షూటింగ్ పూర్తిచేసుకున్న “బట్టల రామస్వామి బయోపిక్కు”

523

సెవెన్ హిల్ల్స్ పతాకం పై నేహా శ్రీ అండ్ సుదీక్ష సమర్పణలో సతీష్ కుమార్ నిర్మాణం లో రామ్ నారాయన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “బట్టల రామస్వామి బయోపిక్కు”.ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న సందర్భంగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు చిత్ర యూనిట్. ఈ నేపధ్యంలో దర్శకుడు రామ్ నారాయణ్ మాట్లాడుతూ… మామూలుగా పెద్ద వాళ్ళ బయోపిక్ లనే సినిమాలుగా చేస్తారు.కానీ మేము ఒక కామన్ మ్యాన్ కథనే బయోపిక్కు గా రూపొందించాము. నిర్మాత సతీష్ గారు ఎక్కడ వెనకంజ వేయకుండా అన్నీ పనుల్లో చాలా సపోర్ట్ చేసి వర్క్ చేశారు. ఇక మిగతా టీమ్ అంతా నాకు గోల్డ్ గిఫ్ట్ లా దొరికారు. బట్టల రామస్వామి బయోపిక్కు అనే ఈ మా సినిమా టైటిల్ లో యాక్ట్ చేసిన అతన్ని మేము ఇప్పుడే రివీల్ చేయడం లేదు కానీ అతను మాత్రం ఇండస్ట్రీ కు మరో రాజేంద్రప్రసాద్ అవుతారు అని మాత్రం చెప్పగలను. ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో తెరకెక్కించిన చిత్రం కనుక అందరినీ ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నా అన్నారు.
నిర్మాత సతీష్ కుమార్ మాట్లాడుతూ.నవంబర్ లో మొదలు పెట్టి డిసెంబర్ 18న గుమ్మడికాయ కొట్టాము. సింగిల్ షెడ్యూల్ లో సినిమాను పూర్తి చేశాము. కథను నమ్మి కథే హీరో అనుకొని చేసిన చిత్రం ఇది.స్యుశివేశనల్ కామెడీతో సినిమా చేయడం జరిగింది. ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ అయ్యి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఉంది. త్వరలో అది కూడా పూర్తిచేసి ఏప్రిల్ నెలాఖరులో కానీ మే నెలలో కానీ సినిమాను విడుదల చేయలనుకుంటున్నాము. ఈ 2020 మా అందరికీ మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాము అన్నారు.
నటుడు భద్రం మాట్లాడుతూ.ఈ సినిమా ఒక కామన్ మ్యాన్ బయోపిక్కు. ఫుల్ ఎంటర్టైన్మెంట్ గా సాగే కథాశం. పెళ్లైన కొత్తలో జంటకు ప్రతి రోజూ పండగలానే ఉంటుంది.. ఆ తరువాత కొన్నాళ్ళకు ముందుంది ముసళ్ళ పండగ లా అనిపిస్తుంది. అదే ఈ సినిమాలో చూపించడం జరిగింది. నా పాత్ర ఎప్పటిలానే ఆకట్టుకుంటుంది. ఈ 2020 లో సప్రైజ్ హిట్ అవుతుందని నమ్మకంగా చెప్పగలను అని అన్నారు. ఈ కార్యక్రమంలో శాంతి రావు,సాత్త్వి,కెమెరామెన్ కర్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి డి.ఓ.పి కర్ణ పైరసాని,ఎడిటర్:సాగర్ దాడి,పి ఆర్ ఓ :బి.వీరబాబు,మాటలు,పాటలు:వాసుదేవమూర్తి, ప్రొడ్యూసర్:సతీష్ కుమార్.ఐ ,కథ స్క్రీన్ ప్లే,సంగీతం,డైరెక్షన్ :రామ్ నారాయణ్.