ఆగస్ట్ 13న యంగ్ హీరో నిఖిల్, చందూ మొండేటి ల ‘కార్తికేయ 2’

344

క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల‌తో పాటు విభిన్నమైన కథలతో నిర్మాణాన్ని కొన‌సాగిస్తూ విజ‌యాలు సొంతం చేసుకుంటున్న‌ క్రేజీ నిర్మాణ సంస్థ‌లు పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రి, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బేన‌ర్స్ పై ఎన‌ర్జిటిక్ యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంట‌గా చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో కార్తికేయకి సీక్వెల్ గా వస్తున్న కార్తికేయ‌ 2పై అంచనాలు భారీగా ఉన్నాయి.ఈ చిత్రాన్ని టి.జి. విశ్వ‌ప్ర‌సాద్, అభిషేక్ అగ‌ర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. ‘శాంతను ఇది నువ్వు ఆపలేని యాగం.. నేను సమిధను మాత్రమే.. ఆజ్యం మళ్లీ అక్కడ మొదలైంది.. ప్రాణత్యాగం చేసే తెగింపు ఉంటేనే దీనిని పొందగలం’ అంటూ అదిరిపోయే డైలాగ్స్ తో సాగే ట్రైలర్ 1 ఆకట్టుకుంటుంది.విడుదలైన ట్రైలర్ 1కు ఈ సినిమా పై వచ్చిన అంచనాలకు మించే స్థాయిలో ఈ థియేట్రికల్ ట్రైలర్ ఉండనుంది. ఆగష్టు 6నా కార్తికేయ 2 థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని ఆగస్ట్ 13న విడుదల కానుంది కార్తికేయ 2. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో

హీరో నిఖిల్ మాట్లాడుతూ.. ఈ సినిమాకు వర్క్ చేసిన శ్రీనివాస్ రెడ్డి,ప్రవీణ్, వైవా హర్ష,సత్య వీరందరూ అరిస్టులు హీరోలుగా బిజీగా ఉన్నా ఈ కథను, కాన్సెప్ట్, నమ్మి, ఏర్పాటు సినిమాను నమ్మి మాతో ట్రావెల్ అయ్యారు.షూటింగ్ టైమ్ లో గాని షూటింగ్ తరువాత గానీ అందరూ చాలా సపోర్ట్ చేశారు. నిర్మాతలు విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్, వివేక్ కూచిబొట్ల, మయాంక్ గార్లు అందరూ మమ్మల్ని, చందు మొండేటి గారిని నమ్మి రెండు ప్యాండమిక్ స్విచ్వేషన్స్ వచ్చినా ఆ టైమ్ లో ఎన్ని కష్టాలు వచ్చినా వెనుకడుగు వేయకుండా ఈ సినిమాను తెరకేక్కించారు. క్రియేటివ్ టీం కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు. ఆగష్టు 13 న వస్తున్న ఈ సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుంది అని చెప్పగలను. మేము విడుదల చేసిన “కార్తికేయ 2” ట్రైలర్ 1 కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అందరినుండి కూడా మంచి అప్రిసియేషన్స్ వస్తున్నాయి. మీ సినిమా ఎలా ఉన్నా థియేటర్ కు వచ్చి సినిమా చూస్తాము అని కామెంట్స్ వస్తున్నాయి. మాకు సపోర్ట్ చేస్తున్న వారందరికీ ధన్యవాదాలు.థియేటర్ ద్వారా ప్రేక్షకులకు గ్రాండ్ గా బిగ్ స్క్రీన్ పై మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని తీసిన సినిమా ఇది.అందుకే నేను ఈ మధ్య థియేటర్,థియేటర్ అంటున్నాను. ఈ సినిమా కు మేము గ్రాఫికల్ షాట్స్ గాని, మంచి లొకేషన్స్ గానీ సెలెక్ట్ చేసుకొని గ్రీస్, గుజరాత్, కష్మీర్, ఇలా అనేక ప్రదేశాలలో తీశాము. ఇప్పుడే మా సినిమా ఓటిటి లో రాదు. ఆగష్టు 13 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాకు అందరూ థియేటర్స్ కు వచ్చి చూడండి. తప్పకుండా మీకు ఒక కొత్త అనుభూతిని పొందుతారు. టీజర్, ట్రైలర్ బాగుంటేనే ఆడియన్స్ థియేటర్స్ కు వస్తారు. మేము 6 న ట్రైలర్ 2 ను రిలీజ్ చేస్తున్నాము అన్నారు.

చిత్ర నిర్మాత. టి. జి. విశ్వ ప్రసాద్ మాట్లాడుతూ..మంచి కాన్సెప్ట్ తో, మంచి విజువల్స్ తో వస్తున్న ఈ సినిమాకు నటీ నటులు, టెక్నిషియన్స్ అందరూ సహకరించడంతో ఈ సినిమా చాలా బాగా వచ్చింది. ఆగష్టు 13 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న “కార్తికేయ 2” సినిమా ప్రేక్షకులందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.

ఈ చిత్ర మరో నిర్మాత అభిషేక్ అగర్వాల్ మాట్లాడుతూ.. శ్రీకృష్ణుడు ను మోటివ్ గా తీసుకొని ఈ సినిమా తీయడం జరిగింది.ఈ సినిమా ద్వారా టి. జి. విశ్వ ప్రసాద్ తో కలసి అసోసియేట్ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది.చందు గారు ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. నిఖిల్, అనుపమ ఇలా అందరూ నటీ నటులు చాలా బాగా చేశారు. టెక్నిషియన్స్ కూడా చాలా కష్టపడ్డారు. ఈ నెల 13 న థియేటర్స్ లలో విడుదల అవుతున్న ఈ సినిమా ప్రేక్షకులందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.

చిత్ర దర్శకులు మాట్లాడుతూ. ఒక మంచి కాన్సెప్ట్ ను నమ్మి ఈ సినిమాకు మీడియా ప్రేక్షకుల ప్రోత్సాహం వుండాలి. ఆగష్టు 13 న వస్తున్న మా “కార్తికేయ 2” సినిమా ప్రేక్షకులందరికీ కచ్చితంగా నచ్చుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు

చిత్ర హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ..ఈ సినిమా చిన్న పిల్లలు నుండి పెద్దల వరకు చూసే సినిమా ఇది. ఈ నెల 13 న వస్తున్న ఈ “కార్తికేయ 2” అడ్వెంచర్ సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.

నటుడు శ్రీనివాస్ రెడ్డి, మాట్లాడుతూ..కార్తికేయ పార్ట్ 1 లో మిస్ అయినా పార్ట్ 2 లో నటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.ఏదైనా మంచి చేద్దాం అనుకున్నపుడు మనకు మంచి జరుగుతుంది అనేదానికి ఉదాహరణ ఏంటంటే ఈ సినిమా కొరకు ద్వారకా నుండి హైదరాబాద్ వరకు దాదాపు నెలరోజులు ట్రావెల్ చేశాము. మాకు ప్రకృతి సహకరించింది అనుకోవచ్చు. ఈ సినిమాలో చాలా మ్యాజిక్స్ ఉన్నాయి. కార్తీక్ ఘట్టమనేని విజువల్స్ బాగుంటాయి. కాలభైరవ మ్యూజిక్ హైలెట్ గా ఉంటుంది. ఈ నెలా13 న వస్తున్న ఈ సినిమా చాలా బాగుంటుంది. అందరూ థియేటర్ కు వచ్చి చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

నటుడు ప్రవీణ్ మాట్లాడుతూ.. 2013 లో కార్తికేయ 1 ను అరకు, బొబ్బిలిపాడు ఏరియాలలో షూట్ చేశాము.అది నా కేరీర్ లో స్వీటెస్ట్ మెమరీ.ఆ సినిమా రిలీజ్ అయిన తరువాత మా అందరికీ కేరీర్ లో ఎదుగుదలకు ఉపయోగపడిన సినిమా.8 సంవత్సరాల తర్వాత దాని సీక్వెల్ వస్తుందంటే ఎలా ఉంటుందో అనేది మొన్న ట్రైలర్ చూస్తే అర్థమైంది. ఆ సినిమా కంటే నాలుగు రెట్లు ఎక్కువ ఉంటుందని. ఈ నెల 13 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాను అందరూ థియేటర్ కు వచ్చి చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

నటుడు సత్య మాట్లాడుతూ.. కార్తికేయ పార్ట్ 1 లో నాది, ప్రవీణ్ ది మంచి క్యారెక్టర్స్. మేము ఆ సినిమాను చాలా ఎంజాయ్ చేశాము.. ఇప్పుడు వస్తున్న ఈ కార్తీకేయ 2 లో మంచి విజువల్స్ ఉన్నాయి.ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ చిత్రం కంటే కూడా ఈ చిత్రం డబుల్ హిట్ అవ్వాలి అన్నారు.

నటుడు వైవా హర్ష మాట్లాడుతూ .. ఒక యాక్టర్ ఎన్ని సినిమాలు చేసినా ఆ సినిమా నుండి ఒక ఎక్స్పీరియన్స్ తీసుకెళ్తాడు.నాకు కూడా కార్తికేయ 2 స్పిరిచువల్ జర్నీ. ఆగష్టు 13 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాను చూసిన ఆడియన్స్ ఒక కొత్త అనుభూతితో బయటకు వస్తారు అని అన్నారు.

నటుడు వెంకటేష్ మాట్లాడుతూ.. అందరూ సినిమాను చాలా ఇష్టంతో చేస్తారు. కానీ ఈ సినిమా ఇష్టం తో పాటు కష్టమైన సినిమా అనుకుంటున్నాను.కష్టపడే వారికి ఎప్పుడూ దేవుడు తోడుంటాడు అన్నట్టు ఈ సినిమాకు మాకు కృష్ణుడు తోడుంటాడని నమ్ముతున్నాను అన్నారు.

సహ నిర్మాత వివేక్ మాట్లాడుతూ.. ఈ నెల 13 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాను అందరూ థియేటర్ కు వచ్చి చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

నటీనటులు:
నిఖిల్, అనుపమ పరమేశ్వరన్, అనుపమ్ ఖేర్, శ్రీనివాస‌రెడ్డి, ప్ర‌వీణ్‌, ఆదిత్యా మీన‌న్‌, తుల‌సి, స‌త్య, వైవా హ‌ర్ష‌, వెంక‌ట్‌ తదితరులు

టెక్నికల్ టీం:

క‌థ‌-స్క్రీన్‌ప్లే-ద‌ర్శ‌క‌త్యం – చందు మెుండేటి
బ్యాన‌ర్: పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రి& అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్‌
కొ-ప్రొడ్యూస‌ర్: వివేక్ కూచిభొట్లనిర్మాత‌లు: టి.జి విశ్వ ప్ర‌సాద్‌&అభిషేక్ అగ‌ర్వాల్‌
మ్యూజిక్: కాలభైరవ
సినిమాటోగ్రాఫర్: కార్తీక్ ఘట్టమనేని
ఆర్ట్ డైరెక్టర్: సాహి సురేష్
పిఆర్ఓ: ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్