HomeTeluguపూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా ప్రారంభమైన "ఔను.. నేనింతే'' చిత్రం..

పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా ప్రారంభమైన “ఔను.. నేనింతే” చిత్రం..

యం.ఏ.సత్తార్ సమర్పణలో శ్రీ సత్య విధుర మూవీస్ పతాకంపై రామ్ కార్తీక్, ప్రిష జంటగా డి. వి. కె నాగేశ్వరరావు దర్శకత్వంలో జి. వి. చౌదరి, నాగరాజు చిర్రా సంయుక్తంగా నిర్మిస్తున్న నూతన చిత్రం ” ఔను.. నేనింతే!!” ఈ చిత్ర పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లో ఘనంగా ప్రారంభమయ్యాయి .ఈ కార్యక్రమానికి సీనియర్ నటులు పృద్వి , అనీష్ కురువెళ్ల, రఘు కుంచె విచ్చేసారు..పూజా కార్యక్రమాల అనంతరం హీరో హీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నటులు పృద్వి క్లాప్ కొట్టగా, నటుడు అనీష్ కురువెళ్ల కెమెరా స్విచ్ ఆన్ చేసారు.చిత్ర సమర్పకులు యం ఏ. సత్తార్ గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో …

చిత్ర నిర్మాతలు జి. వి చౌదరి, నాగరాజు చిర్రా లు మాట్లాడుతూ.. ఇది నా రెండవ సినిమా. నా మొదటి చిత్రం “నీ జతలేక”..ఆ సినిమా తరువాత తీస్తున్న సినిమానే “ఔను.. నేనింతే”. దర్శకుడు నాగేశ్వరరావు చెప్పిన కథ నచ్చడంతో ఖర్చుకు వెనుకాడకుండా ఈ సినిమాను నిర్మిస్తున్నాము..ప్రతి ఒక్కరూ ఆలోచింప జేసే విదంగా తెరకేక్కుతున్న మా చిత్రానికి చక్కటి నటీ, నటులు టెక్నిషియన్స్ కుదిరారు. ఈ సినిమా ద్వారా హీరోయిన్ ప్రిష ను తెలుగు తెరకు పరిచయం చేస్తున్నాము. సినిమా అందరికీ తప్పకుండా నచ్చుతుంది అన్నారు.

చిత్ర దర్శకుడు నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఇదొక యాంటీ లవ్ స్టోరీ. రివర్స్ స్క్రీన్ ప్లే తో రాసుకున్న కథ. క్షణ క్షణం అడ్వాన్స్ అయిపోతున్న ప్రస్తుత ట్రెండ్ లో యూత్ కూడా ఇంకా అడ్వాన్స్డ్ గా చేసే పనుల వలన వారి జీవితాలను ఎలా నాశనం చేసుకుంటున్నారు అనే విషయాన్ని ప్రతి ఒక్కరికీ అర్థమయ్యే విధంగా అండర్ కరెంట్ మెసేజ్ ఇస్తూ అవుట్ & అవుట్ కామెడీ తో తెలియజేస్తున్నాము.ప్రతి తల్లి, తండ్రి కూడా పిల్లలతో కలసి చూసే విధంగా తెరకెక్కుతున్న .ఔను.. నేనింతే!సినిమా ప్రతి ఒక్కరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.

నటులు పృద్వి మాట్లాడుతూ.. యూత్ & పేరెంట్స్ కు కూడా మంచి మెసేజ్ ఇచ్చేటటువంటి ఈ సినిమాలో నేను అద్భుతమైన క్యారెక్టర్ చేస్తున్నాను. ప్రతి తల్లి తండ్రి కూడా తప్పక చూడాల్సిన సినిమా ఇది. ఇలాంటి సినిమాను అందరూ ఆదరించి హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ రఘుకుంచె మాట్లాడుతూ.. మంచి లవ్ స్టోరీ తో పాటు ఇందులో చాలా ఏమోషన్స్ కూడా వున్నాయి.ఈ సినిమాలో ఉన్న ఐదు పాటలు చాలా చక్కగా కుదిరాయి. ఇవన్నీ కూడా కూడా స్విచ్ వేషన్ తగ్గట్టు ఉంటాయి. మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.

చిత్ర హీరో రామ్ కార్తీక్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు నేను ఎనిమిది సినిమాలు చేశాను. దర్శకులు నాగేశ్వరరావు గారు చెప్పిన కథ చాలా డిఫరెంట్ గా అనిపించిడంతో ఈ సినిమా చేస్తున్నాను.ఇందులో నా పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మా నిర్మాతలు జి. వి చౌదరి, నాగరాజు చిర్రా లు సెలెక్ట్ చేసుకోని తీస్తున్న ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదములు అన్నారు.

ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్ అలవలపాటి శేఖర్ మాట్లాడుతూ.. మంచి కథతో వస్తున్న ఈ సినిమాకు హీరో, హీరోయిన్ లు, టెక్నిషియన్స్ చాలా బాగా సెట్టయ్యారు. సినిమాకు తగ్గట్టే రఘు కుంచె గారు చక్కటి పాటలు అందిస్తున్నారు. మంచి టీం మంచి కథతో వస్తున్న ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలని కోరుతున్నాను అన్నారు.

చిత్ర హీరోయిన్ ప్రిష మాట్లాడుతూ..ఇది నా మొదటి చిత్రం మంచి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను ఇలాంటి మంచి సినిమా చేసే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదములున్నారు

నటీ, నటులు;

రామ్ కార్తీక్, ప్రిష ,పృద్వి, అనీష్ కురువెళ్ల, సన, చమ్మక్ చంద్ర, రైజింగ్ రాజు, అనంత్, అభి, లిరీష , సుజాత,విజయ్ భాస్కర్ తదితరులు

సాంకేతిక నిపుణులు :
సమర్పణ : యం ఏ.సత్తార్
బ్యానర్ : శ్రీ సత్య విధుర మూవీస్
నిర్మాత : జి. వి చౌదరి, నాగరాజు చిర్రా

కథ. కథనం, మాటలు,దర్శకత్వం : డి. వి. కె. నాగేశ్వరరావు

మ్యూజిక్ : రఘు కుంచె
సినిమాటోగ్రాఫర్ :: శివా రెడ్డి సవనం
ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వర రావు
డ్యాన్స్ మాస్టర్స్ : ప్రేమ్ రక్షిత్, నిక్సన్
కో డైరెక్టర్ : రమేష్ రెడ్డి పూనూరు
ఫైట్స్ : నందు, రాజు
ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్ : అలవలపాటి శేఖర్
లైన్ ప్రొడ్యూసర్ : కోన రమేష్
పి.ఆర్.ఓ : లక్ష్మీ నివాస్

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES