అన్నపూర్ణమ్మ గారి మనవడు’ చిత్ర ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్

507

యం.ఎన్.ఆర్ ఫిలిమ్స్ పతాకంపై నర్రా శివనాగేశ్వర్ రావు (శివనాగు) దర్శకత్వంలో సీనియర్ నటి అన్నపూర్ణమ్మ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘అన్నపూర్ణమ్మ గారి మనవడు’. యం.ఎన్.ఆర్ చౌదరి నిర్మాతగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో మాస్టర్ రవితేజ టైటిల్ రోల్ ప్లే చేస్తున్నారు. సీనియర్ నటి జమున కీలక పాత్రలో కనిపించనున్నారు.. పూర్తి పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని ఈరోజు ప్రసాద్ లాబ్స్ లో ప్రముఖ నిర్మాత, సి. కళ్యాణ్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో….

ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ మాట్లాడుతూ – “అన్నపూర్ణమ్మ గారి మనవడు’ టైటిల్ చాలా బాగుంది. మంచి పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కిన్న మూవీ. శివనాగు నాకు చాలా కాలంగా పరిచయం. అందమైన కథలను సినిమాలుగా తీస్తుంటాడు. ఈ సినిమాలో అన్నపూర్ణమ్మ గారు నటించడం మంచి విషయం. అలాగే జమునగారు మరో పాత్రలో కనిపిస్తారు. ఫస్ట్ లుక్ చాలా బాగుంది. సినిమా తప్పకుండా మీ అందరికి నచ్చుతుంది’అన్నారు.
నిర్మాత యమ్.ఎన్ ఆర్ చౌదరి మాట్లాడుతూ – ” ఒక మంచి సినిమా ద్వారా మీ ముందుకు వస్తున్నందుకు సంతోషంగా ఉంది. దర్శకుడు శివనాగు ఈ సినిమాను ఎంతో అందంగా తెరకెక్కించారు. అలాగే మాస్టర్ రవితేజ మంచిపెర్ఫామెన్స్ఇచ్చాడు.నేనునిర్మాతగావ్యవహరిస్తున్న తోలి సినిమాలో అన్నపూర్ణమ్మ, జమున లాంటి లెజెండరీ యాక్టర్స్ నటించడం నిజంగా నా అదృష్టం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సెప్టెంబర్ లో ఆడియో విడుదల చేసి అక్టోబర్ లో సినిమా విడుదల చేస్తాం” అన్నారు.