కర్రి బాలాజీ ‘బ్యాక్ డోర్’ -ట్రైలర్ విడుదల వేడుకలో లెజండరీ డైరెక్టర్ కె.రాఘవేంద్రరావు

270

పూర్ణ ప్రధాన పాత్రలో.. తేజ త్రిపురాన హీరోగా ఆర్చిడ్ ఫిలిమ్స్ పతాకంపై నంది అవార్డు గ్రహీత కర్రి బాలాజీ దర్శకత్వంలో బి.శ్రీనివాస్ రెడ్డి నిర్మించిన ‘బ్యాక్ డోర్’ చిత్రం సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి “క్లీన్ యు” సెన్సార్ సర్టిఫికెట్ లభించడం తెలిసిందే.
తాజాగా “బ్యాక్ డోర్” చిత్రం ట్రైలర్ లెజండరీ డైరెక్టర్ కె.రాఘవేంద్రరావు విడుదల చేసి ఈ చిత్రం కచ్చితంగా విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఆయన మాట్లాడుతూ… “బ్యాక్ డోర్” టీజర్ కి పది మిలియన్ వ్యూస్ వచ్చాయని విన్నాను. ట్రైలర్ చూశాను. చాలా బాగుంది. దీనికి కచ్చితంగా రెట్టింపు వ్యూస్ వస్తాయి. టీమ్ కి ఆల్ ది బెస్ట్” అన్నారు.
లెజండరీ డైరెక్టర్ రాఘవేంద్రరావు తమ చిత్రం ట్రైలర్ లాంచ్ చేసి, బెస్ట్ విషెస్ చెప్పడం పట్ల దర్శకుడు కర్రి బాలాజీ, హీరో తేజ త్రిపురాన సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాతలు తుమ్మలపల్లి రామసత్యనారాయణ, అంబికా రాజా ప్రత్యేక అతిధిలుగా పాల్గొని చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ చిత్రానికి కో-డైరెక్టర్: భూపతిరాజు రామకృష్ణ, పోస్టర్ డిజైన్: విక్రమ్ రమేష్, కొరియోగ్రఫీ: రాజ్ కృష్ణ, పాటలు: నిర్మల- చాందిని, సంగీతం: ప్రణవ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్: రవిశంకర్, ఆర్ట్: నాని, ఎడిటింగ్: చోటా కె.ప్రసాద్, కెమెరా: శ్రీకాంత్ నారోజ్, ప్రొడక్షన్ డిజైనర్: విజయ ఎల్.కోట, పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రేఖ, కో-ప్రొడ్యూసర్: ఊట శ్రీను, నిర్మాత: బి.శ్రీనివాస్ రెడ్డి, రచన-దర్శకత్వం: కర్రి బాలాజీ!!