ప్రతి ఏడాది తెనాలిలో సూపర్ స్టార్ కృష్ణ స్మారక అవార్డ్ ప్రధానం. -మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్. ఏపి

25

సినీరంగంలో విశిష్ట సేవలందించిన వ్యక్తికి ప్రతి ఏడాది సూపర్ స్టార్ కృష్ణ స్మారక అవార్డ్ ప్రధానం చేస్తామని ( మా – ఏపి ) మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఆంధ్ర ప్రదేశ్ వ్యవస్థాపకుడు, దర్శకుడు దిలీప్ రాజా ప్రకటించారు. ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డును ఎవరికి అన్నది ప్రజా బ్యాలెట్ ద్వారా నిర్ణయిస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రజా బ్యాలెట్ లో అత్యధిక ఓట్లు వచ్చిన ఒకరిని సూపర్ స్టార్ కృష్ణ స్మారక అవార్డ్ కు జ్యూరీ ఎంపిక చేస్తుందని అయన చెప్పారు. తెనాలికి చెందిన కృష్ణ గారి జ్ఞాపకాలను మర్చిపోలేక ఈ మహోన్నత పురస్కారానికి శ్రీకారం చుట్టామని దిలీప్ రాజా వివరించారు. త్వరలో మహేష్ బాబుతో కూడా ఈవిషయం చర్చించబోతున్నాం. సూపర్ స్టార్ కృష్ణ స్మారక అవార్డ్ పురస్కార వేడుక జరిగే తేదీని త్వరలో తెలియజేస్తామన్నారు. పారదర్శకత కోసం దీనికి సంబంధిన విధి విధానాలపై జ్యూరీ ఇప్పటికే ప్రాథమిక చర్చలు పూర్తి చేసిందని ఆయన తెలిపారు. ప్రతి ఏటా తెనాలిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్. ఏపి నిర్ణయము చేసింది అని దిలీప్ రాజా తెలిపారు.