అమృత ప్రొడక్షన్స్ తదుపరి చిత్రం కలర్ ఫోటో షూటింగ్ ప్రారంభం !!!

515

హృదయ కాలేయం , కొబ్బరి మట్ట లాంటి స్పూఫ్ తో బ్లాక్ బాస్టర్స్ కొట్టిన అమృత ప్రొడక్షన్స్ తదుపరి చిత్రం కలర్ ఫోటో. ఈ సినిమాలో కమెడియన్ సుహాస్ హీరో పరిచయం కాబోతున్నాడు. మజిలీ, డియర్ కామ్రేడ్, ప్రతిరోజు పండగే వంటి చిత్రాల్లో తనదైన కామెడీతో ఆకట్టుకున్న సుహాస్ కలర్ ఫోటో సినిమాతో హీరోగా పరిచయం కాబోతున్నాడు. తెలుగమ్మాయి చాందిని చౌదరీ ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తున్నారు. ప్రముఖ నటుడు సునీల్ ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం అయ్యింది.

యూట్యూబ్ లో పాపులర్ అయ్యిన సందీప్ రాజ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు, అలాగే మత్తు వదలరా సినిమాతో సక్సెస్ అందుకున్న కీరవాణి అబ్బాయి కాల భైరవ ఈ సినిమాకు స్వరాలు సమకూరుస్తున్నాడు. కామెడీ ఎంటర్త్సైనర్ గా రాబోతున్న ఈ చిత్రం 1995 లో ఒక ఇంజనీరింగ్ కాలేజి లో జరిగే ప్రేమకథగా రూపొందుతుంది. ఈ మూవీ గురించి మరిన్ని విశేషాలు యూనిట్ త్వరలో తెలుపనున్నారు.

బ్యానర్: అమృత ప్రొడక్షన్
సమర్పణ: శ్రవణ్ కొంక
లౌక్య ఎంటర్త్సైన్మెంట్స్
నటీనటులు: సుహాస్, చాందిని చౌదరి, సునీల్ తదితరులు
నిర్మాతలు: సాయి రాజేష్ నీలం, బెన్నీ ముప్పానేని
కథ: సాయి రాజేష్ నీలం
ఆర్ట్: క్రాంతి ప్రియం
కెమెరామెన్: వెంకట్ ఆర్ శాఖమురి
ఎడిటర్: కోదాటి పవన్ కళ్యాణ్
ఫైట్స్: ఎ.విజయ్
పిఆర్ఒ: ఏలూరు శ్రీను