HomeTeluguమ‌డ్డి సినిమాను థియేట‌ర్స్‌లో ఆడియ‌న్స్ త‌ప్ప‌కుండా ఎంజాయ్ చేస్తారు - దిల్‌రాజు

మ‌డ్డి సినిమాను థియేట‌ర్స్‌లో ఆడియ‌న్స్ త‌ప్ప‌కుండా ఎంజాయ్ చేస్తారు – దిల్‌రాజు

భారతదేశపు మొట్టమొదటి మడ్ రేస్ చిత్రం `మడ్డి`. ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో శ్రీ వెంక‌టేశ్వ‌ర ఫిలిం డిస్ట్రిబ్యూట‌ర్స్ ప్రై.లి ప‌తాకంపై డిసెంబ‌ర్‌10న దిల్‌రాజు భారీగా విడుద‌ల‌చేస్తున్నారు. ఇంతకుముందు ఎన్నడూ చూడని కాన్సెప్ట్ తో ఉత్కంఠభ‌రితంగా సాగే ఈ చిత్రంతో డాక్టర్ ప్రగభల్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. యువన్, రిధాన్ కృష్ణ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. PK7 క్రియేషన్స్ బ్యానర్ పై ప్రేమ కృష్ణదాస్ నిర్మిస్తున్నారు. విడుద‌ల సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేఖ‌రుల స‌మావేశానికి దిల్‌రాజు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా..

దిల్‌రాజు మాట్లాడుతూ – “మ‌డ్డి సినిమా గురించి టీజ‌ర్ రిలీజైన‌ప్పుడు హ‌ర్షిత్ నాకు చూపించాడు. మేకింగ్ ఎక్స్‌ట్రార్డిన‌రీగా ఉంది. వాళ్ల‌తో ట‌చ్‌లో ఉండు సినిమా రిలీజ్ ఎప్పుడో క‌నుక్కో చెప్పాను. రెడీ కాగానే చెన్నై వెళ్లి సినిమా చూశాం. సినిమా చూడ‌గానే నేను హ‌ర్షిత్ వావ్ భ‌లే తీశారే సినిమా అనుకున్నాం. ఇద్ద‌రు ఆర్టిస్టులను పెట్టుకుని అంత బాగా తీశాడు. ఆప్లేస్‌లో ఇద్ద‌రు స్టార్ హీరోలు ఉండుంటే సినిమా వేరే లెవ‌ల్‌లో ఉండేది అనుకున్నా….అప్పుడే చెప్పా తెలుగులో వాళ్ల‌కి ఏం హెల్ప్ కావాలో క‌నుక్కో చేద్దాం అని చెప్పా…తెలుగులో మీరు రిలీజ్ చేయాలి స‌ర్ అన్నారు. సినిమా మీద అంత ప్యాష‌న్ తో తీసిన సినిమాను తెలుగు ప్రేక్ష‌కులకు త‌ప్ప‌కుండా చూపించాలి అని ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నాను. ఎక్స్‌ట్రార్డిన‌రీగా తీశాడు సినిమా. ఇది థియేట‌ర్‌లో చూసే సినిమా. బిగ్ స్క్రీన్ మీద చూస్తేనే ఆ కిక్ ఉంటుంది. ఈ క‌థ‌కి యాప్ట్ అయ్యే ఆర్టిస్టులు, ప్రాంతాల్ని ఎంచుకోవ‌డం ఛాలెంజింగ్‌గా అనిపించింది. అందుకే మా బ్ర‌ద‌ర్స్‌తోనే ఈ సినిమా తీశాను అని చెప్పాడు. ఫ్యామిలీ అంతా ప్యాష‌న్‌తో సినిమా తీశారు. ఈ సినిమా త‌ర్వాత మ‌రో ఐడియా ఉంది అని చెప్పాడు. మా లాంటి వాళ్ల స‌పోర్ట్ ఉంటే నిజంగా స్టార్ హీరోల‌తో ఇలాంటి సినిమాలు తీయెచ్చు. థియేట‌ర్స్‌లో ఈ సినిమాని త‌ప్ప‌క ఎంజాయ్ చేస్తారు.“ అన్నారు.

ద‌ర్శ‌కుడు డా. ప్ర‌గ‌భ‌ల్ మాట్లాడుతూ – “ఒక యూనిక్ మూవీని ప్రేక్ష‌కులకు అందించాల‌ని మా టీమ్ అంద‌రం ఐదేళ్లు క‌ష్ట‌ప‌డి ఈ మూవీని తెర‌కెక్కించాం. కేజీయఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతాన్ని అందిచారు. రాక్షసన్ ఫేమ్ శాన్ లోకేష్ ఎడిటర్‌గా కేజీ రతీష్ సినిమాటోగ్రఫర్‌. ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్న దిల్‌రాజుగారికి థ్యాంక్స్‌. వారి స‌పోర్ట్ దొర‌క‌డం నా అదృష్టం. ఈ సినిమా త‌ప్ప‌కుండా ప్యాన్ ఇండియా స్థాయిలో విజ‌యం సాధిస్తుంది“ అన్నారు

యువన్, రిధాన్ కృష్ణ, అనుషా సురేష్, అమిత్ శివదాస్ నాయర్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్న ఈ చిత్రంలో హరీష్ పెరాడి, ఐ ఎం విజయన్ & రెంజీ పానికర్ త‌దిత‌రులు ముఖ్య పాత్ర‌లు పోషించారు.

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES