స్లమ్ డాగ్ హజ్బెండ్ కు ఆడియెన్స్ ఇచ్చిన రెస్పాన్స్ హ్యాపీగా ఉంది – సక్సెస్ మీట్ లో మూవీ టీమ్

135

సంజయ్ రావు, ప్రణవి మానుకొండ జంటగా నటించిన ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’ మూవీ రీసెంట్ గా విడుదలై హిలేరియస్ ఎంటర్ టైనర్ గా రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. మైక్ మూవీస్ బ్యానర్ లో మరో సక్సెస్ ఫుల్ సినిమా అయ్యింది. డాక్టర్ ఏఆర్ శ్రీధర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్ననేపథ్యంలో సినిమా టీమ్ తమ సంతోషాన్ని మీడియాతో పంచుకున్నారు.

నిర్మాత అప్పిరెడ్డి మాట్లాడుతూ – మా సినిమాకు ఇంతమంచి విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులకు థాంక్స్. యూనిక్ కాన్సెప్ట్ తో సినిమా చేశాం. బీ, సీ సెంటర్స్ లో యూత్ నుంచి రెస్పాన్స్ బాగుంది. సిటీలో ఇంకా పికప్ కావాలి. మీడియా కూడా మా సినిమాకు మంచి రివ్యూస్, రేటింగ్ ఇచ్చింది. మా టీమ్ లోని ప్రతి ఒక్కరికీ థాంక్స్. భీమ్స్ సూపర్ హిట్ మ్యూజిక్ ఇచ్చారు. స్క్రీన్ మీద ఆ పాటలు చాలా బాగున్నాయి. మాలాంటి నిర్మాతలకు సక్సెస్ వస్తే మరిన్ని ఇన్నోవేటివ్ ఫిలింస్ చేస్తాము. దర్శకుడు శ్రీధర్ సినిమాను అందరికీ నచ్చేలా రూపొందించాడు. ఈ వీకెండ్ లో మా సినిమా చూసి ఎంజాయ్ చేయండి. అన్నారు.

దర్శకుడు ఏఆర్ శ్రీధర్ మాట్లాడుతూ – మంచి సినిమా చేస్తే ప్రేక్షకులు ఆదరిస్తారు అనేందుకు మా స్లమ్ డాగ్ హజ్బెండ్ సినిమానే నిదర్శనం. ఒక కొత్త పాయింట్ తో సినిమా చేశాం. అది ప్రేక్షకులకు రీచ్ అయ్యింది. కలెక్షన్స్ చాలా బాగున్నాయి. ఇంకా పెరుగుతాయని ఆశిస్తున్నాం. మా సినిమాకు పనిచేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరికీ కంగ్రాట్స్ చెబుతున్నా. అన్నారు.

హీరో సంజయ్ రావ్ మాట్లాడుతూ – మా స్లమ్ డాగ్ హజ్బెండ్ సినిమాకు మీరు చూపిస్తున్న రెస్పాన్స్ కు థాంక్స్ చెబుతున్నాం. మీడియా కూడా బాగా సపోర్ట్ చేసింది.మార్నింగ్ థియేటర్ లో ఆడియెన్స్ మధ్య సినిమా చూశాం. వాళ్ల అరుపులు, కేకలు వింటుంటేనే చాలా సంతోషంగా అనిపించింది. రీసెంట్ గా బేబీ సినిమాకు మంచి సక్సెస్ ఇచ్చారు. మా సినిమా కూడా చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది. అన్నారు.

హీరోయిన్ ప్రణవి మాట్లాడుతూ – ఈ సినిమా కోసం టీమ్ అంతా చాలా ఎఫర్ట్ పెట్టాం. అది ఇవాళ సక్సెస్ రూపంలో కనిపిస్తోంది. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో వచ్చి మా సినిమా చూస్తున్నారు. ఫన్ ఉండే మూవీ అయినా ఒక పాయింట్ వచ్చేసరికి ఎమోషన్ అవుతున్నారు. అందరూ మా స్టోరీతో కనెక్ట్ అవుతున్నారు. ఫస్ట్ డే కలెక్షన్స్ బాగున్నాయి. కొత్త వాళ్లను, న్యూ టాలెంట్ ను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తుంటారు. మాకు కూడా అలాగే సపోర్ట్ ఇస్తున్నారు. చూడని వాళ్లు స్లమ్ డాగ్ హజ్బెండ్ మూవీకి వెళ్లండి. అని చెప్పింది.

కమెడియన్ యాదమ్మ రాజు మాట్లాడుతూ – మార్నింగ్ నుంచి థియేటర్స్ తిరుగుతూ వచ్చాం. ఏ థియేటర్ వెళ్లి చూసినా రెస్పాన్స్ బాగుంది. ఎంటర్ టైన్ మెంట్ తో పాటు ఎమోషన్ కూడా ఉంది. ఇవాళ యూత్ ఎలా ఉందో మా సినిమాలో చూపించాం. అన్నారు.

నిర్మాత వెంకట్ అన్నపరెడ్డి మాట్లాడుతూ – తెలుగు స్టేట్స్ తో పాటు యూఎస్ నుంచి కూడా మా సినిమా బాగుందంటూ మెసేజ్ లు వస్తున్నాయి. మీరు ఇస్తున్న రెస్పాన్స్ థాంక్స్. సినిమాకు మేము ఆశించిన స్పందన వస్తోంది. రెండు గంటలు ఫన్, ఎమోషన్ ఫీల్ తో సినిమా చూసి బయటకు వస్తున్నారు. అన్నారు.

బిజినెస్ హెడ్ రాజేందర్ మాట్లాడుతూ – స్టార్ హీరో సినిమాలకు ఫ్యాన్స్ సపోర్ట్ ఉంటుంది కానీ ఇలాంటి మంచి మూవీస్ కు ఫిలిం లవర్స్ అంతా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. అన్నారు