“అన్నపూర్ణమ్మగారి మనవడు” ట్రైలర్ విడుదల!

481

ఎమ్మెన్నార్ ఫిలిమ్స్ పతాకంపై నిర్మించబడిన పదహారణాల తెలుగు సినిమా “అన్నపూర్ణమ్మ గారి మనవడు”. ఈ చిత్రానికి నిర్మాత ఎమ్మెన్నార్ చౌదరి గారు, దర్శకుడు నర్రా శివనాగేశ్వర రావు (శివనాగు). ఈ చిత్రం సెన్సార్ బోర్డ్ నుండి క్లీన్ సర్టిఫికెట్ పొంది విడుదలకి సిద్ధంగా ఉన్నది. లాక్ డౌన్ ఎఫెక్ట్ వల్ల విడుదల ఆగిపోయి, థియేటర్స్ ఓపెనింగ్ కోసం ఎదురు చూస్తున్న సినిమాలలో “అన్నపూర్ణమ్మగారి మనవడు” ఒకటి. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకి తీసుకు రావటానికి దర్శక నిర్మాతలు కృషి చేస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ కార్యక్రమం ఇటీవల నిర్మాత తుమ్ముల ప్రసన్న కుమార్, దర్శకుడు వి.సముద్ర, బెల్లంకొండా శివ చేతుల మీదుగా జరిగింది.

ఈ సందర్భంగా తుమ్ముల ప్రసన్న కుమార్ గారు మాట్లాడుతూ…
ఎమ్.ఎన్.ఆర్ ఫిలింస్ పతాకంపై ఎమ్. ఎన్. ఆర్ చౌదరి నిర్మాతగా నర్రా శివ నాగేశ్వర రావు దర్శకత్వంలో వస్తోన్న సినిమా అన్నపూర్ణమ్మ గారి మనవడు. క్షణికమైన ఆవేశంతో జరిగే కొన్ని అవాంతరాలను ఈ సినిమాలో చూపించడం జరిగింది. ప్రేమ గురించి అత్యంత అద్భుతంగా ఈ సినిమాలో నర్రా శివనాగేశ్వర రావు చూపించడం జరిగింది. చిత్ర ట్రైలర్ బాగుంది. థియేటర్స్ ఓపెన్ అయ్యాక విడుదల కాబోతున్న ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నానాని తెలిపారు.

దర్శకుడు నర్రా శివనాగేశ్వర రావు గారు మాట్లాడుతూ…
మా అన్నపూర్ణమ్మ గారి మనవడు సినిమా ట్రైలర్ లంచ్ కార్యక్రమానికి విచ్చేసిన ప్రసన్న కుమార్ గారికి, దర్శకులు సముద్ర గారికి, బెల్లంకొండా శివ గారికి ధన్యవాదాలు. మార్చిలో విడుదల కావాల్సిన మా సినిమా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. త్వరలో చిత్ర రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తామని తెలిపారు.

వి.సముద్ర గారు మాట్లాడుతూ…
ప్రసన్న కుమార్ గారి చేతుల మీదుగా అన్నపూర్ణమ్మ గారి మనవడు సినిమా ట్రైలర్ విడుదల అవ్వడం సంతోషం. ఈ సినిమా దర్శకుడు నర్రా శివనాగేశ్వర రావు ఎన్నో మంచి చిత్రాలు తీశారు. అలాగే ఈ సినిమా కూడా తనకు మరో హిట్ అవుతుందని ఆశిస్తున్నాను. జమున గారు, బాలదిత్య, అర్చన వంటి వారు నటించిన గొప్ప సినిమా ఇది. ఈ సినిమా తప్పకుండా పెద్ద సక్సెస్ అవుతుందని భావిస్తున్నాను అన్నారు.

చిత్ర నిర్మాత ఎమ్మెన్నార్ చౌదరి గారు మాట్లాడుతూ…
దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఆనాటి అందాల నటి, కళాభారతి శ్రీమతి జమున గారు నటించటం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ. టైటిల్ రోల్స్ లో అక్కినేని అన్నపూర్ణమ్మగా సీనియర్ నటి అన్నపూర్ణ, మనవడిగా మాస్టర్ రవితేజ నటించారు. మిర్యాలగూడలో జరిగిన అమృత, ప్రణయ్ ల యదార్ధ గాధ ఆధారంగా నిర్మించబడిన ఈ చిత్రంలో అమృత పాత్రను బిగ్ బాస్ ఫేమ్ అర్చన, ప్రణయ్ పాత్రను జాతీయ ఉత్తమ నటుడు బాలాదిత్య పోషించారని తెలిపారు.