HomeTeluguఅసలు ఏం జరిగిందంటే...

అసలు ఏం జరిగిందంటే…

ఈ సినిమా లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా.ఈ సినిమా దర్శకుడు తన కథని నమ్మి తీసిన సినిమా,  చివర వరకు కదలకుండా కూర్చోబెట్టే సినిమా.
కథ :

ఈ కథ ఇద్దరి జీవితలతో ముడి పడి ఉంటుంది.వాసు సావిల యాక్సిడెంట్ తో ఈ కథ మొదలవుతుంది, సినిమా ఆరంభంలో వాసు తన గతం మర్చిపోతాడు. సావికి ఏం జరిగిందనేది మాత్రం సస్పెన్స్ లో పెట్టారు. వాసుని తన తల్లిదండ్రులు వైజాగ్లో ని అన్న దగ్గరికి పంపిస్తారు. అక్కడ సావి ఆఫీస్ కే వాసు ఇంటర్వ్యూ కి వెళ్ళడం, సావి వాసుని చూడడం జరుగుతుంది.వాసుని సావి చూసినప్పుడల్లా ఒక ఆశ్చర్యానికి లోనవుతూ ఉంటుంది.అయితే వాసు కి వివేక్ అనే వ్యక్తితో ఎంగేజ్మెంట్ అయి ఉంటుంది. సావి వాసు మధ్య సాన్నిహిత్యం చూసి , వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉందని సావిని నిలదీస్తాడు.  అయితే తనకి ఎందుకు ఇలా అవుతుందో, ఎందుకు తన కి అట్రాక్ట్ అవుతున్ననొ తెలియడం లేదని సావి బదులిస్తుంది.ఇది జీర్ణించుకోలేని వివేక్ ఎలాగైనా వాసు ని తప్పించాలనుకుంటాడు. కానీ తన ప్రయత్నాలేవి ఫలించవు. ఏదో శక్తి తన చుట్టూ ఉండి, తనని కాపాడుతూ ఉంటుంది.అసలు ఆ శక్తి ఏంటి? ఎందుకు వాసు ని కంటికి రెప్పలా కాపాడుతుంది.? వాసు కి, సావి కి, ఆ శక్తి కి ఉన్న సంబంధం ఏంటి ? అనేది తెర పై చూడాల్సిందే !!

నటీనటులు :
ఈ సినిమా హీరో, పెదరాయుడు, ఆహా ! దేవి లాంటి సినిమాల్లో మనల్ని మెప్పించిన బాల నటుడు మహేంద్రన్, తనకున్న అనుభవం ఈ సినిమా కి చాలా ప్లస్ అయింది. రెండు పాత్రల్లో వేరియేషన్స్ చాలా చక్క గా చూపించాడు. హీరోయిన్స్ గా శ్రీ పల్లవి, కారుణ్య చౌదరి, కరోన్య కత్రేన్ వాళ్ళ పరిధి మేరకు బాగా రాణించారు.ఇక “సరిలేరు నీకెవ్వరు” సినిమా లో, “రమణా లోడెత్తాలి రా”.. డైలాగ్ తో పాపులర్ అయిన కుమనన్ ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర ను పోషించాడు. మిగతా పాత్రల్లో, హరితేజ, షఫి, జబర్దస్త్ ఫణి, షాని, యన్.టీ.ఆర్ గా చేసిన విజయ్ కుమార్ గారు మెప్పించారు.

సాంకేతిక వర్గం :
కెమెరా మెన్ కర్ణ ప్యారసాని అద్బుతమైన పని తనం చూపించాడు. ఎక్కడా ఒక చిన్న సినిమా ని చూస్తున్నట్టు అనిపించదు. ఇక సంగీతం విషయనికి వస్తే, చరణ్ అర్జున్ ఈ సినిమా కి మంచి సంగీతం అందించాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చక్కగా కుదిరింది. జార్జి రెడ్డి సినిమాకి పని చేసిన ప్రతాప్ ఈ సినిమాకి ఎడిటర్.  ఎడిటింగ్ చాలా షార్ప్ గ, ఉంటుంది. .

చివరగా.. , తన మొదటి సినిమా అయినప్పటికీ దర్శకుడు శ్రీనివాస్ భండారి ఎక్కడా తడబడకుండా.తెరకెక్కించాడు. నిర్మాత గా,  ప్రవాస భారతీయుడైన అనిల్ బొద్దిరెడ్డి , క్వాలిటీ విషయం లో రాజీ పడకుండా ఖర్చు పెట్టాడు.ఇది కుటుంబమంతా కలిసి హాయిగా ఆస్వాదించదగ్గ సినిమా.. ; ఇపుడు థియేటర్లు లేనందున Airtel Xstream లో ఈ సినిమా విడుదల చేశారు. ఈ సినిమాని  ఉచితం గా చూడవచ్చు. చూసి ఆనందించండి. ఇలాంటి చిన్న సినిమాల్ని ప్రోత్సహించండి.

RELATED ARTICLES

LATEST ARTICLES

ALL CATEGORIES