ఆ ఇద్ద‌రి రుణం తీర్చుకోలేనిది – డాక్ట‌ర్ అలీ

443

అంద‌‌రూ బాగుండాలి అందులో నేనుండాలి చిత్రంలో న‌టిస్తున్న దిగ్గ‌జద్వ‌యం నిర్మాత అచ్చిరెడ్డి – ద‌ర్శ‌కుడు కృష్ణారెడ్డి

అలీవుడ్ ఎంట‌ర్ టైన్మెంట్స్ పై డాక్ట‌ర్ అలీ నిర్మిస్తున్న అంద‌రూ బాగుండాలి అందులో నేనుండాలి మెద‌టిసారిగా క‌లిసి న‌టిస్తున్న‌ అచ్చిరెడ్డి – కృష్ణారెడ్డి

ప్ర‌ముఖ న‌టుడు డాక్ట‌ర్ అలీ నిర్మాత‌గా అలీవుడ్ ఎంట‌ర్ టైన్మెంట్స్ ప‌తాకాం పై తెర‌కెక్కుతున్న చిత్రం అంద‌రూ బాగుండాలి అందులో నేనుండాలి. డాక్ట‌ర్ అలీ, డాక్ట‌ర్ విజ‌య కృష్ణాన‌రేశ్ ప్ర‌ధాన పాత్ర‌లుగా రూపొందుతున్న ఈ సినిమా ఇటీవ‌లే అంగ‌రంగ వైభవంగ మొద‌లైన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం షూటింగ్ ద‌శ‌లో ఈ సినిమాలో ప్ర‌ముఖ నిర్మాత అచ్చిరెడ్డి, ప్ర‌ముఖ సీనియర్ ద‌ర్శ‌కుడు కృష్ణారెడ్డి న‌టిస్తుండ‌టం విశేషం. ఇప్ప‌టివ‌రుకు తెర‌వెనుక‌నే ఉంటూ ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల్ని తెలుగు చిత్ర‌సీమ‌కు అందించిన ఈ దిగ్గజ‌ద్వయం తొలిసారిగా వెండితెర మీద‌కు రాబోతున్నారు. గ‌తంలో ఎస్ వీ కృష్ణా రెడ్డి హీరోగా ప‌లు చిత్రాల్లో న‌టించిన‌ప్ప‌టికీ, అచ్చిరెడ్డిగారితో క‌లిసి న‌టించ‌డం ఇదే మొద‌టిసారి అవుతుంది డాక్ట‌ర్ అలీని హీరోగా ఇంట‌ర్ డ్యూస్ చేసి, ఆయ‌న కెరీర్ ని ఓ కీల‌క మ‌లుపు తిప్పిన అచ్చిరెడ్డి – కృష్ణారెడ్డి ఇప్పుడు ఆయ‌న కోరిక మేర‌కు సినిమాలో న‌టించ‌డానికి అంగీక‌రించ‌డం విశేషం. ఈ సంద‌ర్భంగా డాక్ట‌ర్ అలీ మాట్లాడుతూ న‌న్ను హీరోగా ఇంట‌ర్ డ్యూస్ చేసి నా కెరీర్ ని కీల‌క మ‌లుపు తిప్పిన అచ్చిరెడ్డి – కృష్ణారెడ్డిగారికి మ‌ళ్లీ నేను నిర్మాతగా మారి తెర‌కెక్కిస్తున్న అంద‌రూ బాగుండాలి అందులో నేనుండాలి లో అవ‌కాశం ఇవ్వ‌డం చాలా ఆనందంగా ఉంద‌ని, ఈ సినిమాలో వారిద్ద‌రి పాత్ర చిన్న‌దైన‌ప్ప‌టికీ నా మీద అభిమానంతో న‌టించ‌డానికి అంగీక‌రించార‌ని డాక్ట‌ర్ అలీ అన్నారు. తాజాగా జ‌రిగిన షెడ్యూల్ లో అచ్చిరెడ్డి – కృష్ణారెడ్డి మీద కొన్ని కీల‌క స‌న్నివేశాల్ని చిత్ర ద‌ర్శ‌కుడు శ్రీపురం కిర‌ణ్ చిత్రీక‌రించారు. మ‌ళ‌యాలీ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ వికృతికి తెలుగు రీమేక్ సినిమాగా అంద‌రూ బాగుండాలి అందులో నేనుండాలి రాబోతుంది. ఈ సినిమాలో యువ న‌టి మౌర్యానీ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే అధికారికంగా విడుద‌ల అవుతాయి

తారాగాణం

డాక్ట‌ర్ అలీ, డాక్ట‌ర్ విజ‌యకృష్ణ న‌రేశ్, మౌర్యానీ, ప‌విత్ర లోకేశ్ త‌దిత‌రులు

టెక్నీషియ‌న్లు

బ్యాన‌ర్ – అలీవుడ్ ఎంట‌ర్ టైన్మెంట్స్
నిర్మాత‌లు – అలీబాబ‌, కొనతాల మోహ‌న‌కుమార్
డిఓపి – ఎస్. ముర‌ళి మోహ‌న్ రెడ్డి
సంగీతం – రాకేశ్ ప‌ళిడ‌మ్
పాటలు – భాస్క‌ర‌భ‌ట్ల ర‌వికుమార్
ఎడిట‌ర్ – సెల్వ‌కుమార్
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ – ఇర్ఫాన్
ఆర్ట్ డైరెక్ట‌ర్ – కేవి ర‌మ‌ణ‌
మేక‌ప్ చీఫ్ – గంగాధ‌ర్
ర‌చన, ద‌ర్శ‌క‌త్వం – శ్రీపురం కిర‌ణ్

Eluru Sreenu
P.R.O