HomeTelugu'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' చిత్రం ఖచ్చితంగా విజయం సాధిస్తుంది

‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ చిత్రం ఖచ్చితంగా విజయం సాధిస్తుంది

* రేపే ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ చిత్రం విడుదల
* కథానాయకుడు నాగశౌర్య, దర్శకుడు శ్రీనివాస్ కలయికలో వస్తున్న హ్యాట్రిక్ ఫిల్మ్
* సినిమా విజయం పట్ల నమ్మకాన్ని వ్యక్తం చేసిన చిత్ర బృందం

తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న హిట్ కాంబినేషన్లలో కథానాయకుడు నాగశౌర్య, దర్శకుడు శ్రీనివాస్ అవసరాల కాంబో ఒకటి. వీరి కలయికలో వచ్చిన ‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానంద’ సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇప్పుడు వీరి కలయికలో వస్తున్న హ్యాట్రిక్ ఫిల్మ్ ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించింది. టీజీ విశ్వ ప్రసాద్, పద్మజ దాసరి నిర్మాతలు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో మాళవిక నాయర్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రేపు( మార్చి 17న) ఈ చిత్రం థియేటర్లలో భారీస్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రీరిలీజ్ ప్రెస్ మీట్ ని నిర్వహించి.. చిత్ర విజయం పట్ల వారికున్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

చిత్ర సహా నిర్మాత వివేక్ కూచిభొట్ల మాట్లాడుతూ.. “నాగశౌర్య, మాళవిక ల సహజమైన నటన కోసం ఈ సినిమా చూడొచ్చు. ఈ సినిమాలో వాళ్ళు కనిపించరు.. వాళ్ళు పోషించిన సంజయ్, అనుపమ పాత్రలు మాత్రమే కనిపిస్తాయి. అలాగే శ్రీనివాస్ గారు ఆయన గత చిత్రాల మాదిరిగానే ఈ చిత్రాన్ని కూడా ఎంతో హృద్యంగా రూపొందించారు. కళ్యాణి మాలిక్ గారి సంగీతానికి ఇప్పటికే విశేష స్పందన లభించింది. ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. విజయోత్సవ సభలో మళ్ళీ కలుద్దాం” అన్నారు.

నిర్మాత దాసరి ప్రసాద్ మాట్లాడుతూ.. “ఇంత మంచి చిత్రంలో మమ్మల్ని భాగస్వాములు చేసినందుకు ముందుగా విశ్వ గారికి, వివేక్ గారికి కృతఙ్ఞతలు. శ్రీనివాస్ అవసరాల గారి సినిమా అంటే మినిమం గ్యారెంటీ అని అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాలో శౌర్య తన పాత్ర ద్వారా ప్రదర్శించిన ఏడు ఛాయలు అందరికీ ఎంతగానో నచ్చుతాయి. అలాగే మాళవిక ఎంతో సహజంగా నటించింది. ఈ సినిమా ఖచ్చితంగా మీ అందరినీ అలరిస్తుంది” అన్నారు.

చిత్ర దర్శకుడు శ్రీనివాస్ అవసరాల మాట్లాడుతూ.. “వ్యక్తిగతంగా నాకు ఎంతో సంతృప్తిని ఇచ్చింది ఈ సినిమా. ఇప్పటికే విడుదలైన పాటలకు, ట్రైలర్ కు చాలా మంచి పేరు వచ్చింది. ఈ సినిమా విడుదల కోసం కుటుంబంతో సహా ఇక్కడి వచ్చిన ప్రసాద్ గారికి ధన్యవాదాలు. అలాగే అసలు ఈ సినిమా చేద్దామని ముందు నా చెయ్యి పట్టుకొని నడిపించిన వివేక్ గారికి థాంక్స్.” అన్నారు.

కథానాయిక మాళవిక నాయర్ మాట్లాడుతూ.. “మా హృదయానికి ఎంతో దగ్గరైన ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ మీరంతా ఎప్పుడెప్పుడు చూస్తారా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.” అన్నారు.

నాగశౌర్య మాట్లాడుతూ.. “మాములుగా మా సినిమా అలా వచ్చింది, ఇలా వచ్చిందని చెబుతుంటాం. కానీ ఈ సినిమా గురించి మాట్లాడేటప్పుడు మేం పడిన కష్టం గురించి మాట్లాడుతున్నాం. కేవలం ఫైట్లు చేస్తేనే కష్టపడినట్లు కాదు. మేం దీని కోసం ఎంత కష్టపడ్డాం అనేది సినిమా చూశాక ప్రేక్షకులకు అర్థమవుతుంది.

ఈ సందర్భంగా విలేకర్లు అడిగిన పలు ప్రశ్నలకు చిత్ర యూనిట్ సమాధానాలు చెప్పారు.
ప్రశ్న: దర్శకుడిగా ‘ఊహలు గుసగుసలాడే’ నుంచి ఇప్పటికి శ్రీనివాస్ అవసరాల గారిలో ఎలాంటి మార్పులు వచ్చాయి?
నాగశౌర్య: ఆయన అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడే అలాగే ఉన్నాయి. ముందే స్క్రిప్ట్ ఇచ్చి చదవమంటారు. ఆయనకు ఏం కావాలి, ఏం చేయాలి అనేది దానిపై చాలా స్పష్టత ఉంటుంది. నేను ఆయన ద్వారానే పరిచయమయ్యాను. ఆయన రాసే ప్రతి డైలాగ్ ఎలా పలకాలో నాకు తెలుసు. అప్పటికి ఇప్పటికి నేను ఆయనలో ఎలాంటి మార్పు చూడలేదు.

ప్రశ్న: శ్రీనివాస్ అవసరాల గారితో ఇది మూడో సినిమా.. విజయం పట్ల నమ్మకంగా ఉన్నారా?
నాగశౌర్య: చాలా నమ్మకంగా ఉన్నాను. ఈ సినిమా పట్ల చాలా సంతోషంగా ఉన్నాను. నా కెరీర్ లో ‘ఊహలు గుసగుసలాడే’, ‘జ్యో అచ్యుతానంద’ సినిమాలు ఉన్నాయని ఎలా చెప్పుకుంటున్నానో.. అలా చెప్పుకోగలిగే సినిమా ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి.

ప్రశ్న: శ్రీనివాస్ గారు ఈ సినిమాలో మీరు కూడా నటించారు కదా.. మీ పాత్ర ఎలా ఉండబోతోంది?
శ్రీనివాస్ అవసరాల: ఈ చిత్రంలోని పాత్రలన్నీ మనం నిజ జీవితంలో చూసినట్లుగా సహజంగా ఉంటాయి. ఇది ఊహలు గుసగుసలాడే లాంటి సరదాగా సాగిపోయే సినిమా కాదు.. ఎమోషనల్ గా సాగే సినిమా.

ప్రశ్న: సింక్ సౌండ్ ప్రయత్నించడానికి కారణమేంటి?
శ్రీనివాస్ అవసరాల: ఆ విషయంలో ముందుగా వివేక్ గారికి థాంక్స్ చెప్పాలి. నేను మొదటి నుంచి సింక్ సౌండ్ కావాలని పట్టుబట్టాను. ఎందుకంటే ఇది నటన మీద ఆధారపడిన సినిమా. డబ్బింగ్ చెప్తే కృత్రిమంగా ఉంటుంది అనిపించింది. సినిమా అంతా సహజంగా ఉండాలన్న ఉద్దేశంతో సింక్ సౌండ్ చేయాలని నిర్ణయించుకున్నాం.

ప్రశ్న: దర్శకుడిగా మీ మూడో సినిమాని కూడా నాగశౌర్యతో చేయడానికి కారణం?
శ్రీనివాస్ అవసరాల: నేను ముందుగా కథ రాసుకొని ఆ తరువాత పాత్రలకు సరిపోయే నటీనటులను ఎంచుకుంటాను. ఈ సినిమా చూసిన తరువాత సంజయ్ పాత్రలో శౌర్యను తప్ప ఎవరినీ ఊహించుకోలేము. అంతలా ఆ పాత్రలో ఇమిడిపోయాడు. ఈ పాత్రకు శౌర్య సరిపోతాడని నేను ముందే నమ్మి ఎంచుకున్నాను.

ప్రశ్న: ఈ సినిమాలో ఏడు చాప్టర్ లు ఉన్నాయి కదా.. మీకు బాగా నచ్చిన చాప్టర్ ఏది?
శ్రీనివాస్ అవసరాల: ప్రతి చాప్టర్ లోనూ రకరకాల భావోద్వేగాలు ఉంటాయి. ప్రతి చాప్టర్ మరో చాప్టర్ తో ముడిపడి ఉంటుంది. నాకు ఇందులో నాలుగో చాప్టర్ చాలా ఇష్టం. అందులో ఇంద్రగంటి మోహనకృష్ణ గారు పాడిన పాట ఉంటుంది. ఇంటర్వెల్ కి ముందు వచ్చే ఈ చాప్టర్ లో ఎమోషన్ ఇంతవరకు నేను తెలుగు సినిమాల్లో చూడలేదనేది నా అభిప్రాయం.

నటీనటులు – నాగ శౌర్య, మాళవిక నాయర్, శ్రీనివాస్ అవసరాల, మేఘ చౌదరి, అశోక్ కుమార్, అభిషేక్ మహర్షి, శ్రీ విద్య, వారణాసి సౌమ్య చలంచర్ల, హరిణి రావు, అర్జున్ ప్రసాద్

నిర్మాతలు – టీజీ విశ్వ ప్రసాద్, పద్మజ దాసరి
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ,దర్శకుడు – – శ్రీనివాస్ అవసరాల
సహ నిర్మాత – వివేక్ కూచిభొట్ల
డీవోపీ – సునీల్ కుమార్ నామ
సంగీతం – కళ్యాణి మాలిక్, వివేక్ సాగర్(కాఫీఫై సాంగ్)
లిరిక్స్ – భాస్కరభట్ల, లక్ష్మి భూపాల, కిట్టు విస్సాప్రగడ
ఎడిటర్ – కిరణ్ గంటి
ఆర్ట్ డైరెక్టర్ – అజ్మత్ అన్సారీ(UK), జాన్ మర్ఫీ(UK), రామకృష్ణ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – సుజిత్ కుమార్ కొల్లి
అసోసియేట్ ప్రొడ్యూసర్స్ – సునీల్ షా, రాజా సుబ్రమణియన్
కొరియోగ్రాఫర్స్ – రఘు, యశ్, రియాజ్, చౌ, గులే
కో-డైరెక్టర్స్ – శ్రీనివాస్ డి, హెచ్.మాన్సింగ్ (హెచ్.మహేష్ రాజ్)
మేకప్ – అశోక్, అయేషా రానా
కాస్ట్యూమ్ డిజైనర్ – హర్ష చల్లపల్లి
పీఆర్ఓ – లక్ష్మీవేణుగోపాల్

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES