భగత్ సింగ్ నగర్’ మోషన్ పోస్టర్ లాంచ్..

565


గ్రేట్ ఇండియా మీడియా హౌస్ సమర్పణలో వలజ గౌరి, రమేష్ ఉడత్తు నిర్మాతలుగా, వలజ క్రాంతి దర్శకత్వంలో ప్రదీప్ వలజ, మిధున ధన్పాల్ హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న చిత్రం ‘భగత్ సింగ్ నగర్’ ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్ లాంచ్ ను తెలంగాణ రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి చేతుల మీదుగా శనివారం ప్రసాద్ ల్యాబ్ లో విడుదల గావించారు. ఈ సందర్భంగా ముందుగా ప్రముఖ నిర్మాత దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. ఇండస్ట్రీకు న్యూ కమర్స్ ట్రూ స్టోరీస్ తో వస్తున్నారు. అభినందించవలసిన విషయం. భగత్ సింగ్ నగర్ అనగానే నాకు విజయవాడ గుర్తొచ్చింది. లవ్ థ్రిల్లర్ స్టొరీ అని విన్నాను.. టీమ్ అందరికీ నా బెస్ట్ విషెస్ తెలియచేస్తున్నా అన్నారు.

దర్శకుడు క్రాంతి మాట్లాడుతూ.. కొత్త వాడిని అయినా నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలందరికీ నా కృతజ్ఞతలు తెలియచేస్తున్నా.. ఇక సినిమా విషయానికి వస్తే… భగత్ సింగ్ నగర్ అనే స్లమ్ ఏరియా లో జరిగే లవ్ స్టొరీ తో మొదలై త్రిల్లర్ గా టర్న్ అయ్యి క్రైమ్ గా మారే చిత్రం. ఇక నిర్మాత రమేష్ గారు కేవలం డబ్బు పెట్టడమే కాదు.. నేను స్ట్రెస్ లో ఉన్నప్పుడు చాలా మోటివేట్ చేసేవారు. ఆయన లేకపోతే నేను ఈ వేదిక లేదు. ఓ మంచి సినిమా చేసాము ఆదరిస్తారని ఆశిస్తున్నా అన్నారు.
సిపిఐ నారాయణ మాట్లాడుతూ.. కుటుంబాన్ని సంతృప్తి పరిచే వాడే అసలైన కంమ్యూనిస్ట్ అని అభిప్రాయం. మరి ఈ భగతసింగ్ నగర్ సినిమాలో ప్రేమను ఎలా చూపించారో తెలియదు కానీ.. పోస్టర్, మరియు ఫస్ట్ లుక్ మాత్రం ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ సినిమా లో మంచి సందేశం కూడా ఉందని చెబుతున్నారు. ప్రేక్షకుల సహకారంతో విజయవంతం కావాలని మనఃస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్నారు.