సెన్సార్ కార్య‌క్ర‌మాలు విజయవంతంగా పూర్తి చేసిన అడ‌ల్ట్ కామెడీ మూవీ బీకామ్ లో ఫిజిక్స్

524

ఏడుచేప‌ల క‌థ ఫేమ్ శాం జే చైత‌న్య తెరకెక్కిస్తున్న మ‌రో అడ‌ల్ట్ కామెడీ మూవీ బీకామ్ లో ఫిజిక్స్, ఇప్ప‌టికే ఈ సినిమాకు సంబంధించిన టీజ‌ర్, ట్రైల‌ర్ త‌దిత‌ర ప‌బ్లిసిటీ కంటెంట్ కు సోష‌ల్ మీడియా హ్యూజ్ బజ్ ల‌భించింది. ఆడివాళ్ల‌ను అనే ర‌కాలు ఇబ్బంది పెట్టే మ‌గవాళ్ల‌కి ఓ ఆమ్మాయి బుద్ది ఏ రీతిన చెప్పిందో బీకామ్ లో ఫిజిక్స్ క‌థా నేప‌థ్యం. వాస్త‌వానికి అడ‌ల్ట్ కామెడీ సినిమాల‌కు సెన్సార్లు క‌త్తెర్లు త‌ప్ప‌వు అయితే తాజాగా బీకామ్ లో ఫిజిక్స్ చిత్రాన్ని సెన్సార్ స‌భ్యులు చూసి, కామెడీ చాలా బాగుందని మెచ్చుకున్న‌ట్లుగా చిత్ర నిర్మాత‌, ద‌ర్శ‌కుడు శాం జే. చైత‌న్య తెలిపారు. అతి త్వ‌ర‌లో ఈ సినిమాకు సంబంధించిన త‌దుప‌రి కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకొని విడుద‌ల చేసేందుకు రెడీ అవుతున్న‌ట్లుగా శాం అన్నారు. ఈ చిత్రానికి సంగీతాన్ని యమ్ టి క‌వి శంక‌ర్ అందించారు, సినిమాటోగ్రాఫ‌ర్ ఆర్లీ

తారాగ‌ణం

అంకిత రాజ్ పుత్, అవంతిక‌, అప్పారావు, మేఘ‌న త‌దిత‌రులు

క‌థ‌, ద‌ర్శ‌క‌త్వం, నిర్మాత – శ్యాం జే చైతన్య‌


Eluru Sreenu
P.R.O