HomeTelugu*బంజారా సినీ పరిశ్రమ 'బంజారావుడ్' ప్రారంభం!*

*బంజారా సినీ పరిశ్రమ ‘బంజారావుడ్’ ప్రారంభం!*

భారతదేశం సంప్రదాయాలకు, వేశధారణకు పుట్టినిల్లు. అలాంటి భారతదేశంలో 15 కోట్ల 50 లక్షల మంది బంజారాలు ఉన్నారు. ఈ బంజారా ప్రజలు ప్రతి రంగంలో ముందున్నారు. అలాంటి వారు సినిమా రంగంలో కూడా ముందు ఉండాలనే ఉద్దేశంతో గోర్ జీవన్ సినిమాలు తనకంటూ ఒక స్థానం సంపాదించాలనుకున్న కెపిఎన్. చౌహన్ తన బంజారా ప్రజలకు ఒక సినిమా పరిశ్రమ కావాలంటూ కష్టపడి బంజారా ఫిలిం ఇండస్ట్రీని స్థాపించారు.

ఇది ప్రతి బంజారా బిడ్డలు చెప్పుకోదగ్గ విషయం.
8 నుండి 10 కోట్ల జనాభా ఉన్న ఏపి – టిఎస్ టాలీవుడ్ ఇండస్ట్రీ ఉంది. అలాగే నాలుగు కోట్ల చిల్లర ఉన్న కెనడా ప్రజలకు కెనడా ఇండస్ట్రీ ఉంది. రెండు కోట్ల జనాభా ఉన్న భోజ్ పూరి ప్రజలకు సినిమా ఇండస్ట్రీ ఉంది. అలాంటిది దేశం మీద 15 కోట్ల 50 లక్షల జనాభా ఉన్న బంజారా ప్రజలకు ఒక సినిమా ఇండస్ట్రీ కావాలంటూ ఈ బంజారా సినిమా ఇండస్ట్రీని స్థాపించారు. ఈ కార్యక్రమంలో పలువురు బంజారా కళాకారులు పాల్గొన్నారు.

ఇది ఒక్కరికోసమే కాదు. ప్రతిఒక్క బంజారా బిడ్డలకోసం కాబట్టి అందరూ బంజారా కళాకారులు ముందుకు వచ్చి ఈ బంజారా ఫిలిం ఇండస్ట్రీని మంచి స్థాయికి తీసుకుని వెళ్లాలని కోరుతున్నాము. అలాగే మన బంజారా సినిమాలకి రిలీజ్ కోసం థియేటర్స్ దొరకని పక్షాన అమెజాన్, నెట్ ఫ్లిక్ లాగా బంజారా బాక్స్ ఆఫీస్ యాప్ ను రిలీజ్ చేస్తున్నాము. దీనివల్ల ప్రతిఒక్క బంజారా ప్రజలు తమ ఇండస్ట్రీ వద్ద తమ ఫోన్ లో సినిమాలను వీక్షించే విధంగా ఓటిటి ప్లాట్ ఫామ్ తయారు చేపిస్తున్నాము కావున ప్రతిఒక్క బంజారా ప్రజలు దీనిని వినియోగించుకోవాలి. అలాగే మన బంజారా సినిమా పరిశ్రమని అత్యున్నత స్థానానికి తీసుకుని వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము. ఈ కార్యక్రమం భారీ ఎత్తున చేద్దాం అనుకున్నాను కానీ కరోన కారణంగా ఈ కార్యక్రమం సింపుల్ గా చేశాం. అందరు బంజారా కళాకారులను పిలువలేక పోయాము. నెక్స్ట్ జనరల్ బాడీ మీటింగ్ గ్రాండ్ గా చెయ్యబోతున్నాము అప్పుడు అందరిని పిలుస్తామని తెలిపారు.

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES