HomeTeluguసెన్సార్ పూర్తి చేసుకొన్న "బంగారు తెలంగాణ" అతి త్వరలో సినిమా విడుదల!!

సెన్సార్ పూర్తి చేసుకొన్న “బంగారు తెలంగాణ” అతి త్వరలో సినిమా విడుదల!!

బిపిన్, రమ్య జంటగా షిరిడి సాయి క్రియేషన్స్ పతాకంపై శ్రీమతి రమ్య సమర్పణలో సాయి చరణ్, సాయి త్రిశాంక్ నిర్మాణ సారథ్యంలో డా. ఏవి స్వామి, డా. ఏవి అనురాధ కో ప్రొడ్యూసర్స్ గా బిపిన్ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ” బంగారు తెలంగాణ”. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి “యు” సర్టిఫికేట్ లభించింది. అతి త్వరలోనే ఈ చిత్రాన్ని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అత్యధిక థియేటర్స్ లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.. ఈ సందర్బంగా దర్శక, నిర్మాత బిపిన్ “బంగారు తెలంగాణ” విశేషాలను తెలిపారు.

నిర్మాత-దర్శకుడు బిపిన్ మాట్లాడుతూ ” ముందుగా కేసీఆర్ గారు టి ఆర్ యస్ నుండి బి ఆర్ యస్ కి వెళుతున్న శుభ సందర్భంలో నా హార్దిక శుభాభినందనలు.. అలాగే పిబ్రవరి 17న పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రజల మనిషి కేసీఆర్ గారికి మా చిత్ర యూనిట్ నుంచి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం..

ఇక మా సినిమా విషయానికోస్తే ఈ బంగారు తెలంగాణ రావడం కోసం ఎంతోమంది విద్యార్థులు ఎన్నో ఉద్యమాలు చేసి తమ ప్రాణాలను అర్పించారు.. అలాగే కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా పోరాడారు.. వారందరి సమిష్టి కృషి ఫలితంగానే “బంగారు తెలంగాణ” సాధ్యమయింది. కేసీఆర్ కృషికి ప్రతిరూపమే ఈ బంగారు తెలంగాణ. తెలంగాణ రాష్ట్రం రాకముందు తెలంగాణ వచ్చిన తరువాత రాష్ట్రంలో ఎలాంటి మార్పులు సంభవించాయి అనేది ఈ చిత్రంలో క్లియర్ కట్ గా చూపిస్తున్నాం.. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం వుంటుంది. మా నిర్మాతలందరూ ఈ సినిమా అద్భుతంగా రావడానికి నాకు ఎంతగానో సహకరించారు. వారికి నా థాంక్స్. ఖచ్చితంగా ప్రతిఒక్కరూ ఆలోచింపజేసే విధంగా ఈ చిత్రం వుంటుంది.. అన్నారు.

బాబు మోహన్, అశోక్ కుమార్, రఘునాథ్ రెడ్డి, డా. ఏవీ స్వామి, సాయి త్రిశాంక్, కృష్ణవేణి, కవిత, దివి, డింకీ కపూర్, క్రాంతి, ప్రీతీ నిగమ్, రాగిణి, ముంతాజ్, సునీత మనోహర్, కల్పన, తదితరులు నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: మధు ఏ.నాయుడు, జియస్ఆర్, ఆళ్ల రాంబాబు, ఎడిటింగ్; నాగిరెడ్డి, పి.ఆర్. ఓ: జిల్లా సురేష్, కో- ప్రొడ్యూసర్స్: డా. ఏవీ స్వామి, ఏవీ. అనురాధ, పిన్నింటి జానకి రామారావు, కథ-మాటలు-పాటలు-సంగీతం-స్క్రీన్ ప్లే-నిర్మాత-దర్శకత్వం; బిపిన్.

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES