*సి.కళ్యాణ్ 60వ పుట్టినరోజు సందర్భంగా భీమవరం టాకీస్ 98వ చిత్రం శివ 143 ఫస్ట్ లుక్ & ట్రైలర్ విడుదల !!!*

573

ఈ సందర్భంగా నిర్మాత రామ సత్యనారాయణ మాట్లాడుతూ… నేను హైదరాబాద్ వచ్చినప్పుడు నుండి మొదటి ఓనమాలు దిద్దించింది మా అన్నయ్య కళ్యాణ్ గారు..నేను ఏమి చేసిన నన్ను ఎప్పుడు సపోర్ట్ చేసేదీ…ఆయనే..ఈ రోజు నేను ఇన్నే సినిమాలు తీసాను అంటే అది ఆయన నేర్పింది అన్నారు..

సి.కళ్యాణ్ గారు మాట్లాడుతూ
చిన్న సినిమాలను మాత్రేమే తీస్తాను అని ఒట్టు పెట్టుకుని తన పద్ధతి లో ఎవరిని ఇబ్బంది పెట్టకుండా బడ్జెట్ దాటకుండా..
ఒక ప్లాప్ తీస్తే ఆ నిర్మాత మళ్ళీ సినిమా తీయా లేని పరిస్థితుల్లో ఉన్న ఈ రోజుల్లో హిట్ ప్లాప్ కి అతీతంగా సేఫ్ గా సినిమాలు తీస్తూ
అందరి కి అందుబాటులో ఉండే మా తమ్ముడు రామ సత్యనారాయణ..కి ఈ శివ 143 విజయం పొందాలని కోరుకుంటున్నాను..దర్శకుడు సాగర్ నటుడు గా .డైరెక్టర్ గా కొరియోగ్రాఫర్ గా తన బాధ్యతలను చక్కగా నెరవేర్చాడు. ఈ సినిమా వల్ల కెమరామెన్ సుధాకర్.సంగీతం మనోజ్.ఎడిటర్ శివ వై ప్రసాద్ లకు మంచి అవకాశాలు వస్తాయి.

డీఎస్ రావు మాట్లాడుతూ
నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన రామసత్యనారాయణ గారికి థాంక్స్. మంచి కాన్సెప్ట్ తో ఈ సినిమా రాబోతోంది. హీరోగా దర్శకుడిగా శైలేష్ సాగర్ శివ 143 సినిమాతో మరింత మంచి పేరు తెచ్చుకుంటారు అన్నారు.

హీరో , డైరెక్టర్ శైలేష్ సాగర్ మాట్లాడుతూ
శివ143 సినిమా ట్రైలర్ విడుదల చేసిన సి.కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. సినిమా బాగా వచ్చింది. రామసత్యనారాయణ గారు నాకు బాగా సపోర్ట్ చేశారు. తప్పకుండా ఈ మూవీ అందరికి నచ్చుతుంది. భీమవరం టాకీస్ బ్యానర్ లో నేను చేస్తున్న రెండో సినిమా ఇది అవ్వడం సంతోషంగా ఉంది. మాకు సహకరించిన అందరికి స్పెషల్ థాంక్స్ తెలిపారు.