లక్కీమీడియా ప్రొడక్షన్ హౌస్ నుంచి 13వ చిత్రంగా నూతన సినిమా ప్రారంభమైంది. బెక్కెం వేణుగోపాల్, బెక్కెం సబిత నిర్మిస్తున్నారు. కార్తీక్ పంపాల దర్శకునిగా పరిచయం అవుతున్నారు. బాలనటుడిగా `ఆశలపల్లెకి`లో నటించిన సన్నీ పస్తా హీరోగా పరిచయం కాబోతున్నారు. ఆదివారం శ్రీరామనవమి శుభముహూర్తం సందర్భంగా రామానాయుడు స్టూడియోలో ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ యాక్షన్ దర్శకుడు వి.వి.వినాయక్ క్లాప్ కొట్టగా, ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ కెమేరా స్విచ్చాన్ చేశారు. దర్శకుడు బాబీ గౌరవ దర్శకత్వం వహించారు.
అనంతరం చిత్ర విశేషాలను చిత్ర నిర్మాత బెక్కెం వేణుగోపాల్ తెలియజేస్తూ, లక్కీ మీడియా బేనర్ స్థాపించి 16 సంవత్సరాలైంది. ఈ సందర్భంగా నేడు మా బేనర్లో 13వ సినిమా ప్రారంభించాం. ఇటీవలే 12వ సినిమా `అల్లూరి` చిత్రం లోగోను కూడా ఆవిష్కరించారు. `బూట్ కట్ బాలరాజు` సినిమా కూడా రన్నింగ్‌లో వుంది. 13వ సినిమాగా మంచి లవ్ స్టోరీ తీయాలని అనుకున్నాం. `మేం వయస్సుకువచ్చాం` తరహాలో సినిమా చేయాలని భావించాం. అలాంటి కథను కార్తీక్ వినిపించాడు. తను అంతకుముందు షార్ట్ ఫిలిం చేశాడు. అది చాలా బాగా నచ్చింది. అందుకే మా బేనర్లో దర్శకునిగా పరిచయం చేస్తున్నాను. అర్బన్ బ్యాక్‌డ్రాప్‌లో తను కథను చక్కగా రాసి బౌండ్ స్క్రిప్ట్‌తో వచ్చాడు. కథ ప్రకారం సన్నీ పిస్తాను లీడ్రోల్లో ఎంపిక చేశాం. తను నటనలో న్యూయార్ట్ ఫిలిం ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందాడు. ఈరోజు పండుగ సందర్భంగా లాంఛనంగా షూటింగ్ ప్రారంభించాం. త్వరలో చిత్రం గురించి మరిన్ని విశేషాలను తెలియజేస్తామని అన్నారు.
హీరో సన్నీ పిస్తా మాట్లాడుతూ, ఇందులో నేను లీడ్‌రోల్ ప్లే చేస్తున్నా. లక్కీమీడియా ద్వారా పరిచయం కావడం లక్కీగా భావిస్తున్నా. అందరి ఆశీర్వాదాలు కావాలని కోరారు.
చిత్ర దర్శకుడు కార్తీక్ పంపాల మాట్లాడుతూ, నా కంటెంట్‌ను నమ్మి నిర్మాత అవకాశం ఇచ్చారు. ఎంతో మంది కొత్తవారిని ఎంకరేజ్ చేసిన లక్కీమీడియాలో పరిచయం కావడం ఆనందంగా వుంది. థియేటర్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వస్తున్న సన్నీ ఈ కథకు కరెక్ట్‌గా సరిపోయాడు.అని తెలిపారు.
ఇంకా ఈ కార్యక్రమంలో కెమెరామెన్ మితేష్, నిర్మాత శ్రేయోభిలాషులు కుమార్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
నటీనటులుః సన్నీ పస్తా
సాంకేతికత సిబ్బంది– కెమెరాః మితేష్ పి., నిర్మాతలుః బెక్కెం వేణుగోపాల్, బెక్కెం సబిత, కథ, దర్శకత్వంః కార్తీక్ పంపాల, సహ నిర్మాతః నాగార్జున వడ్డే (అర్జున్), ఆర్ట్ః విఠల్ కోసనమ్, కో-డైరెక్టర్- అనిల్ తింపల, పి.ఆర్.ఓ.- వంశీ శేఖర్.
Pro: Vamsi – Shekar
9581799555 – 9553955385