తెలిపాయి. మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలి అన్నారు.

సాయి వెంకట్ మాట్లాడుతూ.. బొమ్మ(ఆర్టిస్ట్ ) ప్రాణం పోసేది బ్రహ్మ (డైరెక్టర్ ).చిత్ర దర్శకుడు నర్సింగ్ తెలంగాణ లోని ఈ సినిమాను ఫుల్ అవుట్ అవుట్ ఎంటర్ టైనర్ గా తెరకేక్కించాడు. బయట ఎన్ని కోట్ల బిజినెస్ చేసినా రాని గుర్తింపు మంచి సినిమా తీస్తే వచ్చే ఆ గుర్తింపు వేరు.కాబట్టి ప్యాషన్ తో వచ్చిన నిర్మాత కరెక్ట్ గా తీస్తే ఆ సినిమాలు మంచి హిట్ అయ్యి చాలా సినిమాలు తీసి మంచి పేరు తెచ్చుకుంటారు.అలాంటి వ్యక్తి ఈ నిర్మాత అనుకుంటున్నాను.మంచి కథతో వచ్చే ఈ బ్రహ్మాచారి సినిమా పెద్ద హిట్ అవ్వాలి అన్నారు

చిత్ర దర్శకుడి గురువు దోర వేటి చెన్నయ్య మాట్లాడుతూ.. చిన్న ఆర్టిస్ట్, కొత్త డైరెక్టర్ తనను తాను ప్రూవ్ చేసుకొనే టైమ్ వచ్చింది. కొత్త వారితో కలసి ఎంతో కష్టపడి తీసిన ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ పాండురంగ.. ఇప్పటి వరకు నేను 27 సినిమాలు తీశాను. ఇన్ని సినిమాలు చేసినా, నాకు ఇదే మొదటి ఫుల్ కామెడీ సినిమా. ఇందులోని పాటలు ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతాయి అన్నారు.

చిత్ర హీరో గుంట మల్లేష్ మాట్లాడుతూ .. నేను ఒగ్గుకథ కళాకారుణ్ణి అలాంటి నన్ను నర్సింగ్ అన్న ఆర్టిస్ట్ ను చేశాడు.. ఇందులో నా పాత్ర దుబాయ్ నుండి వచ్చిన క్యారెక్టర్ లో నటించాను. ఇలాంటి మంచి కామెడీ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదములు

రామస్వామి మాట్లాడుతూ.. నాకిది మొదటి సినిమా సినిమా బాగా తియ్యాలనే తపనను దర్శక నిర్మాతలను చూశాను. ఎల్.ఎం ప్రేమ్ మంచి బి. జి. యం ఇచ్చాడు. ఇందులోని పాటలు అందరినీ అలరిస్తాయి. పూర్తి కామెడీ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న “బ్రహ్మాచారి” సినిమా బిగ్ హిట్ అవ్వాలి అన్నారు.

మోహన్ మాట్లాడుతూ.. మాలాంటి కళాకారులకు మంచి రోల్ ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదములు. కరీంనగర్ ఇప్పుడు కళాకారుల అడ్డా గా మారింది. మారు మూల ప్రాంతాల్లో ఉండే కళా కారులని సెలెక్ట్ చేసుకొని ఈ సినిమా తీశారు. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమం లో పాల్గొన్న వారందరూ ఫుల్ అవుట్ అవుట్ కాండీ చిత్రం గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలి అన్నారు

నటీ నటులు
మల్లేశం, స్వప్న (కీస్ పిట్ట ),రోషిని రజాక్, జూనియర్ రజాక్, రామ స్వామి, లక్ష్మి, స్రవంతి,జబర్దస్త్ ఇటుక నవీన్, శ్రీ కుమారి మహేందర్ శీలం , ఉదయ్, సైదయ్య, అభిషేక్, శిరీష రావుల, విజయ లక్ష్మి తదితరులు

సాంకేతిక నిపుణులు
బ్యానర్ : పొడిచేటి మూవీ మేకర్
నిర్మాతలు : రమేష్, మాస్టర్ శ్రీకర్ అండ్ విఘ్నేష్ .
స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ : నర్సింగ్
సినిమాటోగ్రఫీ ; కర్ణ
డైలాగ్స్ అండ్ లిరిక్స్ : దోర వేటి
మ్యూజిక్ : పాండురంగ, బి. జి. యం : ఎల్. ఎం. ప్రేమ్
కొరియోగ్రఫీ : రజాక్
కో ప్రొడ్యూసర్స్ : చిట్టిబాబు, హస్సాన్ జావిద్
ఆర్ట్ డైరెక్టర్ : నరేందర్
ఎడిటర్ : సాయి ఆకుల విజయ్
స్టంట్స్ : ఖురేషీ
ప్రొడక్షన్ మేనేజర్ : భాస్కర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : చిట్టిబాబు
కాస్ట్యూమ్ డిజైనర్ : రమేష్ విజయ్
పోలేపల్లి ,

పి. ఆర్. ఓ : గోపి