ఈ నెల 20 న వస్తున్న ‘అవలంబిక’

117

అర్చన, సుజయ్, మంజూష పొలగాని ముఖ్య పాత్రల్లో రాజశేఖర్ దర్శకత్వంలో షిరిడి సాయి ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత జి శ్రీనివాస్ గౌడ్ నిర్మిస్తున్న సోసియో ఫాంటసీ హర్రర్ చిత్రం ‘అవలంబిక’. అన్ని కార్యక్రమాలు పూర్తీ చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ నెల 20 న విడుదల చేస్తున్నారు. ఇటీవల మెగా బ్రదర్ నాగబాబు ట్రైలర్ ని విడుదల చేసారు. అలాగే ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన సాంగ్స్, టైలర్ మంచి హైప్ క్రియేట్ చేయడంతో సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ సందర్బంగా దర్శకుడు రాజశేఖర్ మాట్లాడుతూ .. ఆద్యంతం ఆసక్తితో, ఉత్కంఠతో తెరకెక్కించిన చిత్రమిది. చిత్రీకరణ విషయంలో చాలా కష్టపడ్డాం, అనుకున్నది అనుకున్నట్టుగా వచ్చింది. ఈ విషయంలో మా నిర్మాత శ్రీనివాస్ గౌడ్ సపోర్ట్ చాలా ఉంది. ఇందులో ఐదు పాటలు, ఐదు ఫైట్స్ ఉంటాయి. సోసియో ఫాంటసీ హర్రర్ అంశంలతో తెరకెక్కిన ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకులకు కొత్త ఫీల్ ఇస్తుంది. అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ చిత్రాన్ని ఈ నెల 20 న థియేటర్స్ లో విడుదల చేస్తున్నాం అన్నారు.

కృష్ణ చైతన్య, లావణ్య, వై వి రావు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా వెంకీ పెద్దాడ, సంగీతం ఉదయ్ కిరణ్, ఎడిటింగ్ : శ్రీ చందు, ఆర్ట్ : రవిబాబు, నిర్మాత : జి శ్రీనివాస్ గౌడ్, దర్శకత్వం : రాజశేఖర్.