HomeTeluguఆకాష్ పూరి చేతుల మీదుగా "బ్యాచ్" ట్రైలర్ విడుదల

ఆకాష్ పూరి చేతుల మీదుగా “బ్యాచ్” ట్రైలర్ విడుదల

ఆకాంక్ష మూవీ మేకర్స్ పతాకం పై బేబీ ఆరాధ్య సమర్పణలో సాత్విక్ వర్మ, నేహా పఠాన్ జంటగా శివ దర్శకత్వంలో రఘు కుంచే సంగీత సారధ్యంలో రమేష్ ఘనమజ్జి నిర్మిస్తున్న మ్యూజికల్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం బ్యాచ్. ఈ చిత్రం ట్రైలర్ ను సక్సెస్ ఫుల్ చిత్రాల దర్శకుడు పూరి జగన్నాధ్ గారి తనయుడు పూరి ఆకాష్ విడుదల చేసారు.

ఈ సందర్భంగా పూరి ఆకాష్ మాట్లాడుతూ “ట్రైలర్ చూసా, చాలా ఆసక్తికరంగా ఉంది. రఘు కుంచే సంగీతం చాలా హైలైట్ గా ఉంది. పాటలు చాలా బాగున్నాయి. పాటలు మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈచిత్ర నిర్మాత సినిమాను థియేటర్ లోనే విడుదల చేస్తాను అంటున్నారు. ప్రస్తుత కరోనా సమయంలో కూడా థియేటర్ లోనే విడుదల చేస్తాననటం గొప్ప విషయం, మీలాంటి నిర్మాతలు ఇండస్ట్రీ కి కావాలి. సాత్విక్ చైల్డ్ యాక్టర్ గా చాలా సినిమాలు చూసాం. ఇప్పుడు హీరో గా ఎంట్రీ ఇస్తున్నాడు. చాలా పాజిటివ్ గా ఉంటాడు. ఎప్పుడూ నవ్వుతు ఉంటాడు. అల్ ది బెస్ట్ సాత్విక్. ఈ సినిమా మంచి విజయం సాదించాలి” అన్నారు.

ఐటమ్ సాంగ్ గర్ల్ చాందిని మాట్లాడుతూ “నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి మరియు నిర్మాతకి ధన్యవాదాలు. నేను ఐటెం సాంగ్ చేశాను, పాట అద్భుతంగా వచ్చింది. సినిమా హిట్ అవ్వాలి” అని కోరుకున్నారు.

సహా నిర్మాత సత్తి బాబు కసిరెడ్డి మాట్లాడుతూ “బ్యాచ్ చిత్రానికి మొదటి విజయం రఘు కుంచే సంగీతం. పాటలు అద్భుతంగా వచ్చాయి. దర్శకుడు శివ, కెమెరా మాన్ వెంకట్ మరియు ఇతర టెక్నీషియన్స్ అందరూ బాగా కష్టపడ్డారు. సినిమా ఖచ్చితంగా విజయవంతం అవుతుందని” చెప్పారు

సింగర్ అసిరయ్య బాబాయ్ మాట్లాడుతూ “కూటి కోసం పాటలు పడుకునే నాకు రఘు కుంచే గారు మంచి అవకాశం ఇచ్చారు. మా శ్రీకాకుళం జిల్లాలో ఇప్పుడు నన్ను అందరు గౌరవిస్తారు, దానికి కారణం రఘు కుంచే గారు. మా ఊరిలో అందరు ఈ చిత్రం చూస్తారు. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది” అన్నారు.

నటి సంధ్య జనక్ మాట్లాడుతూ “బ్యాచ్ అనేది అందరికి నచ్చే టైటిల్. స్కూల్, కాలేజీ రోజులలో ప్రతి ఒక్కరికీ బ్యాచ్ ఉంటుంది. సినిమా కూడా అందరికి కనెక్ట్ అవుతుంది. రఘు కుంచే గారి మ్యూజిక్ హై లైట్ అవుతుంది. పూరి ఆకాష్ గారు ట్రైలర్ విడుదల చేసారు. వారికీ ధన్యవాదాలు. చిత్రం హిట్ అవ్వాలి” అని ఆకాంక్షించారు.

నిర్మాత రమేష్ ఘనమజ్జి మాట్లాడుతూ “నాకు నిర్మాతగా అనుభవం లేదు కానీ కథ నచ్చింది. మా దర్శకుడు శివని నమ్మి ముందుకు సాగిపోయాము. మా చిత్రానికి సంగీతమే బలం. అన్ని పాటలు అద్భుతంగా వచ్చాయి. రఘు కుంచే గారికి నా ధన్యవాదాలు. మా హీరో సాత్విక్ బాగా సపోర్ట్ చేసాడు. షూటింగ్ రోజులు పెరిగినా బాగా సపోర్ట్ చేసాడు. నటి నటులు అందరు సహకరించారు. మా చిత్రంలో ముగ్గురు కొత్త సింగర్స్ ని పరిచేయం చేసాం. అసిరయ్య గారి పాట విన్నారు. లక్ష్మి మరియు సాయి సంవిద్ లను పరిచేయం చేసాము. మిగతా పాటలు కూడా త్వరలోనే విడుదల చేస్తాము. ఎడిటర్ జె పి, కెమెరా మాన్ వెంకట్ గారు బాగా సహాయం చేసారు. మా రమేష్ గారు అద్భుతమైన పబ్లిసిటీ పోస్టర్ డిజైన్ చేసారు. మా చిత్రం యొక్క ట్రైలర్ ని విడుదల చేసిన పూరి ఆకాష్ గారికి ధన్యవాదాలు” అని తెలిపారు.

హీరోయిన్ నేహా పఠాన్ మాట్లాడుతూ “ఇది నా మొదటి సినిమా. నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్ మరియు ప్రొడ్యూసర్ కి ధన్యవాదాలు” అని తెలిపారు.

దర్శకుడు శివ మాట్లాడుతూ “కాకినాడ లో నలుగురి స్నేహితులతో కలిసి ఈ చిత్రాన్ని స్టార్ట్ చేశాను, నిర్మాత రమేష్ గారు ఒక పునాదిగా నిలిచారు. అందరూ కష్టపడి పని చేసాం. సినిమా బాగ వచ్చింది. తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుంది” అన్నారు.

హీరో సాత్విక్ వర్మ మాట్లాడుతూ “ఈ కథ వినగానే బాగా నచ్చింది. వెంటనే స్టార్ట్ చేసాము. రఘు గారి సంగీతం మా సినిమా కి ప్రాణం పోసింది. నిర్మాత గారు బాగా సపోర్ట్ చేసారు. ప్రతి టెక్నిషన్ బాగా సపోర్ట్ చేసారు. పూరి ఆకాష్ గారు నా సినిమా ట్రైలర్ విడుదల చేయటం చాలా ఆనందంగా ఉంది”అన్నారు.

సంగీత దర్శకుడు రఘు కుంచె మాట్లాడుతూ “ఇండస్ట్రీలో నాకు లైఫ్ ఇచ్చింది పూరి జగన్నాధ్ గారు. ఇప్పుడు మా బ్యాచ్ సినిమా ట్రైలర్ విడుదల చేయటానికి పూరి గారి అబ్బాయి ఆకాష్ రావటం చాలా సంతోషంగా ఉంది. పెద్ద బ్యానర్ సినిమాలో ప్రయోగం చేద్దాం అంటే రిస్క్ ఎందుకు అనుకుంటారు, కానీ చిన్న సినిమాలో ప్రయోగం చేయటం సులభం. అసిరయ్య బాబాయ్ ట్రైన్ లో పాడుతున్న వీడియో చూసాను. గొప్ప గాయకుడు, ఈ సినిమాతో తనను పరిచయం చేస్తున్నా. అలాగే నిజామాబాద్ దగ్గర ఒక పల్లెటూరులో పెరిగిన అమ్మాయి లక్ష్మి మా చిత్రంలో ఒక మంచి పాట పాడింది. సాయి సంవిద్ అమ్మాయి గొంతులా పాడతాడు. తనతో ఒక మంచి మెలోడీ సాంగ్ పాడించాను. ఈ పాటలు మంచి హిట్ అవుతాయి. బాల నటుడిగా సాత్విక్ 80 సినిమాలు చేసాడు. ఇప్పుడు హీరోగా వస్తున్నాడు. ఈ చిత్రం మంచి హిట్ కావాలని” కోరుకున్నారు.

చిత్రం : బ్యాచ్
సమర్పణ : బేబీ ఆరాధ్య
బ్యానర్ : ఆకాంక్ష మూవీ మేకర్స్
నటి నటులు : సాత్విక్ వర్మ, నేహా పఠాన్, బాహుబలి ప్రభాకర్, సంధ్యా జనక్, మిర్చి మాధవి, వినోద్ కుమార్, చిన్న, తదితరులు
కెమెరా : వెంకట్ మన్నం
సంగీతం : రఘు కుంచే
కొరియోగ్రఫీ : రాజ్ పైడి
ఎడిటింగ్ : జె పి
పి అర్ ఓ : పాల్ పవన్
డైరెక్టర్ : శివ
కో ప్రొడ్యూసర్ : సత్తి బాబు కసిరెడ్డి, అప్పారావు పంచాది
నిర్మాత : రమేష్ ఘనమజ్జి  

PRO;PAUL PAVAN

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES