ఫిబ్రవరి 26న వస్తోన్న ‘బాలమిత్ర’

822

విఎస్, శ్రీ సాయి బాలాజీ ఫిల్మ్స్ బ్యానర్లపై రంగ, శశికళ, కియారెడ్డి, అనూష, దయానంద రెడ్డి, మీసాల లక్ష్మణ్ నటీనటులుగా శైలేష్ తివారి దర్శకత్వంలో శైలేష్ తివారి, బొద్దుల లక్ష్మణ్ లు నిర్మిస్తోన్న ‘బాలమిత్ర’ చిత్రం ఈ నెల 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలవుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది.

ఈ సందర్భంగా డైరెక్టర్ శైలేష్ తివారి మాట్లాడుతూ .. 2013 & 2014 రాంగోపాల్ వర్మ,మోహన్ బాబు గార్లు ఎందుకు ఫిల్మ్ ఇండస్ట్రీ లో డిస్ట్రిబ్యూటర్స్ లిమిట్ గా వున్నారు కామన్ పీపుల్స్ ఎందుకు డిస్ట్రిబ్యూషన్స్ చేయకూడదనే వారి ఆలోచన నుండి నేను డిస్ట్రిబ్యూటర్ గా,నిర్మాతగా,దర్శకుడుగా ఆ రోజు వారి ఆలోచన నుండే ఈ రోజు మీముందు నిలుచున్నాను. ఈ సినిమా చిన్నప్పుడు చదువుకున్న బాలమిత్ర , చందమామ కథల సినిమా కాదు. ఈ చిత్రం సస్పెన్స్ థ్రిల్లర్ అంశాలతో బిగినింగ్ నుండి ఎండింగ్ వరకు ప్రతి ఒక్కరిని థ్రిల్ చేస్తుంది. సినిమా చూస్తున్న ప్రతి ఒక్కరికి కచ్చితంగా గూస్ బమ్స్ వస్తాయి..నిర్మాత లక్ష్మణ్ గారు కంటెంటు, క్వాలిటీ గురించి మాత్రమే ఆలోచించండని బడ్జెట్ గురించి ఆలోచించొద్దు అని ప్రోత్సహించారు.వారి ప్రోత్సహం తో సినిమా బాగా వచ్చింది.ఇందులో నటీనటులందరూ పోటీపడి నటించారు.ఈ నెల 26న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేస్తున్నాము.మా చిత్రాన్ని ప్రేక్షకులందరు చూసి ఆశీర్వదించాలని అన్నారు.

కో డైరెక్టర్ ప్రకాష్ మాట్లాడుతూ ..మంచి కథ కథనం తో సస్పెన్స్ థ్రిల్లర్ గా వస్తున్న మా సినిమాను చూసిన వారందరూ కచ్చితంగా షాక్ అవుతారు. చూసిన ప్రేక్షకులు అందరికీ మా సినిమా తప్పక నచ్చుతుందని అన్నారు.

హీరో రంగా మాట్లాడుతూ …నా మొదటి సినిమా” స్పెషల్” తర్వాత నేను చేస్తున్న రెండవ చిత్రమే “బాలమిత్ర”.బాలు అనే వ్యక్తి ఒక ఫ్రెండ్ దగ్గర ఫ్రెండ్ దగ్గరికి ఎందుకు వెళ్లడం ఏది మూవీ చూస్తే తెలుస్తుంది ప్రతి క్యారెక్టర్ కు జస్టిఫికేషన్ ఉంటుందని అన్నారు.

హీరోయిన్ కియా మాట్లాడుతూ… నేను చేస్తున్న మొదటి చిత్రములోనే సస్పెన్స్ ,థ్రిల్లర్ మూవీలో నటించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు.

హీరోయిన్ అనుషారెడ్డి మాట్లాడుతూ ..ఇందులో నేను డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తున్నాను నాకీ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు అని అన్నారు.

నిర్మాత లక్ష్మణ్ మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి సినిమా అంటే ఇష్టం ఉండేది.ఫ్రెండ్స్ గా ఉన్న శైలేష్,తను తీసిన కొన్ని షార్ట్ ఫిల్మ్ లు గురించి నాతో డిస్కర్షన్ చేసేవాడు.ఆ క్రమంలోనే సినిమా చేద్దామనే ఆలోచన మాకు వచ్చింది.శైలేష్ కథ తయారు చేసి వినిపించడంతో ఇద్దరం ఈ మూవీ చేయడం జరిగింది. సస్పెన్స్, థ్రిల్లర్ తో పాటు మంచి ఎమోషన్ నిండిన కథతో ప్రతి ఒక్కరినీ అలరించే విధంగా ఉంటుంది. సినిమా కూడా కంటెంట్, టేకింగ్ పరంగా పెద్ద సినిమాలకు పోటాపోటీకి ఉంటుందని చెప్పగలను. సస్పెన్స్, థ్రిల్లర్ గా వస్తున్న మా “బాలమిత్ర” సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ తప్పక నచ్చుతుందని అన్నారు .

సంగీత దర్శకుడు జయవర్ధన్ మాట్లాడుతూ… సంగీత దర్శకుడిగా నాకిది 14 మూవీ. ఇప్పటివరకు నేను లవ్ ,రొమాన్స్ సినిమాలు చేశాను .బాలమిత్ర లాంటి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని ఛాలెంజింగ్ తీసుకుని చేయడం జరిగిందని అన్నారు

నటీ నటులు
రంగ, శశికళ, కియారెడ్డి, అనూష, దయానంద రెడ్డి, మీసాల లక్ష్మణ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి

సాంకేతిక నిపుణులు:
సంగీతం: జయవర్ధన్,
సినిమాటోగ్రఫీ: రజిని,
ఎడిటర్: రవితేజ,
ఫైట్స్: వెంకట్ మాస్టర్,
కొరియోగ్రఫీ: విగ్నేష్ శుక్లా,
ఆర్ట్: భీమేష్,
పీఆర్వో: బి.ఎస్. వీరబాబు,
నిర్మాతలు: శైలేష్ తివారి, బొద్దుల లక్ష్మణ్,
కథ, దర్శకత్వం: శైలేష్ తివారి

 


Veerababu PRO
9396410101